ధాన్యం అక్రమ నిల్వలు సీజ్ | Siege of Illegal grain reserves | Sakshi
Sakshi News home page

ధాన్యం అక్రమ నిల్వలు సీజ్

Published Sun, Jan 5 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM

Siege of Illegal  grain reserves

నూనెపల్లె, న్యూస్‌లైన్: నంద్యాల పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం, ధాన్యం, నూకలను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. మూలసాగరం సమీపంలోని మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి రైస్‌మిల్‌పై శనివారం దాడులు చేశారు. ఈ దాడుల్లో 8783 క్వింటాళ్ల అక్రమ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో రూ.1.70 లక్షల విలువైన 11 టన్నుల సబ్సిడీ బియాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం అక్రమ తరలింపు ఈ రైస్ మిల్లు నుంచే సరఫరా అయినట్లు గుర్తించిన అధికారులు దాడులు చేశారు. సబ్సిడీ బియ్యం లభించకపోగా భారీగా నిల్వ ఉంచిన బియ్యం, నూకలు, ధాన్యం లభించాయి. వీటి విలువ రూ. 1.23 కోట్లుగా ధ్రువీకరించారు.

అనంతరం డీఎస్‌ఓ టి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ కన్నబాబు ఆధ్వర్యంలో అక్రమ నిల్వలపై జిల్లా వ్యాప్తంగా విసృ్తత  దాడులు చేస్తున్నామన్నారు. ఆయా డివిజన్లలోని సీఎస్‌డీటీలు, ఎఫ్‌ఐలను బృందాలను నియమించిన ట్లు తెలిపారు. ప్రజా పంపిణీకి చెందిన బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చౌక దుకాణ సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలి స్తున్నట్లు తెలుసుకున్న ప్రజలు అధి కారులకు సమాచారం ఇవ్వాలన్నా రు. దాడుల్లో సీఎస్‌డీటీ రామనాథ్ రెడ్డి, ఎఫ్‌ఐ చంద్రశేఖర్, సిబ్బంది సత్తార్, ప్రసాద్ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement