సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో దొరికిపోయిన దొంగ, మాజీ సీఎం చంద్రబాబును ఎల్లో మీడియా పునీతుడిగా, అన్నా హజారేకు అన్న మాదిరిగా ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. గతంలో చంద్రబాబును పెద్ద లంచగొండిగా పేర్కొంటూ రామోజీరావు స్వయంగా తన పత్రికలో కార్టూన్ వేయించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇప్పుడు అదే చంద్రబాబును దేశభక్తుడి మాదిరిగా చిత్రీకరించేందుకు ఈనాడు ఆపసోపాలు పడుతోందన్నారు. ఫేక్ ఉద్యమాన్ని నడిపిస్తున్న ఎల్లో మీడియా చంద్రబాబును దోమలతో చంపేలా కుట్ర చేస్తున్నారంటూ కథనాలు ప్రచురించడం పైశాచికత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. సిల్క్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై శుక్రవారం శాసనసభలో స్వల్ప కాలిక చర్చలో కన్నబాబు మాట్లాడారు.
కరెంట్ పోయిందని కహానీలు
ఒప్పందం సమయంలో కరెంట్ పోవడంతో తేదీ వేయలేదని సీమెన్స్ ఇండియా అప్పటి ఎండీ సుమ న్‌బోస్ చెప్పడం విడ్డూరంగా ఉంది. నిజమైన చీకటి ఒప్పందానికి ఇదే ఉదాహరణ. విజనరీగా ప్రచారం చేసుకునే చంద్రబాబు హయాంలో సెక్రటేరియట్, సీఎంవోల్లో కనీసం జనరేటర్ కూడా లేదా? కరెంట్ పోయిన వెంటనే సెల్‌ఫోన్‌లో టార్చ్ వేస్తున్న రోజులివి! స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు సహనిందితులు ముకుల్ అగర్వాల్, సుమన్ బోస్, వికాస్ ఖన్వేల్కర్ గతంలో ఒకే కంపెనీలో పనిచేశారు. పక్కా ఆధారాలతో ఈడీ అరెస్టు చేసిన సుమన్ బోస్ బెయిల్‌పై వచ్చి చంద్రబాబు తప్పు చేయలేదని చెప్పడం సిగ్గుచేటు.
గుజరాత్‌తో పోలిక సిగ్గుచేటు
గుజరాత్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో 85 శాతం సీమెన్స్, 15 శాతం ప్రభుత్వం భరించింది. ఇందులో సీమెన్స్ గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా కాకుండా కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా (సీఎస్‌ఆర్) రూ.99.85 కోట్లు సమకూరిస్తే ప్రభు త్వం రూ.17.10 కోట్లు ఖర్చు పెట్టింది. అదే ఏపీలో రూ.3,281 కోట్ల ప్రాజెక్టు అంటూ సీమెన్స్ పేరుతో బోగస్ ఒప్పందం చేసుకున్నారు. ఆ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటాగా ఏకంగా రూ.371 కోట్లను విడుదల చేసి అప్పనంగా దోచేశారు. చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి వచ్చిన ఒక వకీల్‌సాబ్ కోర్టుల్లో కేసు వాదిస్తుంటే లోకల్ వకీల్ సాబ్ రోడ్లపై దొర్లుతూ వాగుతున్నాడు.
పెండ్యాలకు టికెట్లు తీసింది మీరే..
చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, లోకేశ్ అనుచరుడు కిలారు రాజేష్‌ను విచారిస్తే మొత్తం బయటకొస్తుంది. వారిని ఇప్పటికే దేశం దాటించేశారు. లోకేశ్ జాతీయ మీడియాతో పెండ్యాల శ్రీనివాస్ అసలు ప్రభుత్వ ఉద్యోగి కాదని చెబుతు న్నారు. పెండ్యాల శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగే. చంద్రబాబుకు సూట్‌కేసుల్లో డబ్బులు తెచ్చింది అతడే. పైగా శ్రీనివాస్ పిక్నిక్‌కు అమెరికా వెళ్లాడని లోకేశ్ చెబుతున్నాడు. అలాగైతే మీ నాన్నను (చంద్రబాబును) అరెస్టు చేసిన వెంటనే వెనక్కి పిలిపించొచ్చు కదా? మీరే టికెట్లు తీసి ఆయన్ను అమెరికా పంపించారనేందుకు మాదగ్గర ఆధారా లున్నాయి. ఇంటర్‌పోల్ సాయం తీసుకునైనా పెండ్యాల శ్రీనివాస్, రాజేష్‌ను వెనక్కి తీసుకొస్తాం.
దొంగతనం తేటతెల్లం: పేర్ని నాని, మాజీ మంత్రి
చంద్రబాబు సీఐడీ విచారణలో నాకు తెలియదు.. మర్చిపోయా.. గుర్తులేదు అంటూ సినిమా డైలాగులు చెప్పారు. ఆయనకు బాకా ఊదే వ్యక్తులు, మీడియా సంస్థలు ఆధారాలు అడుగుతున్నాయి. లంచాలను ఫోన్‌పే, బ్యాంకు ఖాతాల ద్వారా తీసుకుంటారా? ఒకప్పుడు చంద్రబాబు ఒక్కరే ప్రజాధనాన్ని స్వాహా చేయగా లోకేశ్ రాకతో దోచుకునే జేబులు పెరిగాయి. టీడీపీ జమా ఖర్చులు చూసే దొంగ ఆడిటర్‌ను స్కిల్ డెవలప్‌మెంట్‌లో పెట్టుకుని కథ నడిపించారు. చంద్రబాబు తన గ్లామర్, గడ్డం అందాన్ని చూసి సీమెన్స్ పరుగెత్తుకుంటూ వచ్చిందని కేబినెట్‌లో కథలు చెప్పారు.
ఇప్పుడు దొంగతనం తేటతెల్లం అవుతోంది. వాటాల కోసమే టీడీపీ సభ్యులు అసెంబ్లీలో రచ్చరచ్చ చేశారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి సీటు లాక్కున్నప్పుడు కత్తి అందించిన బాలకృష్ణకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. మొన్న బావను అరెస్టు చేయగానే పార్టీ ఆఫీసులో సీట్లో కూర్చోగా ఈరోజు అసెంబ్లీలోనే చంద్రబాబు సీట్లో బాలయ్య కూర్చున్నారు. మావాడు (పవన్ కళ్యాణ్) ఒక్కసారి ఎమ్మెల్యేగా, కార్పొరేటర్‌గా కూడా గెలవలేదు. అందుకే చంద్రబాబు ఎక్కడా సంతకం పెట్టలేదని అజ్ఞానంగా మాట్లాడుతు న్నాడు. చంద్రబాబు న్యాయవాదులు ఎక్కడా స్కిల్‌లో స్కామ్ జరగలేదని వాదించట్లేదు.
రిమా ండ్ రిపోర్టులో ఏమీ లేదని ఎనిమిదేళ్ల వయసున్న తన పిల్లాడు కూడా చెబుతాడని చంద్రబాబు కుటుంబ సభ్యురాలు (నారా బ్రహ్మణి) అంటు న్నారు. ఈ వివరాలన్నీ తెలిస్తే తన తాతకు ఇంత స్కిల్ ఉందా? అని ఆ పిల్లాడికీ అర్థం అవుతుంది. తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా ఒకటే. పంజాబ్‌లో సినిమాల షూటింగ్‌ల పిచ్చి ఉన్న డేరా బాబా నేరం చేసి దొరికిపోయాడు. గోదావరి పుష్కరాల్లో అమాయకులను బలి తీసుకున్న చంద్రబాబు కూడా అదే కోవలోకి వస్తారు.
Comments
Please login to add a commentAdd a comment