97క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
► తాటికుంట రేషన్ డీలర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌దాడులు
► ఇద్దరు రేషన్ డీలర్లపై కేసు నమోదు
తాటికుంట(మల్దకల్) : మండలంలోని తాటికుంటలో చౌకధర దుకాణాలపై శనివారం సాయంత్రం సివిల్‌సప్లై, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. షాప్ నంబర్.8, షాప్ నంబర్.30లో పంపిణీ చేయాల్సిన సబ్సిడీ బియ్యం, చక్కెర, గోధుమలు, ఉప్పును పంపిణీ చేయకుండా ఉంచిన నిల్వలను గుర్తించారు. షాపునం.8లో 46క్వింటాళ్ల 50కేజీల బియ్యం 101పాకెట్ల చక్కెర, 484ప్యాకెట్ల గోధుమలు, 200కేజీల ఉప్పు, అలాగే షాపు నం. 30లో 51క్వింటాళ్ల 50కేజీల బియ్యం, 118పాకెట్ల చక్కెర, 671కేజీల గోధుమలు, 175కేజీల ఉప్పును స్వాధీనం చేసుకుని, షాపులను సీజ్ చేశారు. షాపు నం. 8కి పాలవాయి రేషన్ డీలర్ శివకేశవ్‌రెడ్డి ఇన్‌చార్జి కాగా, 30వ షాపుకు ఉలిగేపల్లి రేషన్ డీలర్ రామచంద్రయ్య ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. వీరికి తెలియకుండా రేషన్‌షాపులు నిర్వహిస్తున్న అదే గ్రామానికి చెందిన మల్దకల్, ఆంజనేయులుపై 6ఎ కేసులు నమోదు చేశామని అధికారులు జ్యోతి, వనజాక్షి తెలిపారు. వారివెంట ఆర్‌ఐ గోవిందు, వీఆర్‌ఓ వెంకట్రాముడు, గ్రామస్తులు ఉన్నారు.