గద్వాల (మహబూబ్‌నగర్ జిల్లా) : గద్వాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే డి.కె.భరతసింహా రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని పేరుమైదానంలో జిల్లా సాధన సమితి సంఘం చేపట్టిన రిలే దీక్షలు 20 వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం నాయీబ్రాహ్మణుల రిలే దీక్షకు మాజీ ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు. జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలు గద్వాలకు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మావతి, జానకిరాములు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.