
అకున్‌సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేషన్ డీలర్లకు నోటీసులు జారీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్‌సబర్వాల్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రేషన్‌డీలర్ల సమ్మెను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, సస్పెన్షన్‌కు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మహిళా సంఘాల ద్వారా లబ్ధిదారులకు జులై 5 నుంచి 10 వరకు నిత్యావసర సరకుల పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. స్థానికి పరిస్థితులనుబట్టి సరుకుల పంపిణీ పొడగిస్తామని వెల్లడించారు. రేషన్ డీలర్లు తమ బాధ్యతలను విస్మరించడం బాధకరమన్నారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1967ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.