రేషన్ దుకాణాల్లో ప్రైవేటు దందా | private danda in ration shops | Sakshi
Sakshi News home page

రేషన్ దుకాణాల్లో ప్రైవేటు దందా

Published Fri, Nov 4 2016 3:38 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

రేషన్ దుకాణాల్లో ప్రైవేటు దందా - Sakshi

రేషన్ దుకాణాల్లో ప్రైవేటు దందా

బయటి సరుకుల్ని లబ్ధిదారులకు అంటగడుతున్న వైనం
వాటిలో కాలం చెల్లిన వస్తువులే అధికం
కొనుగోలు చేయాల్సిందేనని డీలర్ల ఒత్తిడి
టీడీపీ నేత అనుచరులే సరఫరా చేస్తున్న వైనం  
చౌకదుకాణంలో అమ్మకానికి ఉంచిన సంతోర్, ఊర్వశీ సబ్బులు 

రాయచోటి రూరల్: ఆదాయమే పరమావధిగా రేషన్ డీలర్లు కొందరు ప్రైవేటు దందాకు తెరలేపారు. దీనికి అధికారపార్టీ జిల్లాస్థారుు నేత అండదండలు ఉండటంతో రెచ్చిపోరుు మరీ కాలంచెల్లిన సరుకులను లబ్ధిదారులకు బెదిరించి మరీ అంటగడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ చౌకదుకాణా ల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యం, కందిపప్పు, పంచదార లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. కానీ కొన్నిషాపుల్లో డీలర్లు సొంత వ్యాపారం మొదలుపెట్టారు. ప్రభుత్వం అందించే వస్తువులతో పాటు ప్రైవేటు సరుకులను కూడా విక్రరుుస్తున్నారు.

అంతేకాక ఆ సరుకులు కొనుగోలు చేయాల్సిందేనని లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో 1,740 రేషన్‌షాపులు ఉండగా, వాటి పరిధిలో 7,06,472 రేషన్‌కార్డులు వినియోగంలో ఉన్నారుు. అందులో సగానికి పైగా షాపుల్లో ఈ ప్రైవేటు దందా నడుస్తున్నట్లు సమాచారం. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల డీలర్లు ఈ దందా చేస్తున్నట్లు తెలిసింది. పైగా రేషన్ డీలర్లు  ఇచ్చే వస్తువుల తూకం కూడా తక్కువగా ఇస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. 5 కిలోల బియ్యం బ్యాగు తూకం వేయగా, అది సంచీతో పాటు 4,880 గ్రాములు మాత్రమే ఉండటం గమనార్హం.

 టీడీపీ నాయకుల అనుచరులే అంతా!
ఈ వ్యవహారమంతా జిల్లాలోని రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో టీడీపీలో ఉన్న పెద్ద నాయకుని అనుచరులే చేస్తున్నట్లు సమాచారం. ప్రతినెలా 1వ తేదీకి ముందే సంతోర్ సబ్బులు, ఊర్వశీ బట్టల సబ్బులు, కారంపొడి ప్యాకెట్లు, షాంపులు, రవ్వ, గోధుమపిండి తదితర వస్తువులను ఆయా చౌకదుకాణాలకు చేర్చుతారు. అరుుతే ఇటీవల పలువురు డీలర్లు ఆ వస్తువులు అమ్మేందుకు నిరాకరించడంతో, తమకు అనుకూలంగా ఉండే వారి చౌకదుకాణాలకు మాత్రమే పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది.

 కాలం చెల్లిన వస్తువులే అధికం
డీలర్లు అమ్ముతున్న వస్తువుల్లో ఇడ్లీ, ఉప్మారవ్వ ప్యాకెట్‌పై జూన్ 8, 2016లో తయారు చేసినట్లు ఉంది. దీనికిందనే ఈ వస్తువును రెండునెలల లోపు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉందన్న ఉంది. దీంతో తెలిసిన వాళ్లు ఇవి కాలంచెల్లిన వస్తువులు కదా అని డీలర్లను ప్రశ్నించినా, అందరూ అమ్మినట్లే మేమే అమ్ముతున్నామని చెబుతున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చౌకదుకాణాల్లో ఇంత వ్యవహారం జరుగుతున్నా, అధికారులు మా త్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై రాయచోటి తహసీల్దార్ గుణభూషన్‌రెడ్డి, రాయచోటి డివిజన్ పుడ్ ఇన్‌‌సపెక్టర్ భాస్కర్‌లను వివరణ కోరగా చౌకదుకాణాల్లో ప్రైవేటు వస్తువులు అమ్ముతున్నట్లు తమ దృష్టికి రాలేదని, అలా అమ్ముతుంటే వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement