subsidy rice
-
హద్దులు దాటిన అక్రమాలు!
రాష్ట్రంలో సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతోంది. గుట్టు చప్పుడు కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. వందల క్వింటాళ్ల మేర రోజూ పక్క రాష్ట్రా లకు తరలుతోంది. డీలర్లు, రేషన్ దుకాణాల స్థాయిలో పటిష్ట వ్యవస్థ ఏర్పాటు కావడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడ్డా, క్షేత్ర స్థాయిలో తయారైన దళారీలు పేదల నుంచి పీడీఎస్ బియ్యాన్ని సేకరించి పక్క రాష్ట్రాల్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్ర సరిహద్దు జిల్లాల నుంచి రైళ్లు, ట్రక్కుల్లో బియ్యాన్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా చేస్తు న్నారు. ఆహార భద్రత చట్టం కింద తెలంగాణలో మొత్తంగా 1.91 కోట్ల మందిని అర్హులుగా తేల్చిన కేంద్రం వీరి అవసరాల మేరకు బియ్యాన్ని సరఫరా చేస్తోంది. నిజానికి రాష్ట్రంలో ఆహార భద్రత చట్టం కింద అర్హత సాధించిన వారి సంఖ్య 2.8 కోట్ల వరకు ఉంది. అదీగాక ఆహార భద్రత చట్టం కింద కేంద్రం తలా 4 కేజీల బియ్యాన్ని మాత్రమే సరఫరా చేస్తుండగా రాష్ట్రం దానికి అదనంగా మరో రెండు కిలోలు కలిపి 6 కిలోలు రూపాయికి కిలో చొప్పున పంపిణీ చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఏటా 18 లక్షల మెట్రిక్ టన్నుల మేర బియ్యం అవసరమవుతోంది. దీనికి సబ్సిడీ కింద ఏటా ప్రభుత్వం రూ.2.200 కోట్ల మేర ఖర్చు చేస్తోంది. బియ్యాన్ని ప్రతి నెలా 1 నుంచి 15 లోపు అర్హులకు పంపిణీ చేస్తున్నారు. ఈ తర్వాతే అసలు కథ మొదలవుతోంది. రేషన్ పంపిణీ ముగిశాక దళారులు, అక్రమ వ్యాపారులు రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండే గిరిజన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. గిరిజనులు ఎక్కువగా జొన్నలు, గోధుమలపై ఆధారపడే వంటకాలకే ప్రాధాన్యం ఇస్తుండటంతో వారి నుంచి దళారులు కేజీ రూ.10కు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎక్కువ మంది దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఇష్ట పడట్లేదు. అలాంటి వారి నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి వారికి గోధుమలు, జొన్నలు ఇస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని అక్రమార్కులు పలు మార్గాల ద్వారా పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ మహారాష్ట్ర హోటళ్లకు మన బియ్యం.. ఎక్కువగా అక్రమ వ్యాపారులు ప్యాసింజర్ రైళ్ల ద్వారా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, రామ గుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్ల ద్వారా ఈ దందా యథే చ్ఛగా సాగుతోంది. జమ్మికుంట, ఓదెల, కొత్తపల్లి, పెద్దపల్లి, రామ గుండం, మంచిర్యాల, మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్డు, కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లలో నుంచి నిత్యం వందల క్వింటాళ్ల రేషన్ బియ్యం పలు రైళ్లలో మహారాష్ట్రకు తరలు తున్నాయి. రాత్రి వేళల్లో అధికారుల తనిఖీలు తక్కువగా ఉంటా యనే ఉద్దేశంతో అక్రమ వ్యాపారులు వీటిని రాత్రి వేళల్లో రైళ్లలో తరలిస్తున్నారు. ప్రయాణికుల సీట్ల కింద, మరుగుదొడ్ల క్యాబిన్లలో వేసి అక్రమంగా తరలిస్తున్న బియ్యం విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధి కారులకు దొరుకుతున్నా అక్రమ వ్యాపారులు మాత్రం తప్పించు కుంటున్నారు. దొడ్డు బియ్యాన్ని మరపట్టించి దోశ, ఇడ్లీ, బియ్యం రొట్టెల్లో మన బియ్యాన్నే వాడుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర హోటళ్లకు మన బియ్యం సరఫరా అవుతున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా బోధన్, బిచ్కుంద, పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతాల నుంచి ట్రక్కులు, లారీల ద్వారా మహారాష్ట్రలోని నాందేడ్, సిరొంచలకు తరలిస్తున్నారు. ఇటీవలే పెద్దపల్లి జిల్లా కాటారం వద్ద మహారాష్ట్రలోని సిరొంచకు తరలిస్తున్న సుమారు 28 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మీదుగా కూడా మహారాష్ట్రకు బియ్యం తరలుతోంది. సరిహద్దు ప్రాంతాల నుంచీ అధికమే.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా వ్యాపారం జోరుగా సాగుతోంది. గిరిజన తండాలు, మారుమూల పల్లెల నుంచి ఏజెంట్లను పెట్టుకొని వ్యాపారులు దందా చేస్తున్నారు. గ్రామాల వారీగా బియ్యాన్ని సేకరించి, ఆటోల ద్వారా గోడౌన్లకు తరలించి, ఒక లారీ లోడు సిద్ధమయ్యాక పలు రైస్‌మిల్లుల్లో వీటిని రీసైక్లింగ్, పాలిష్ చేసి బ్రాండ్ పేరుతో 25 కేజీల బ్యాగ్ తయారు చేసి ఆంధ్రా సరిహద్దులు దాటిస్తు న్నారు. గత నెలలో ఇదే జిల్లాలో 9న అనంతారం వద్ద లారీలో అక్ర మంగా తరలుతున్న 250 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక సరిహద్దుగా ఉన్న వికారాబాద్ జిల్లా కొడంగల్, నారాయణపేట, మక్తల్‌ల పరిధిలోనూ ఈ రవాణా తీవ్రంగా ఉంది. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో అడిగేవారు, తనిఖీలు చేసే వారు లేకపోవడంతో యథేచ్ఛగా బియ్యం అక్రమంగా తరలిపోతోంది. దీని నివారణకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన జాడే లేదు. కర్ణాటక చెక్ పోస్టులు మాత్రమే ఉండటంతో వాటిని దాటి నిరాటంకంగా వ్యాపారం సాగుతోంది. ఆ అక్రమ వ్యాపారం నిరోధానికి పౌర సరఫరాల శాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటు చేసి దాడులు చేయిస్తోంది. ఈ టాస్క్‌ఫోర్స్ మూడు నెలల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 3 వేల క్వింటాళ్ల మేర పీడీఎస్ బియ్యం పట్టుకొని 60 మేర కేసులు నమోదు చేసి దందాకు ఫుల్స్టాప్ మాత్రం పడట్లేదు. -
విదేశాలకు తరలిపోతున్న సబ్సిడీ బియ్యం
సాక్షి, అమరావతి: పేదలకు అందాల్సిన సబ్సిడీ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతోంది. అయినా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, అధికారులు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ బియ్యం వ్యాపారంలో అధికార పార్టీకి చెందిన నేతలు, వారి అనుచరుల పాత్ర ఉండటంతోనే చర్యలకు వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్టాండ్లు, సినిమా థియేటర్లలో తినుబండారాలను ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారంటూ తనిఖీలు చేస్తూ హంగామా చేసే అధికారులు పేదలకందాల్సిన సబ్సిడీ బియ్యం విదేశాలకు అక్రమంగా తరలిపోతున్నా తనిఖీలు మాత్రం నిర్వహించడం లేదు. సబ్సిడీ బియ్యాన్ని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, మిల్లర్లు నేరుగా రేషన్ షాపులకు వెళ్లి లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు కొందరు డీలర్లు కూడా లబ్ధిదారులకు బియ్యం ఇచ్చే సమయంలో ఈ–పాస్ మిషన్‌పై రెండు నుంచి ఐదు కిలోల బరువున్న రాయిని ఉంచి బియ్యాన్ని అక్రమంగా సేకరిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 1.44 కోట్ల తెల్లరేషన్ కార్డుదారులకు ప్రతి నెలా దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయి. వీటిలో ప్రతి నెలా 50 వేల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని నేరుగా వ్యాపారులు కొనుగోలు చేసి వాటిని మిల్లుల్లో దాచిపెడుతున్నారు. బియ్యం ఎగుమతులకు కాకినాడ నౌకాశ్రయం అనువుగా ఉండటంతో అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఎగుమతిదారులతో చేతులు కలిపి ప్రతి నెలా నల్లబజారుకు తరలించే సబ్సిడీ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్న నిల్వల్లో కలిపేస్తున్నారు. కాకినాడ నౌకాశ్రయం నుంచి భారీగా బియ్యం ఎగుమతులు అవుతున్నా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు, విజిలెన్స్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ జిల్లాల నుంచే ఎక్కువ ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల నుంచి ఎక్కువగా సబ్సిడీ బియ్యం అడ్డదారిన ఎగుమతి అవుతున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించినా పట్టించుకునేవారే కరువయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కరప మండలం ఉప్పలంకలోని ఎగుమతిదారులకు సంధించిన మిల్లులో సబ్సిడీ బియ్యాన్ని పాలిష్ చేస్తున్నారనే సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించారు. పలు జిల్లాలకు చెందిన 11 లారీలను స్వాధీనం చేసుకొని అందులో ఉన్న బియ్యం బస్తాల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపారు. అందులో సబ్సిడీ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అయితే పట్టుబడ్డ వ్యక్తులకు వెంటనే బెయిల్ వచ్చేలా చిన్న చిన్న కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తే కాకినాడ నౌకాశ్రయం కేంద్రంగా జరుగుతున్న అక్రమ వ్యాపారం బహిర్గతమవుతుంది. కాకినాడ నౌకాశ్రయం నుంచి ఏటా 22 నుంచి 25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం విదేశాలకు ఎగుమతి అవుతున్నట్లు అధికారులు నిర్థారించారు. వీటిపై కూడా నిఘా పెట్టాలని పలువురు కోరుతున్నారు. -
97క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
► తాటికుంట రేషన్ డీలర్లపై ఎన్ఫోర్స్మెంట్దాడులు ► ఇద్దరు రేషన్ డీలర్లపై కేసు నమోదు తాటికుంట(మల్దకల్) : మండలంలోని తాటికుంటలో చౌకధర దుకాణాలపై శనివారం సాయంత్రం సివిల్సప్లై, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. షాప్ నంబర్.8, షాప్ నంబర్.30లో పంపిణీ చేయాల్సిన సబ్సిడీ బియ్యం, చక్కెర, గోధుమలు, ఉప్పును పంపిణీ చేయకుండా ఉంచిన నిల్వలను గుర్తించారు. షాపునం.8లో 46క్వింటాళ్ల 50కేజీల బియ్యం 101పాకెట్ల చక్కెర, 484ప్యాకెట్ల గోధుమలు, 200కేజీల ఉప్పు, అలాగే షాపు నం. 30లో 51క్వింటాళ్ల 50కేజీల బియ్యం, 118పాకెట్ల చక్కెర, 671కేజీల గోధుమలు, 175కేజీల ఉప్పును స్వాధీనం చేసుకుని, షాపులను సీజ్ చేశారు. షాపు నం. 8కి పాలవాయి రేషన్ డీలర్ శివకేశవ్రెడ్డి ఇన్చార్జి కాగా, 30వ షాపుకు ఉలిగేపల్లి రేషన్ డీలర్ రామచంద్రయ్య ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. వీరికి తెలియకుండా రేషన్‌షాపులు నిర్వహిస్తున్న అదే గ్రామానికి చెందిన మల్దకల్, ఆంజనేయులుపై 6ఎ కేసులు నమోదు చేశామని అధికారులు జ్యోతి, వనజాక్షి తెలిపారు. వారివెంట ఆర్ఐ గోవిందు, వీఆర్ఓ వెంకట్రాముడు, గ్రామస్తులు ఉన్నారు. -
రేషన్‌లో భారీ కోత..!
మెదక్ : పేదలకు రేషన్ దుకాణాల ద్వారా అందించే సబ్సిడీ బియ్యంపై ప్రభుత్వం గత నెల నుంచి భారీ కోత విధిస్తోంది. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం 4 నుంచి 5 శాతం వరకు పంపిణీ చేసే మొత్తంలో కోత పెడుతున్నారు. దీంతో గ్రామాల్లోని పేదలు డీలర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. గత రెండేళ్లుగా వర్షాలు సరిగా పడక గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది ప్రజలు పొట్టచేతబట్టుకొని వలస వెళ్లారు. అయినప్పటికీ వారు నెలనెలా గ్రామాలకు వచ్చి రేషన్ బియ్యం తీసుకెళ్తుంటారు. అయితే అధికారులు స్థానికంగా ఉండని ప్రజలకు రేషన్ బియ్యం ఇవ్వొద్దంటూ ఆదేశాలు జారీచేసినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే గ్రామాల్లో ట్రాక్టర్ల వంటి వాహనాలు ఉన్న వారికి సైతం బియ్యంలో కోత విధించాలని అధికారుల నుంచి డీలర్లకు ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. అధికారుల ఆదేశాలు పాటించడంతో గ్రామాల్లో ప్రజలనుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రేషన్ షాపులను వదిలేసుకోవడమే మేలని పలువురు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ పట్టణంతోపాటు మండలంలో మొత్తం 61 రేషన్ షాపులు ఉన్నాయి. వీరికి నెలకు 6023.09 క్వింటాళ్ల బియ్యాన్ని ప్రభుత్వం నెలనెలా సరఫరా చేస్తోంది. కాగా గతనెల నుంచి రేషన్ బియ్యంలో కోత విధించాలని అధికారులకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. దీంతో ప్రతినెలా డీలర్లకు సరఫరా చేసే 6023.09 క్వింటాళ్ల బియ్యంలో గతనెల 238 క్వింటాళ్ల కోత విధించారు. దీంతో ఒక్కో గ్రామానికి 4నుంచి 5 శాతం సరఫరా నిలిపివేశారు. ఫలితంగా పట్టణాలతోపాటు పల్లెల్లో డీలర్లకు ప్రజలకు మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ముఖ్యమైనది రేషన్ బియ్యమే. ఈ పథకానికి ఏమైనా అటంకాలు కల్పిస్తే...ప్రభుత్వం ఇరకాటంలో పడక తప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత కరువు, కాటకాల్లో రోజంతా కూలీ నాలీ చేసుకునే ప్రజలకు ఈ పథకం ఎంతగానో ఆదుకుంటోంది. అలాంటి గొప్ప పథకాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వానికి మచ్చ వస్తుందని పలువురు వాపోతున్నారు. ఈవిషయమై రెవెన్యూ అధికారి ఒకరు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చిన విషయం వాస్తవమేనన్నారు. వలస వెళ్లిన ప్రజల కార్డులతోపాటు గ్రామాల్లో ఉండే కొద్దిపాటి మందికి సరఫరా చేసే బియ్యంలో కోత విధించాలంటూ ఆదేశాలు జారీ అయినట్లు తెలిపారు. కానీ వలస వెళ్లేది పేదలేకదా.. అనే ప్రశ్నకు ఆయన మౌనం పాటించారు. అధికారి వివరణ ఈ విషయంపై జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి అనురాధను సాక్షి వివరణ కోరగా తాను ఇటీవలే బదిలీపై వచ్చానని, రేషన్ బియ్యం కోత విషయం తనకు తెలియదన్నారు. -
పేదల బియ్యం పెద్దల పాలు
కళ్యాణదుర్గం, న్యూస్‌లైన్: పేద ప్రజల కడుపు నింపేందుకు ఉద్దేశించిన సబ్సిడీ బియ్యం పథకం లక్ష్యం తప్పి, పెద్దల జేబు నింపే కార్యక్రమంగా మారింది. నెల రోజుల వ్యవధిలో కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలో 692 బస్తాల బియ్యం పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. వివరాలిలా ఉన్నాయి. జనవరి 21న కంబదూరు మండలంలో విజిలెన్స్ ఎస్పీ దాడులు నిర్వహించి కర్ణాటకకు తరలుతున్న 115.50 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 27న 44 బస్తాలు ఫిబ్రవరి 9న కళ్యాణదుర్గం మండలం నారాయణపురం నుంచి కర్ణాటకకు తరలుతున్న 52 బస్తాలు పట్టుబడ్డాయి, తహశీల్దార్ మహబూబ్ బాషా నిర్వహించిన దాడుల్లో నారాయణపురంలో 10, ఎర్రంపల్లిలో 44 బస్తాలు పట్టుబడ్డాయి. ఈ మధ్య కాలంలోనే బోరంపల్లి వద్ద టస్కర్ వాహనంలో తరలుతున్న 307 బస్తాలు అధికారులకు పట్టుబడ్డాయి. కాంగ్రెస్, టీడీపీ నేతలే సూత్రధారులు ఈ వ్యవహారమంతటికీ జిల్లాలోని ఓ మంత్రికి అనుచరుడైన వ్యక్తి, ఉరవకొండ ఎమ్మెల్యే అనుచరులు ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. సబ్సిడీ బియ్యం అక్రమ రవాణాకృు వీరే ప్రధాన సూత్రధారులని తెలిసినా, రాజకీయ ఒత్తిళ్లకు భయపడో, మామూళ్లకు అలవాటుపడినందునో అధికారులు వారిపై కేసులు నామమాత్రంగా నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. గతంలో బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తూ మంత్రి అనుచరుడు కళ్యాణదుర్గం తహశీల్దార్ మహబూబ్ బాషాకు పట్టుబడినా, అతనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. విజిలెన్స్ ఎస్పీ స్వాధీనం చేసుకున్న బియ్యం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరునికి చెందినవని తేలడంతో, బినామీలపై కేసు నమోదు చేసి అసలు వ్యక్తులను తప్పించినట్లు తెలిసింది. నారాయణపురం నుంచి కర్ణాటకకు తరలిస్తూ పట్టుబడిన కేసులో సూత్రధారి అయిన కాంగ్రెస్ నాయకునిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దసరా పండుగకు ముందు స్థానిక గాంధీ సర్కిల్లోని ఓ దుకాణంలో చౌక బియ్యాన్ని మామూలు సంచుల్లోకి మారుస్తుండగా దాడులు చేసిన అధికారులు, ఆ వ్యాపారి ఇచ్చిన ముడుపులు తీసుకోవడం వల్లే కేసు నమోదు చేయలేదని సమాచారం. కర్ణాటకకు తరలుతున్న బియ్యం ఉరవకొండ, కళ్యాణదుర్గం, కంబదూరు స్టాక్ పాయింట్ల పరిధిలో ఉన్న చౌకధాన్యపు డిపోల డీలర్లు ఆయా ప్రాంతాల్లోని కాంగ్రెస్, టీడీపీ నాయకులతో కుమ్మక్కై ఒక్కో స్టాక్ పాయింట్ పరిధిలో ప్రతి నెలా కనీసం 3 వేల క్వింటాళ్ల సబ్సిడీ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఈ బియ్యాన్ని రూ.800తో డీలర్ల నుంచి కొనుగోలు చేసిన బియ్యం స్మగ్లర్లు వాటిని కర్ణాటకలోని పావగడకు తరలించి రూ.1800కు విక్రయిస్తున్నారు. ప్రతి నెలా భారీగా మామూళ్లు ముడుతుండడం వల్లే ఈ వ్యవహారంపై రెవెన్యూ, పోలీసు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ధాన్యం అక్రమ నిల్వలు సీజ్
నూనెపల్లె, న్యూస్‌లైన్: నంద్యాల పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం, ధాన్యం, నూకలను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. మూలసాగరం సమీపంలోని మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి రైస్‌మిల్‌పై శనివారం దాడులు చేశారు. ఈ దాడుల్లో 8783 క్వింటాళ్ల అక్రమ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో రూ.1.70 లక్షల విలువైన 11 టన్నుల సబ్సిడీ బియాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం అక్రమ తరలింపు ఈ రైస్ మిల్లు నుంచే సరఫరా అయినట్లు గుర్తించిన అధికారులు దాడులు చేశారు. సబ్సిడీ బియ్యం లభించకపోగా భారీగా నిల్వ ఉంచిన బియ్యం, నూకలు, ధాన్యం లభించాయి. వీటి విలువ రూ. 1.23 కోట్లుగా ధ్రువీకరించారు. అనంతరం డీఎస్ఓ టి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ కన్నబాబు ఆధ్వర్యంలో అక్రమ నిల్వలపై జిల్లా వ్యాప్తంగా విసృ్తత దాడులు చేస్తున్నామన్నారు. ఆయా డివిజన్లలోని సీఎస్డీటీలు, ఎఫ్‌ఐలను బృందాలను నియమించిన ట్లు తెలిపారు. ప్రజా పంపిణీకి చెందిన బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చౌక దుకాణ సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలి స్తున్నట్లు తెలుసుకున్న ప్రజలు అధి కారులకు సమాచారం ఇవ్వాలన్నా రు. దాడుల్లో సీఎస్‌డీటీ రామనాథ్ రెడ్డి, ఎఫ్ఐ చంద్రశేఖర్, సిబ్బంది సత్తార్, ప్రసాద్ పాల్గొన్నారు.