akun sabharwal
-
కేంద్ర సర్వీసులకు అకున్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో బుధవారం పలు ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఉన్న డీఐజీ అకున్ సబర్వాల్‌ను కేంద్ర సర్వీసులకు పంపేందుకు రాష్ట్ర హోంశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఆయనను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు సమాచారం. సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వీసులోకి ఆయన వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆయన దరఖాస్తును చాలా నెల లుగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచు తూ వస్తోంది. ఇక అకున్ సబర్వాల్ స్థానంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సత్యనారాయణరెడ్డి బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. గతంలో నల్లగొండ కలెక్టర్‌గా సత్యనారాయణ రెడ్డి పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న రాజీవ్ త్రివేదిని జైళ్ల శాఖ డీజీగా బదిలీ చేశారు. కేంద్ర సర్వీసులకు వెళ్లాలని దరఖాస్తు చేసుకున్న ఏడీజీ సౌమ్య మిశ్రాపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) మాజీ డైరెక్టర్ సంతోష్ మెహ్రా కూడా కేంద్ర సర్వీసులకు వెళ్లే యోచనలో ఉన్నారు. వాస్తవానికి ఐపీఎస్ బదిలీలు గత ఏప్రిల్‌లో జరగాల్సి ఉన్నా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయాయి. అదే నెలలో పదోన్నతులు పొందిన చాలామంది ఐపీఎస్ అధికారులు ఇంకా పాత పోస్టింగ్‌ల్లోనే కొనసాగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎస్ అధికారులను బదిలీ చేసే అవకాశం కనిపించడం లేదు. మున్సిపల్ ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయిలో బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు ఉంటాయని సమాచారం. మరో ముగ్గురి బదిలీలు.. వీరితోపాటు మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులను హోంశాఖ బదిలీ చేసింది. మహబూబాబాద్ అడిషనల్ ఎస్పీగా ఉన్న ఆర్ గిరిధర్, నిర్మల్‌లో అడిషనల్ ఎస్పీగా ఉన్న బి.రాజేశ్, సైబరాబాద్ సీపీ అటాచ్మెంట్లో ఉన్న అడిషనల్ డీసీపీ జె.రాఘవేంద్రరెడ్డిలను టీఎస్పీఏ అసిస్టెంట్ డైరెక్టర్లుగా నియమించింది. -
ఆకట్టుకున్న ‘అకున్ సబర్వాల్’
సాక్షి, కరీంనగర్: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ బుధవారం కలెక్టరేట్లో ఖరీఫ్ ధాన్యం సేకరణపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాల అధికారులతో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో అందరి దృష్టిని ఆకర్షించారు. సమీక్షలో రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు నాలుగు జిల్లాల జేసీలు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో కమిషనర్ అకున్ సబర్వాల్ ఖరీఫ్ ధాన్యం సేకరణ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను వెల్లడించారు. ఆనంతరం ఒక్కొక్క జిల్లా అధికారితో పేరుపేరునా పిలుస్తూ ఆయా జిల్లాలకు కావాల్సిన గన్నీ సంచులు, వసతులు, హమాలీల కొరత తదితర విషయాలపై సవివరంగా అడిగి తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్లను పేరు పెట్టి పిలువడమే కాకుండా మార్కెటింగ్ డీడీలు, డీఆర్డీవోలు, పోలీసు అధికారులను సైతం ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తూ సమీక్షిస్తున్న తీరు అబ్బురపరిచింది. తొమ్మిది గంటలకు టప్పా చూశా.. జగిత్యాల జిల్లాకు సంబంధించి కమిషనరేట్ కార్యాలయానికి ఎలాంటి నివేదిక అందలేదని జగిత్యాల జేసీని ప్రశ్నించగా మంగళవారం పంపించినట్లు వెల్లడించడంతో రాత్రి 9 గంటలకు టప్పా చూశానని ఎలాంటి నివేదికలు అందలేదని రేపటిలోగా సమాచారం పంపించాలని సూచించారు. జగిత్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని అమీనాబేగంను జిల్లాలో సాగవుతున్న పంటలు, విస్తీర్ణం తదితర వివరాలపై ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానం చెప్పడంతో పూర్తిస్థాయి సమాచారంతో, పంటల సాగు వివరాలతో గురువారం హైదరాబాద్‌కు రావాలని సూచించారు. మంత్రి గంగులకు వినతిపత్రం కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బచ్చు భాస్కర్, అన్నమనేని సుధాకర్‌రావు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం సమీక్ష సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఖరీఫ్ సీజన్లో ధాన్యం రాబడి అధికంగా ఉన్న దృష్ట్యా వ్యాపారం నిర్వహించేందుకు రైస్‌మిల్లర్స్‌కు వెసులుబాటు కల్పించాలని కోరారు. కోనుగోలు కేంద్రాల్లో కొత్త గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలని, సరుకు నిల్వ చేసేందుకు రైస్‌మిల్లర్స్‌కు రుణసదుపాయాలు కల్పించాలని, మార్కెట్ రేట్ ప్రకారం బియ్యం ట్రాన్స్‌పోర్టు చార్జీలు చెల్లించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో రైస్‌మిల్లర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
టీ వాలెట్‌తో రేషన్ షాపుల అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: జూన్‌లో 1,700 రేషన్ షాపులను టీ వాలెట్‌తో అనుసంధానం చేస్తున్నామని పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇది తోడ్పాటుగా ఉంటుందని తెలిపారు. శనివారం సచివాలయంలో ఆయన టీ వాలెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం అకున్ మాట్లాడుతూ.. ఈ సేవలను ఆగస్టు నెలాఖరులో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తామని చెప్పారు. రంగారెడ్డిలో రెండు నెలలపాటు పైలట్ ప్రాజెక్టుగా పరిశీలించామని తెలిపారు. ఇప్పటికే మీ సేవ, ఈ సేవ, పీఎస్సీ, దోస్త్, విజయా డెయిరీ వంటి సేవలు టీ వాలెట్‌తో లింక్ అయ్యాయని చెప్పారు. కొత్తగా రేషన్ షాపులకు అనుసంధానం చేస్తున్నామని వివరించారు. మీ సేవ కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలో ఏకైక టీ వాలెట్ ఇదే అని, డిజిటల్ పేమెంట్స్‌కు గ్యారెంటీ ఇస్తున్నామని చెప్పారు. ఈ వాలెట్ ద్వారా డబ్బులు డ్రా చేసుకునే వీలును నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కల్పిస్తున్నామని తెలిపారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. నోట్లపై ఆధారపడకుండా డిజిటల్ ఉపయోగం పెంచాలని చూస్తున్నామని పేర్కొన్నారు. టీ వాలెట్ వాడకంలో ఎలాంటి చార్జీ ఉండదని తెలిపారు. -
ఈ–పాస్, ఐరిస్‌తో రూ. 917 కోట్లు ఆదా
సాక్షి, హైదరాబాద్: ఈ–పాస్, ఐరిస్ విధానంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామని, ఈ ఏడాది కాలంలో ప్రభుత్వానికి రూ. 917 కోట్ల విలువ చేసే 3.52 లక్షల టన్నుల బియ్యం ఆదా అయిందని పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఈపాస్, ఐరిస్ విధానం ద్వారా ప్రతి నెలా 15 నుంచి 20% వరకు బియ్యం మిగులు ఉందని వెల్లడించారు. పౌరసరఫరాల భవన్లో రేషన్ డీలర్లతో కమిషనర్ శనివారం నిర్వహించిన సమావేశంలో సబర్వాల్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రతి నెలా అర్హులైన 2.83 కోట్లమందికి వేల కోట్ల రూపాయల సబ్సిడీతో కిలో రూపాయి చొప్పున 6 కేజీల బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. కొన్నిచోట్ల లబ్ధిదారులు, రేషన్ డీలర్లు కలసి బియ్యాన్ని అక్రమార్కులకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. పేదల బియ్యం పక్కదారి పట్టకుండా రేషన్ డీలర్లు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ రవాణాకు సహకరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీ రాందాస్‌కు ప్రత్యేక బాధ్యత లు అప్పగించామన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టే చర్యల్లో భాగంగా టాస్క్‌ఫోర్స్ బృందాలకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందించింది. ప్రతి నెలా రేషన్ షాపుల్లో జరిగే లావాదేవీలపై ఈ బృందాలు నిఘా పెట్టి, రైస్ మిల్లులను తనిఖీ చేస్తాయని చెప్పారు. -
సీఎంఆర్ బకాయిలపై సీరియస్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సర్కారు ధాన్యంతో సొంత వ్యాపారాలు చేసుకోవడానికి మరిగిన కొందరు రైసు మిల్లర్లకు చెక్ పెట్టేందుకు పౌరసరఫరాల సంస్థ కమిషనర్ అకున్ సబర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుమారు రూ.90 కోట్లకు పైగా విలువ చేసే 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సర్కారుకు అప్పగించకుండా సాకులు చెబుతున్న మిల్లర్ల నుంచి ఆ బియ్యాన్ని ముక్కుపిండి వసూలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీని నియమించారు. శనివారం జిల్లాలో పర్యటించిన సబర్వాల్.. జాయింట్ కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు చాంబర్లో రైసుమిల్లర్లతో భేటీ అయ్యారు. ఈ సర్కారు బియ్యాన్ని వెంటనే ఎఫ్‌సీఐకి అప్పగించాలని ఆయన మిల్లర్లను ఆదేశించారు. సాకులు చెబుతున్న మిల్లర్లు..? 2018 ఖరీఫ్ సీజనులో జిల్లాలోని రైతుల వద్ద ప్రభుత్వం 2.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. సీఎంఆర్ (మర ఆడించి బి య్యం ఇవ్వడం) కోసం రైసుమిల్లులకు ఈ ధాన్యా న్ని అప్పగించింది. సుమారు 1.66 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రైసుమిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కేవలం 1.31 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ఇచ్చారు. ఇంకా 35 వేల మెట్రిక్ టన్ను ల బియ్యం ఇవ్వకుండా మిల్లర్లు సాకులు చెబుతు వస్తున్నారు. ఎఫ్‌సీఐ అధికారులు నాణ్యత లేదం టూ బియ్యాన్ని తిరస్కరిస్తున్నారంటూ దాట వేస్తూ వస్తున్నారు. ఇలా నెలల తరబడి సర్కారు బియ్యాన్ని తమ సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారనే ఆరోపణలున్న నేపథ్యంలో సబర్వాల్ సీరియస్ అయ్యారు. దీనిపై ప్రత్యేక కమిటీ నియమించారు. పౌరసరఫరాల సంస్థలోని టెక్నికల్ అధికారి, రైసుమిల్లర్లకు సంబంధించిన ఓ ప్రతినిధి, ఎఫ్‌సీఐ అధికారులు ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ మిల్లర్లు ఇస్తున్న బియ్యాన్ని ఎఫ్‌సీఐకి వెంట వెంటనే అప్పగించడంలో కీలకంగా వ్యవహరించనుంది. నిర్వహణ వ్యయాన్ని అధిగమించేందుకు.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వద్ద ఇప్పటికే రాష్ట్ర ఏడాది అవసరాలకు సరిపడా బియ్యం నిల్వలున్నాయి. ఈ 35 వేల మెట్రిక్ టన్నులను కూడా తమ వద్ద ఉంచుకుంటే రూ.90 కోట్ల విలువ చేసే ఈ బియ్యంపై వడ్డీతో పాటు నిల్వ చేసేందుకు నిర్వహణ వ్యయం భారం పడుతుందని భావించి ఈ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ మిల్లర్లు మాత్రం ఈ బియ్యాన్ని ఇవ్వకుండా జాప్యం చేస్తూ వస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే నాణ్యత పేరుతో ఎఫ్‌సీఐ అధికారులే బియ్యాన్ని తిరస్కరిస్తున్నారనే సాకులు చెబుతున్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రత్యేకంగా నియమించిన ఈ కమిటీ రైసుమిల్లర్లు ఇచ్చిన బియ్యం ఎఫ్‌సీఐకి వెళ్లేలా ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. కాగా బకాయిపడిన 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ నెల 29 నుంచి సరఫరా చేస్తామని మిల్లర్లు హామీ ఇచ్చినట్లు అధికార వర్గాలు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. -
అంగన్వాడీలకు రేషన్ ద్వారా బియ్యం
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం పౌరసరఫరాల శాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం కోసం వేలిముద్రల ఆధారంగా రాష్ట్రంలో ఉన్న 35,700 అంగన్వాడీ కేంద్రాలకు సమీపంలో ఉన్న రేషన్‌షాపుల్లో ఈ–పాస్ యంత్రాల ద్వారా బియ్యం పంపిణీ ప్రక్రియను చేపట్టింది. ఇందుకోసం అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 72 వేల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, సూపర్వైజర్ల ఆధార్‌తోపాటు వేలిముద్రలను ఈ–పాస్ మెషీన్లకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సహకారంతో అనుసంధానం చేసింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో శుక్రవారం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. మేడ్చల్ జిల్లాలోని కొన్ని రేషన్ షాపుల్లో బియ్యం సరఫరా ప్రక్రి య, అంగన్వాడీ కేంద్రాల్లో బియ్యం నాణ్యతను మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జగదీశ్వర్, డైరెక్టర్ విజయేందిర బోయి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ పరిశీలించారు. బియ్యం పంపిణీలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పౌరసరఫరాల శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో పనిచేయాలని అకున్ సభర్వాల్ సూచించారు. కాగా, రేషన్‌షాపుల ద్వారా వేలిముద్రలతో బియ్యం సరఫరాతో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
‘ఫిర్యాదుల పరిష్కారానికి సర్క్యూట్ బెంచ్’
సాక్షి, హైదరాబాద్: వినియోగదారుల కమిషన్‌లో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదుల అప్పీల్స్, రివిజన్ పిటిషన్లపై జాతీయ వినియోగదారుల వివాదాల, రిడ్రెసల్ కమిషన్ (ఎన్సీడీఆర్సీ) సర్క్యూట్ బెంచ్ సోమవారం నుంచి హైదరాబాద్‌లో విచారణ ప్రారంభించనుందని పౌరసరఫరాల కమిషనర్ అకున్ సభర్వాల్ ఆదివారం తెలి పారు. ఈ కేసుల విచారణ కోసం హైదరాబాద్ వచ్చిన జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్.కె.అగర్వాల్‌ను ఆదివారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా వినియోగదారుల ఫోరంల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఆదర్శనగర్‌లోని తెలంగాణ పుడ్ కమిషన్ కాన్ఫరెన్స్ హాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సర్క్యూట్ బెంచ్‌లో తెలంగాణ, ఏపీకి చెందిన పెండింగ్ కేసుల విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. -
నగరంలోని మల్టీప్లెక్స్‌ల్లో అధికారులు తనిఖీలు
-
నగరంలోని మల్టీప్లెక్స్‌ల్లో తనిఖీలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లపై తూనికలు కొలతల శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయిన కూడా వారు నిబంధనలకు పాటించడంలేదని వార్తలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ పరిధిలోని ప్రసాద్ మల్టీప్లెక్స్, ఉప్పల్ ఏషియన్, ఏఎస్ రావు నగర్‌లోని రాధిక, జీవీకే మాల్, కాచిగూడ ఐనాక్స్‌తో పాటు ఇతర మల్టీప్లెక్స్‌ల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందుకోసం ఏడు టీమ్‌లను ఏర్పాటు చేసినట్టు ఆ శాఖ కంట్రోలర్ అకూన్ సబర్వాల్ తెలిపారు. ఇప్పటి వరకు అధికారులు 20 కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కాచిగూడ ఐనాక్స్కు నోటీసులు ఈ రోజు ఉదయం తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో కాచిగూడలోని ఐనాక్స్ ధియేటర్లో అధికారులు దాడులు నిర్వహించారు. ప్రమాణాలు పాటించకుండా వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించిన అధికారులు యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. ఐనాక్స్ నిర్వహకులు నెట్ క్వాంటిటి, ఎమ్మార్పీ ధరలు లేకుండా అమ్మకాలు చేపట్టడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.పలు శ్యాంపిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ ఏషియన్, కొత్తపేట మహాలక్ష్మీ థియేటర్‌పై మూడు కేసులు నమోదు చేసినట్టు ఏసీసీ జగన్మోహన్ తెలిపారు. చాలా వరకు థియేటర్లలో నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్టు తేలిందన్నారు. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సుల్లో ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా కొంతకాలంగా ప్రేక్షకుల నుంచి తూనికల శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో అధిక ధరలకు అడ్డుకట్ట వేయడానికి తూనికలు కొలతల శాఖ చర్యలు చేపట్టింది. -
అతిక్రమణకు తప్పదు భారీ మూల్యం
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 1 నుంచి సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లలో మంచినీటి బాటిళ్లు, శీతలపానీయాలు, ఇతర తినుబండారాలు ఎంఆర్పీ ప్రకార మే విక్రయాలు జరిపేలా తూనికలు కొలతల శాఖ దృష్టిపెట్టింది. ఎంఆర్పీ కంటే అదనంగా ఒక్క రూపాయి వసూలు చేసినా.. తూనికల కొలతల శాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా భారీ జరి మానాతో పాటు జైలు శిక్ష విధించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. విడిగా విక్రయించే తినుబండారాలు, పానీయాలకు సంబంధించి ధర, పరిమాణం వివరాలు స్టిక్కర్ రూపంలో కచ్చితంగా నమోదు చేసేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదుల నేపథ్యంలో.. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సుల్లో ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా కొంతకాలంగా ప్రేక్షకుల నుంచి తూనికల శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో అధిక ధరలకు అడ్డుకట్ట వేయడానికి తూనికలు కొలతల శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. నిర్ణీత ధరలకే విక్రయించాలని స్పష్టం చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని థియేటర్ యాజమాన్యాలకు అవగాహన కల్పించింది. కొత్త నిబంధనలపై అకున్ సబర్వాల్ సమీక్ష థియేటర్లలో అధిక ధరల విక్రయాల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, కొత్త నిబంధనల అమలుపై కంట్రోలర్ అకున్ సబర్వాల్ ఆదివారం గాంధీనగర్ లోని తూనికల కొలతల శాఖ కార్యాలయంలో అన్ని జిల్లాల అసిస్టెంట్ కంట్రోలర్లు, ఇన్స్పెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారుల కోసం ఉద్దేశించిన వ్యాపారం, సేవ, వినోదం ఏదైనా చట్టబద్ధంగా జరగాలన్నారు. ఏ ఒక్క వినియోగదారుడికి నష్టం జరిగేలా థియేటర్ల యాజమాన్యాలు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విడిగా అమ్మే తినుబండారాలు, అందించే కం టైనర్లపై బరువు, పరిమాణం, తయారీ గడువు, తేదీలతో పాటు ఎంఆర్పీ స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్ ఉండాలన్నారు. ఇవన్నీ ప్రేక్షకులకు స్పష్టంగా కని పించేలా బోర్డుపై ప్రదర్శించాలని, ధర మారితే ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేయాలన్నారు. ఒకే బ్రాండ్ తినుబండారాలు కాకుండా వినియోగదారుడి కి వివిధ బ్రాండులు అందుబాటులో ఉంచాలన్నారు. తూనికలు కొలతల శాఖ చట్టం ప్రకారం ప్యాకేజ్డ్ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి చిరునామా, వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు తదితర వివరాలు ఉండాలని తెలిపారు. 4, 5 తేదీల్లో తనిఖీలు.. కొత్త నిబంధనల అమలుపై ఆగస్టు 2, 3 తేదీ ల్లో గ్రేటర్ హైదరాబాద్, హెచ్ఎండీఏ పరిధిలోని థియేటర్లు, మల్టీప్లెక్సు ల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని అకున్ సబర్వాల్ తెలిపారు. అనంతరం 4, 5 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. ఒకే ధర విధానాన్ని అమలు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి కేసు నమోదు చేసి రూ.25 వేల ఫైన్, రెండోసారి రూ.50 వేల ఫైన్, మూడోసారి రూ.లక్ష జరిమానాతో పాటు 6 నెలల నుంచి ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. వినియోగదారుల ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్సాప్ నంబర్ 7330774444ను విధిగా సినిమా హాళ్లలో ప్రదర్శించాలని చెప్పారు. -
‘పైసా ఎక్కువ వసూలు చేసినా కేసే’
సాక్షి, హైదరాబాద్ : మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లల్లో ప్యాకేజ్డ్ వస్తువులను ఎంఆర్పీ రేటు కంటే ఎక్కువ ధరకు విక్రయించరాదని తూనికల, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. సినిమాహాళ్లలో, మల్టీప్లెక్స్‌లలో ఎంఆర్పి కంటే అధికంగా వసూలు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో తూనికల కొలతల శాఖ గత నెలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై కేసులు నమోదు చేసింది. ఈ విషయంపై మంగళవారం రోజు పౌరసరఫరాల భవన్లో సినిమాహాల్స్, మల్టీప్లెక్స్ యజమాన్యాలతో అకున్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బహిరంగ మార్కెట్లో ఎంఆర్పీ ప్రకారం ఏవిధంగా అయితే వస్తువులను విక్రయిస్తారో అదే విధంగా సినిమాల హాళ్లు, మల్టిప్లెక్స్‌లలో కూడా విక్రయించాలని ఆదేశించారు. ఎంఆర్పి కంటే ఒక్క పైసా కూడా అధికంగా వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. పైసా అదనంగా వసూలు చేసినా తూనికల కొలతల శాఖ ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. వినియోగదారుల చట్టం ప్రకారం ప్రతి వస్తువు విక్రయానికి సంబంధించి వినియోగదారునికి ఖచ్చితంగా బిల్లు ఇవ్వాలని, ఇది ప్రతి మల్టీప్లెక్స్, సినిమా థియేటర్ యజమాన్యాల బాధ్యత అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేది నుంచి కచ్చితంగా ధరలను ముద్రించుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులతో పాటు అధిక మొత్తంలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 180042500333, వాట్సాప్ నంబర్ 7330774444కు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. -
తెలంగాణలో రేషన్ డీలర్లకు నోటీసులు జారీ
-
తెలంగాణ రేషన్ డీలర్లకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేషన్ డీలర్లకు నోటీసులు జారీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్‌సబర్వాల్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రేషన్‌డీలర్ల సమ్మెను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, సస్పెన్షన్‌కు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మహిళా సంఘాల ద్వారా లబ్ధిదారులకు జులై 5 నుంచి 10 వరకు నిత్యావసర సరకుల పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. స్థానికి పరిస్థితులనుబట్టి సరుకుల పంపిణీ పొడగిస్తామని వెల్లడించారు. రేషన్ డీలర్లు తమ బాధ్యతలను విస్మరించడం బాధకరమన్నారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1967ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. -
ప్రభుత్వంతో రేషన్ డీలర్ల చర్చలు విఫలం
-
‘ఎక్సైజ్’ సేవలు అభినందనీయం
కాజీపేట అర్బన్: మేడారం జాతరలో ఉమ్మడి వరంగల్ ఎక్సైజ్ సిబ్బంది సేవలు అభినందనీయమని రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అన్నారు. మేడారం జాతరలో పాల్గొన్న ఎక్సైజ్ సిబ్బందికి హైదరాబాద్‌లోని ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయంలో శనివారం అభినందన సభను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అకూన్‌సబర్వాల్ హాజరై మాట్లాడారు. మేడారం జాతరలో కోటీ 20లక్షల మంది భక్తులు పాల్గొనగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎక్సైజ్ సిబ్బంది చర్యలు చేపట్టడం అభినందనీయం అన్నారు. గత మేడారం జాతరలో ఎక్సైజ్‌శాఖకు రూ. 2.47 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది 3. 76 కోట్లు లభించిందని అన్నా రు. విశిష్ట సేవలందించిన ఉమ్మడి వరంగల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు కరంచంద్, టీ.శ్రీనివాస్, ఎంటీఆర్.చంద్రశేఖర్, శ్రీనివాస్, నర్సింహారెడ్డి, ఎస్సైలు కే.ఎస్.సత్యనారాయణ, సీ.సుబ్బరాజు, మాన్సింగ్, భాస్కర్‌రెడ్డి, రాంమోహన్‌రావులతో పాటు ఎనిమిది మంది కానిస్టేబుళ్లను అభినందించి ప్రశాంసా పత్రం, మెమోంటోలను అందజేశారు. కార్యక్రమంలో డీసీ సురేష్ రాథోడ్, వరంగల్ రూరల్ జిల్లా ఎక్సైజ్‌సూపరింటెండెంట్ శ్రీనివాస్, భూపాలపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న అక్కాతమ్ముళ్ల ప్రసంగం
ఇబ్రహీంపట్నంరూరల్: యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. యువత చెడు ధోరణులకు అలవాటు పడుతున్నారని, మత్తుపదార్థాల జోలికి వెళ్లి జీవితం నాశనం చేసుకోవద్దని సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లి గ్రామ సమీపంలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సిన్సియా– 2కె18 పేరుతో సాంకేతిక సంబరాలు జరిగాయి. రెండో రోజు ప్రభుత్వ అధికారులు, ప్రముఖుల చేత ముఖాముఖి, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అకున్‌సబర్వాల్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ స్కూళ్లల్లో విద్యా ర్థులు డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలను పా డు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను మత్తు రహిత నగరంగా తీర్చిదిద్దామని చెప్పారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ను పట్టుకుని 21 మందిని అరెస్టు చేసి 12 కేసు లు నమోదు చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభు త్వం డ్రగ్స్ విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. మీడియా, సెల్ఫోన్ల ప్రభావం వల్ల యువత చెడు అలవాట్లకు లోనవుతున్నా రని చెప్పారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని సూచించారు. అనంత రం విద్యార్థులు, అధ్యాపకులు అడిగిన పలు ప్ర శ్నలకు అకున్‌సబర్వాల్ సమాధానం ఇచ్చారు. చదువే అన్నింటికీ సమాధానం కార్యక్రమంలో పాల్గొన్న ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం నిర్వాహకులు పరిపూర్ణానంద స్వామీజీ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్య అంటే సమాధానం, పరిష్కార మార్గమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని, వారిని జీవితకాలం చూసుకోవాలన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను గుర్తుంచుకోవాలని సూచించారు. భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించడానికి అందరం కలిసి కృషిచేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరినీ విద్యావంతులను చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో 300 గ్రామాలను దత్తత తీసుకొని అందులో వెనుకబడిన తరగతులకు చెందిన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామని వెల్లడించారు. ఆకట్టుకున్న అక్కాతమ్ముళ్ల ప్రసంగం పదిహేడేళ్ల అతి చిన్న వయసులోనే పీహెచ్డీ ప్రవేశం పొందిన అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిని నైనా జైస్వాల్, 9 సంవత్సరాల ప్రాయంలోనే పదో తరగతి పూర్తి చేసిన అగస్త్య జైస్వాల్‌లు విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. తల్లిదండ్రుల తో పాటు గురువుల ప్రోత్సాహం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పారు. తెలుగు, హిందీ, సంస్కృత భాషల్లో చక్కగా మాట్లాడి అబ్బుర పరిచారు. చదువుల్లో, ఆటల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ రాఘవ చిరబుడ్డి, కళాశాల ప్రిన్సిపల్ నయనతార, వైస్ ప్రిన్సిపల్ రామశాస్త్రీ, జేఎన్టీయూ రిటైర్డ్ రిజిస్ట్రార్ కిషన్‌లాల్, కళాశాల సీనియర్ ప్లేస్మెంట్ అధికారి విజయ మేరీ, వివిధ విభాగాల హెచ్ఓడీలు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. చదువులు సమాజానికి ఉపయోగపడాలి ఇబ్రహీంపట్నంరూరల్: మనం చదివిన చదువులు సమాజం కోసం ఉపయోగపడాలని సాంకేతిక విద్యశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మంగళ్‌పల్లి గ్రామ సమీపంలో గల సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గత రెండు రోజులుగా సిన్సియా 2కె18 పేరుతో సాంకేతిక సంబరాలు జరిగాయి. ముగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా నవీన్ మిట్టల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతికరంగంలో విద్యార్థులు పురోగతి సాధించాలన్నారు. ప్రస్తుతం సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని, మార్పులకు అనుగుణంగా కొత్త ఆవిష్కరణ కనుగొనాలన్నారు. కృషి, పట్టుదలతో విద్యనభ్యసిస్తే అనుకున్నది సాధించడం ఖాయమన్నారు. ప్రతి ఒక్కరూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్చుకొని దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం నవీన్‌మిట్టల్‌ను కళాశాల చైర్మన్ రాఘవ చీరబుడ్డీ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నయనతార, సీనియర్ ప్లేస్మెంట్ అధికారి విజయమేరీలతో పాటు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
డ్రగ్స్‌కేసులో మరో కీలక అడుగు..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంతో పాటు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌కేసులో మరో కీలక అడుగు పడింది. దర్యాప్తుకు సంబంధించిన చార్జిషీట్లు దాఖలు చేయడానికి సిట్ బృందం రంగం సిద్ధం చేస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా భాగ్య నగరానికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న డ్రగ్స్ రాకెట్‌ను తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ గుట్టు రట్టుచేసిన సంగతి తెలిసిందే. ఈకేసుకు సంబంధించి సంబంధించి సిట్ మొత్తం 12 కేసులు నమోదుచేసింది. వీటిలో 5 కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలు సిట్ బృందానికి అందాయి. కొకైన్కు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలు వచ్చాయని అధికారులు వెల్లడించారు. వీటితో కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేయనున్నట్లు సిట్ తెలిపింది. ఈ నెల 8న మూడు కేసులు, 12న మరో రెండు కేసులపై చార్జిషీట్లు దాఖలు చేసే అవకాశం ఉంది. డ్రగ్స్కేసుల విచారణలో భాగంగా సిట్ బృందం 22 మందిని అరెస్టుచేసింది. వారి కాల్‌డేటా ఆధారంగా సినీరంగానికి చెందిన 12 మందికి ప్రముఖులకు నోటీసులు జారీచేసింది. వారందరినీ విచారించిన సిట్ బృందం దర్శకుడు పూరి జగన్నాథ్, నటుడు తరుణ్ నుంచి గోళ్లు, వెంట్రుకలు, రక్తనమూనాలను సేకరించింది. అయితే అంతకు ముందుగానే అరెస్టుచేసిన మరో 22 మంది నుంచి కూడా సిట్ నమూనాలను సేకరించింది. సినీరంగానికి చెందిన ఇద్దరు కలిపి మెత్తం 24 మంది నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించింది. అప్పటి నుంచి దీనిపై పరీక్షలు జరిపిన ఫోరెన్సిక్ అధికారులు తాజాగా 5 కేసుల రిపోర్టులను కోర్టుకు అందించింది. కోర్టునుంచి నివేదికలు పొందిన సిట్ బృందం చార్జిషీట్లు నమోదుచేసే పనిలో నిమగ్నమైంది. డ్రగ్స్ కేసులో సాక్ష్యాధారాల సేకరణ పూర్తైందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. దొరికిన లింకుల ఆధారంగా సాక్ష్యాలను సేకరించి నిందితులకు శిక్షపడేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నట్టు ఆయన తెలిపారు. నిందితులిచ్చిన వాంగ్మూలాలు, సిట్ అధికారుల వద్ద ఉన్న సాక్ష్యాలను క్రోడీకరించి కేసు దర్యాప్తు చేసినట్టు వివరించారు. ఈ కేసులో నిందితులు కెల్విన్, మైక్ కమింగలతో పాటు పలువురి నుంచి ఆధారాలను సేకరించామని చెప్పారు. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసు : కెల్విన్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ జైలు నుంచి విడుదలయ్యారు. నాంపల్లి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆదివారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి తనపై వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలని కెల్విన్ అన్నారు. ఇకపై సాధారణ జీవితాన్నే కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు. ఆరు నెలల కిందట వెలుగు చూసిన డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును విచారించింది. ఈవెంట్ మేనేజర్‌గానూ పనిచేసిన కెల్విన్‌కు అంతర్జాతీయ, గోవా డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని, టాలీవుడ్‌లోని పలువురు దర్శకులు, నటీనటులకు అతను మాదకద్రవ్యాలను సరఫరా చేశాడని నిర్ధారించాయి. ఈ క్రమంలో ఆయా దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్లను సిట్ విచారించింది. కాగా, దర్యాప్తు దశలోనే ఈ కేసు నీరుగారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. (చదవండి : డ్రగ్స్ కేసు కథ కంచికేనా!) -
డ్రగ్స్ కేసులో డచ్ వ్యక్తి అరెస్ట్
- 2.8 గ్రాముల డీఎంటీ డ్రగ్ స్వాధీనం - కెల్విన్‌కు డ్రగ్స్ సరఫరా చేసింది ఇతడే! - నెదర్లాండ్స్ నుంచి ఇప్పటిదాకా నాలుగుసార్లు భారత్‌కు వచ్చాడు: అకున్ సాక్షి, హైదరాబాద్: కెల్విన్‌కు డ్రగ్స్ సరఫరా చేసిన ఓ కీలక వ్యక్తిని ఎక్సైజ్ సిట్ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. నెదర్లాండ్స్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైక్ కమింగ.. కెల్విన్‌కు డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఇతడు నాలుగు సార్లు భారత్‌కు వచ్చాడని, అందులో రెండుసార్లు హైదరాబాద్‌కు వచ్చినట్టు వివరించారు. అతడి నుంచి 2.8 గ్రాముల డీఎంటీ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు బుధవారం మీడియాకు వెల్లడించారు. టెకీలకు అలవాటు చేశాడా? కెల్విన్ ముఠాతో చేతులు కలిపి మైక్ కమింగ హైదరాబాద్‌లోని పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న టెకీలకు డ్రగ్స్ సరఫరా చేశాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. పదేపదే కెల్విన్ కాల్‌డేటాలో కమింగ నంబర్లు, వాట్సాప్, తదితర సోషల్ మీడియా ద్వారా డ్రగ్స్ వ్యవహారంపై సంభాషణలున్నట్టు సిట్ గుర్తించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు డార్క్‌నెట్‌లో డ్రగ్స్ ఆర్డర్ ఇస్తే వారి అడ్రస్‌లకు కమింగ కొరియర్ల ద్వారా పంపించి ఉంటాడన్న కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది. వందల మంది టెకీలు డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ఇప్పటికే సిట్ అనుమానిస్తోంది. హైదరాబాద్ యువతితో వివాహం: నెదర్లాండ్‌లో స్థిరపడిన హైదరాబాదీ శిల్ప అలియాస్ మేరీని మైక్ వివాహం చేసుకున్నట్టు సిట్ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌కు చెందిన దేవదాస్, నళిని దంపతుల కుమార్తె ఉన్నత విద్యాభ్యాసం చేసి నెదర్లాండ్స్‌లోనే సెటిల్ అయినట్టు అధికారులు తెలిపారు. మేరీ ద్వారా ఉన్న పరిచయాలతో హైదరాబాద్‌లో పలువురితో మైక్ స్నేహం చేసినట్టు తెలుస్తోంది. అతడు పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇన్స్టలేషన్, నూతన విధానాలను పరిచయం చేయడం వంటి పనులు చేస్తుంటాడని సిట్ విచారణలో తేలింది. మార్చిలో శిల్ప తల్లి మృతి చెందండటంతో మైక్ హైదరాబాద్ వచ్చాడు. ఆ సందర్భంలో పలువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మైక్‌ను కలిసినట్టు సమాచారం. మైక్ మొబైల్లో హైదరాబాద్‌కు చెందిన వందల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నంబర్లు ఉండటం గమనార్హం. -
డ్రగ్స్ కేసులో కీలక వ్యక్తి అరెస్టు!
-
హైదరాబాద్ ఇంత బ్యాడా?
ముంబై ప్రజలు అడుగుతున్నారు:వర్మ సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసు విచారణలో ఎక్సైజ్ సిట్ తీరును తప్పుపడుతున్న డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. మంగళవారం ఫేస్బుక్లో వరుస పోస్టింగ్‌లతో విరుచుకుపడ్డారు. ఈ కేసు తీవ్రత ఎలా ఉన్నా హైదరాబాద్ ప్రతిష్టను మాత్రం దెబ్బ తీస్తోందని, హైదరాబాద్ ఇంత బ్యాడా అని ముంబై ప్రజలు తనను అడుగుతున్నట్లు పేర్కొన్నారు. కొందరినే టార్గెట్ చేసి జాతీయ స్థాయిలో డ్రామా నడపడం వల్ల రాష్ట్ర ప్రతిష్ట కూడా మసకబారుతుందని అన్నారు. అకున్ సబర్వాల్ నేతృత్వంలోని సిట్ విచారణతో వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని చాలా మంది అనుకుంటున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ను అనేక విషయాల్లో ముంబై ప్రజలు మెచ్చుకుంటారని కానీ టీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యవహారాన్ని చూసి షాక్ అవుతున్నారని వ్యాఖ్యానించారు. ‘బాహుబలి’ ద్వారా తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని డైరెక్టర్ రాజమౌళి పెంచారని ప్రజలు అనుకుంటుండగా అకున్ సబర్వాల్, ఆయన బృందం కలసి తలదించుకునేలా చేశారని అన్నారు. అందుకే సిట్‌ను సరిగా సెట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. వర్మ ట్వీట్స్‌పై రంగారెడ్డి కోర్టులో కేసు సినీరంగాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ మాఫియా కేసులో ఎక్సైజ్ శాఖపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మపై రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. డ్రగ్స్ మాఫియా పేరుతో సినీ పరిశ్రమ ను టార్గెట్ చేసి వేధిస్తున్నారని, ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మీడియాకు బాహుబలిలా కనిపిస్తున్నారంటూ వర్మ తన ట్వీటర్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ న్యాయవాది రంగప్రసాద్ కోర్టులో పిటిషన్ వేశారు. వర్మ వ్యాఖ్యలు ఎక్సైజ్ శాఖ విచారణకు ఆటంకం కలిగించేలా ఉన్నాయని, ఇది శిక్షార్హమని తన పిటిషన్లో పేర్కొన్నారు. నిబం ధనలు ఉల్లంఘిస్తే ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు కూడా జైలుశిక్ష పడే అవకాశముందన్నారు. -
డ్రగ్స్ కేసు.. వర్మపై కోర్టులో పిటిషన్
హైదరాబాద్: సంచలనం రేపిన డ్రగ్స్ మాఫియా కేసులో ఎక్సైజ్‌శాఖపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మపై రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలైంది. సినీ పరిశ్రమను టార్గెట్ చేసి వేధిస్తున్నారని, ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ బాహుబలిలా మీడియాకు కనిపిస్తున్నారని వర్మ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వర్మ వ్యాఖ్యలను తప్పుబడుతూ న్యాయవాది రంగప్రసాద్ రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులో ఎక్సైజ్‌శాఖ విచారణకు ఆటంకం కలిగించేలా వర్మ వ్యాఖ్యలు చేశారని, ఇలా వ్యాఖ్యలు చేయడం శిక్షార్హమేనని రంగప్రసాద్ తన పిటిషన్లో పేర్కొన్నారు. డ్రగ్స్ కేసుతో వర్మకు సంబంధం లేదని, అయినా ఎక్సైజ్ అధికారులను కించపరిచేవిధంగా, వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా వర్మ వ్యాఖ్యలు చేశారని రంగప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్పించేవిధంగా వ్యవహరించడం, వ్యాఖ్యలు చేయడం ఐపీసీ సెక్షన్ 343 ప్రకారం చట్టవిరుద్ధమని, ఇలా ప్రవర్తించినందుకు ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు కూడా జైలుశిక్ష పడే అవకాశముందని ఆయన చెప్పారు. సినీ ప్రముఖుల తరహాలోనే డ్రగ్స్ తీసుకున్న స్కూలు పిల్లలను కూడా పిలిచి గంటలు గంటలు విచారిస్తారా? అని వర్మ ప్రశ్నించడం తగదని, దేశంలో మైనర్లు, మేజర్లకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని రంగప్రసాద్ అన్నారు. ఎక్సైజ్‌శాఖను అవమానపరిచేవిధంగా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయని, పోలీసు, ఎక్సైజ్‌శాఖలపై ప్రజల్లో గౌరవముందని, దానిని దెబ్బతీయడం సరికాదని చెప్పారు. టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌ను అమరేంద్ర బాహుబలిలా మీడియా చూపిస్తున్నదంటూ ఆయన విపరీత వ్యాఖ్యలు చేశారు. 'సినీ ప్రముఖులు పూరీ జగన్నాథ్, సుబ్బరాజులను 12 గంటలపాటు ప్రశ్నించినట్టుగానే డ్రగ్స్ తీసుకున్న స్కూల్ విద్యార్థులను కూడా గంటల తరబడి ప్రశ్నిస్తారా?' అని నిలదీశారు. -
డ్రగ్స్ కేసు.. వర్మపై కోర్టులో పిటిషన్
-
డైరెక్టర్ వర్మకు అకున్ కౌంటర్ ఇదే!
హైదరాబాద్: టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌ను అమరేంద్ర బాహుబలిలా మీడియా చూపిస్తున్నదంటూ ఆయన విపరీత వ్యాఖ్యలు చేశారు. 'సినీ ప్రముఖులు పూరీ జగన్నాథ్, సుబ్బరాజులను 12 గంటలపాటు ప్రశ్నించినట్టుగానే డ్రగ్స్ తీసుకున్న స్కూల్ విద్యార్థులను కూడా గంటల తరబడి ప్రశ్నిస్తారా?' అని నిలదీశారు. వర్మ వ్యాఖ్యలపై అకున్ సబర్వాల్ పరోక్షంగా స్పందించారు. డ్రగ్స్ తీసుకున్న స్కూల్ పిల్లల పేర్లు బయటపెట్టబోమని, ఇలా బయటపెడితే వారి భవిష్యత్తు, జీవితం నాశనం అవుతాయని పేర్కొన్నారు. సిట్ మీద కొందరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, పూర్తిగా చట్టబద్ధంగానే సిట్ విచారణ సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ తీసుకున్న స్కూల్ పిల్లలు మైనర్లు అని, చట్టప్రకారం వారి పేర్లు వెల్లడించకూడదని చెప్పారు. ఎవరి పిల్లలైనా పిల్లలేనని, చిన్నవాళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముందని చెప్పారు. డ్రగ్స్ తీసుకున్న పిల్లల తల్లిదండ్రులను పిలిచింపి కౌన్సెలింగ్ ఇప్పించినట్టు తెలిపారు. -
అవన్నీ నేరమే: అకున్ సబర్వాల్
-
అవన్నీ నేరమే: అకున్ సబర్వాల్
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో స్కూల్ పిల్లల పేర్లు బయటపెట్టబోమని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అన్నారు. విద్యార్థుల్లో మైనర్లు ఉన్నారని, వారి పేర్లు బయటపెడితే జీవితాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమకు చెందిన ఇద్దరు మహిళలకు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. వారు ఎక్కడ కావాలంటే అక్కడే విచారిస్తామని చెప్పారు. వీరిలో ఒకరు సిట్ ఆఫీసుకు వస్తామని చెప్పినట్టు వెల్లడించారు. చట్ట ప్రకారమే నిందితులను ప్రశ్నిస్తున్నామని, దర్యాప్తు బృందంలో మహిళా అధికారి కూడా ఉన్నారని చెప్పారు. నలుగురు సభ్యుల బృందం సినిమా వాళ్లను ప్రశ్నిస్తోందని, విచారణ మొత్తాన్ని వీడియో తీస్తున్నామని తెలిపారు. వీటిని కోర్టుకు సమర్పిస్తామన్నారు. అనుమతి లేకుండా శాంపిల్స్ తీసుకోవడం లేదని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఎక్కడా ఉల్లంఘించలేదన్నారు. లిఖిత పూర్వకంగా అంగీకరించిన తర్వాతే శాంపిల్స్ తీసుకుంటున్నామని వెల్లడించారు. నమూనాలు ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ విషయాన్ని కేసు డైరీలో రాస్తామని, బలవంతం చేయబోమని స్పష్టం చేశారు. తాము సినిమా వాళ్లను లక్ష్యంగా చేసుకున్నామని ఆరోపించడం తగదని, అందరినీ సమానంగా చూస్తున్నామన్నారు. ఈరోజు హోటల్ అసోసియేషన్ వారిని పిలిచి స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. డ్రగ్స్ అమ్మడం, కొనడం, ఇంట్లో పెట్టుకోవడం అన్నీ నేరమే అని పేర్కొన్నారు. ఎవరైనా డిపార్ట్మెంట్, తమ గురించి తప్పుడు ప్రచారం చేస్తే పరువునష్టం దావా వేయడానికి వెనుకాడబోమని అకున్ సబర్వాల్ హెచ్చరించారు. బెదిరింపులకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు విడుదల చేశారు. -
అధికారులతో అకున్ సబర్వాల్ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్: తెలంగాణలోని అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో ఆ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానంగా జిల్లాల్లో డ్రగ్స్ విక్రయాలు, సరఫరా చేస్తున్న వారి గురించి చర్చించినట్లు సమాచారం. డ్రగ్స్ నియంత్రణకు మార్గాలు, డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరినామాలపై అవగాహన పెంపోందించేందుకు చేయాల్సిన కార్యక్రమాల గురించి సబర్వాల్ అధికారులతో చర్చించారు. -
కొందరి వల్ల చిత్రసీమకు చెడ్డ పేరు: నటి
సాక్షి, సిటీబ్యూరో : తెలుగు చిత్రసీమలోని కొందరు ప్రముఖులకు డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో నోటీసులు రావడంపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన డ్రగ్స్ సమస్యపై ఆయన మాట్లాడుతూ.. ‘డ్రగ్స్ కేసులో బడా నిర్మాతల పిల్లలకు బదులు ఇతరుల పేర్లు వస్తున్నాయని కొందరు విమర్శించడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్‌గా ఉంది. తప్పు చేసిన వారు ఎవరైనాసరే శిక్షింపబడతారు. ఎక్సైజ్ డీజీ అకున్ సబర్వాల్ ఈ కేసును చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న వారందరూ దోషులు కారు. తప్పు చేయనివారికి తెలంగాణ ఫిల్మ్ చాంబర్ సపోర్ట్ ఉంటుంది’ అన్నారు. ‘కొందరి వల్ల తెలుగు చిత్రసీమకు చెడ్డ పేరొస్తుంది. డ్రగ్స్ పంపిణీ చేసే పబ్‌లను తక్షణం క్లోజ్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సినిమా అవకాశాలు రాలేదని డ్రగ్స్‌కు బానిసలు కావడం సరికాదని’ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ కవిత అన్నారు. -
డ్రగ్స్ కేసులో ఎవరినీ వదలొద్దు: కేసీఆర్
హైదరాబాద్: సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో పలుశాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ ఎంత మందికి నోటీసులు జారీ చేశారో, ఎంత మందిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారన్న వివరాలతో కూడిన డ్రగ్స్ రాకెట్ కేసు నివేదికను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న కేసీఆర్.. విచారణలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగొద్దని, దోషులుగా తేలితే ఎవరినీ వదిలిపెట్టొద్దని అకున్ సబర్వాల్ సహా ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమీక్షకు డీజీపీ అనురాగ్ శర్మ, అకున్ సబర్వాల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ కేసు విచారణకుగానూ అవసరమైతే మరికొంత మంది పోలీసుల సహాయం తీసుకోవాలని అకున్ సబర్వాల్‌కు కేసీఆర్ సూచించారు. సమిష్టి కృషి చేయడం వల్లే వీటిని రూపుమాపవచ్చునని, నార్కోటిక్ సహాయంతో కేసు విచారణ సులువుగా మారుతుందని పోలీసులకు కేసీఆర్ సలహా ఇచ్చారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ప్రధాన నిందితుడు కెల్విన్‌తో పాటు మహ్మద్ ఖద్దుస్, మహ్మద్ వాహిద్‌లను కస్టడీకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. నేటి సాయంత్రానికి వీరి సిట్ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష జరిపారు. ఇప్పటికే కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పలువురిని అదుపులోకి ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు. పది రోజుల సెలవుపై వెళ్లాలన్న నిర్ణయాన్ని అకున్ సబర్వాల్ ఇదివరకే వెనక్కి తీసుకుని కేసు విచారణను వేగమంతం చేశారు. మరోవైపు డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారిని ఈ నెల 19 నుంచి 27 వరకు సిట్ అధికారులు విచారించనున్నారు. పలువురు సినీ ప్రముఖులకు ఈ కేసులో నోటీసులు అందడంతో పాటు మరికొందరి పేర్లు వెలుగుచూస్తాయని కథనాలు ప్రచారం కావడంతో ఇండస్ట్రీలో కలకలం రేగుతోంది. హైదరాబాద్‌లో పలు స్కూళ్లు, కాలేజీల విద్యార్థులతో పాటు సినీ సెలబ్రిటీలు, ఇతర రంగాలకు చెందినవారు డ్రగ్స్ కు బానిసైనట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. -
కొనసాగుతున్న డ్రగ్స్ కలకలం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం కొనసాగుతోంది. డ్రగ్స్ కేసులో పోలీసులు చురుగ్గా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పియూష్ అనే సివిల్ ఇంజనీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందిడు కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 14కు చేరింది. ఎల్ఎస్డీ కేసులో 11 మందిని, కొకైన్ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. డ్రగ్స్‌తో సంబంధం ఉన్న వారికి సెక్షన్ 67 కింద నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. ఈ నెల 19 నుండి విడతల వారీగా 27 వరకు నోటీసులు ఇచ్చిన వారిని విచారణకు పిలుస్తామన్నారు. మహిళా నటులు తమ కార్యాలయానికి రావడం ఇష్టం లేకుంటే వారి వద్దకే వెళ్లి విచారిస్తామన్నారు. ఎవరి పేర్లు తాము వెల్లడించలేదని స్పష్టం చేశారు. అందరికీ నోటీసులు అందాయన్నారు. కాగా, తన తల్లి రెండు నెలల క్రితం చనిపోయారని అప్పట్లోనే సెలవు కోసం అప్లై చేయగా ప్రభుత్వం ఇప్పుడు అనుమతించిందని చెప్పారు. తాను సెలవుపై వెళ్లటం వెనుక ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందని చెప్పారు. లాండ్ అండ్ ఆర్డర్ సహకారం కూడా తీసుకుంటున్నట్టు తెలిపారు. -
డ్రగ్స్ కేసు: సినీ నిర్మాత అరెస్ట్!
హైదరాబాద్: రాజధానిలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ మాఫియా కేసులో గురువారం మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో సినీ నిర్మాత ఉన్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి 16 ఎల్ఎస్డీ డ్రగ్స్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న(బుధవారం) హోటల్ మేనేజ్మెంట్ కళాశాల నిర్వాహకుడు బెండెన్ బెన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టిన పోలీసులు గురువారం మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. బెండెన్ బెన్, నిఖిల్ షెట్టి కలిసి డ్రగ్స్ వ్యాపారం నడుపుతున్నట్లు ఇదివరకే పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ మొత్తం 10 మందిని అరెస్ట్ చేసినట్లయింది. డ్రగ్స్ దందాలో ప్రధానంగా గోవా నుంచే హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా అయ్యాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ గోవా నుంచే డ్రగ్స్ తీసుకొచ్చి నిఖిల్షెట్టి, ఇతర పెడలర్లకు అందించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఓ సినీ నిర్మాతకు గోవాలోనే డ్రగ్స్ అందజేశారని.. కేసుకు ప్రధాన లింకు గోవాలోనే ఉండి ఉంటుందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలలో డ్రగ్స్ మాఫియా జరుగుతుందన్న వార్తలతో నగరంలోని ప్రముఖ పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు దీనిపై ఆందోళన చెందుతున్నాయి. ఏ క్షణంలో ఏ విషయం వినాల్సి వస్తుందేమోనన్న భయం యాజమాన్యాల్లో కనిపిస్తోంది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్‌ను కస్టడీలోకి తీసుకుని పూర్తి వివరాలు రాబట్టాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ భావిస్తోంది. పలు స్కూళ్లు, కాలేజీలకు చెందిన విద్యార్థులు డ్రగ్స్ మత్తులో మునిగితేలుతుండటంతో తల్లిదండ్రులు, యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బుధవారం ఖండించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్.. వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్న విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి కాలేజీలు, స్కూళ్ల పేర్లను ప్రకటించలేదని పోలీసులు చెబుతున్నారు. సినీ ఇండస్ట్రీతో పాటు ఎంఎన్సీ కంపెనీలకు డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నాయన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. -
డ్రగ్స్ కేసు: ప్రైవేట్ కంపెనీలకు నోటీసులు
హైదరాబాద్: డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్న విద్యార్థులను తాము ఇబ్బందిపెట్టబోమని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేయటంతోపాటు వినియోగించే విద్యార్థులు, ఆయా విద్యాసంస్థల వారి నుంచి అవసరమైన మేర సమాచారం రాబడతామన్నారు. కాగా, ఈ కేసులో బుధవారం హోటల్ మేనేజ్మెంట్ కళాశాల నిర్వాహకుడు బెండెన్ బెన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. దీంతో మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్లయిందన్నారు. బెండెన్ బెన్, నిఖిల్ షెట్టి కలిసి డ్రగ్స్ వ్యాపారం నడుపుతున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 27 కళాశాలలు, 26 స్కూళ్లతోపాటు పలు ప్రైవేట్ కంపెనీలకు నోటీసులు జారీ చేశామన్నారు. సినీ పరిశ్రమ, వాణిజ్య ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చామన్నారు. ఈ విషయంలో ఎవరైనా తెలిసిన సమాచారం అందించాలనుకునేవారికి టోల్‌ఫ్రీ నంబర్ (1800 425 2523) కూడా అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. దీంతోపాటు ఈనెల 14వ తేదీన 83 స్కూళ్ల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
డ్రగ్స్ కేసు: వారి పేర్లు బయటపెట్టబోం!
-
డ్రగ్స్ కేసు: వారి పేర్లు బయటపెట్టబోం!
హైదరాబాద్: నగరంలో ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ ముఠాకు సంబంధించిన మరో నలుగురిని అరెస్టు చేసినట్టు రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఇందులో ముగ్గురు బీటెక్ చదువుకున్న వారు కాగా, మరో వ్యక్తి బడా గేమింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడని తెలిపారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరుకుందన్నారు. తాజాగా అరెస్టయిన నలుగురు కూడా డ్రగ్స్ సరఫరా చేసేవారేనని స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన అకున్ సబర్వాల్ పలు బడా పాఠశాలలు, కాలేజీలకు చెందిన విద్యార్థులు కూడా డ్రగ్స్‌కు అలవాటుపడినట్టు తమ విచారణలో తేలిందన్నారు. అయితే, డ్రగ్స్ బాధితులు ఎవరినీ కూడా అరెస్టు చేయబోమని ఆయన హామీ ఇచ్చారు. వారానికి రూ. 4వేలు ఖర్చు చేయగలిగిన వారే డ్రగ్స్ తీసుకుంటున్నట్టు చెప్పారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన విద్యార్థులు, లేదా తెలిసీ తెలియక స్నేహితుల సహచర్యం వల్ల మాదక ద్రవ్యాలు తీసుకొని ఉంటే వెంటనే ఆ విషయాన్ని వెంటనే తమ తల్లిదండ్రులకు లేదా కుటుంబసభ్యులు, ఉపాధ్యాయులకు తెలుపాలని ఆయన సూచించారు. తాము తప్పుదారిలో ప్రయాణించిన విషయాన్ని గుర్తించి ఇకనైన సరిదిద్దుకోవాలని, ఇలాంటి తప్పుడు పనులు పునరావృతం చేయొద్దని సూచించారు. డ్రగ్స్ తీసుకొనే విద్యార్థుల పేర్లను వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెల్లడించడం లేదని, వారిని అరెస్టు చేయబోమని స్పష్టం చేశారు. డ్రగ్స్ ముఠా కేసు విచారణలో భాగంగా మొదట కాలేజీలు, పాఠశాలపై దృష్టి పెట్టామని, ఈ అంశం ఓ కొలిక్కి వచ్చిన తర్వాత సినీప్రముఖులు, ఐటీ ఉద్యోగుల విషయంలో విచారణ చేపట్టి స్పష్టత ఇస్తామని తెలిపారు. విద్యార్థులు ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఏయే కాలేజీలు, పాఠశాలలకు ఎక్కువ డ్రగ్స్ సరఫరా అవుతుందనే విషయాలను అరెస్టయిన డ్రగ్స్ ముఠా సభ్యుల ద్వారా తెలుసుకుంటున్నట్టు చెప్పారు. -
డ్రగ్స్ వ్యవహారంపై తెలంగాణ సర్కార్ సీరియస్
ఇద్దరు అధికారులతో సిట్ ఏర్పాటు హైదరాబాద్ : నగరంలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులో నిజానిజాలను తేల్చేందుకు ఇద్దరు అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. డ్రగ్స్ కేసులో 11మందిని విచారించామని ఆయన తెలిపారు. డ్రగ్స్ బాధితుల్లో ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు తేలిందని, వారి తల్లిదండ్రులను పిలిచి మాట్లాడినట్లు సబర్వాల్ పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా డ్రగ్స్ కేసుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. నగరంలో డ్రగ్స్ మూలాలను ఏరిపారేయాలని ఆదేశించింది. పూర్తిస్థాయి దర్యాప్తుకు తక్షణమే సిట్ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే డ్రగ్స్ పంపిణీదారులు, మధ్యవర్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు స్కూల్, కాలేజీ విద్యార్థులు డ్రగ్స్ బారినపడటంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో డ్రగ్స్ ఆనవాల్లు కనిపించకూడదని, కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదలొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను సోమవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. వారికి న్యాయస్థానం 14రోజుల పాటు రిమాండ్ విధించింది. కాగా నిందితుల విచారణలో అనేక సంచలనాత్మక అంశాలు వెలుగుచూశాయి. అనేక మంది బడా ఉద్యోగులు, సినీ నిర్మాతలు, పలు కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులు డ్రగ్స్ సరఫరాదారులకు కస్టమర్లుగా ఉండటం అధికారులను విస్తుబోయేలా చేసింది. -
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
- సినీ వ్యక్తులకు డ్రగ్ రాకెట్‌తో లింకుందన్న అధికారులు - అరెస్టయిన ముగ్గురూ ప్రఖ్యాత ఎమ్మెన్సీల్లో ఉద్యోగులే హైదరాబాద్: అత్యంత ఖరీదైన మాదకద్రవ్యాలను సరఫరా చేస్తోన్న ఓ ముఠా పట్టుబడింది. సినీ పరిశ్రమకు చెందిన కొందరికి ఈ డ్రగ్ రాకెట్‌తో సంబధాలున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రఖ్యాత ఎమ్మెన్సీ కంపెనీల్లో పనిచేస్తూ, లక్షల్లో జీతాలు పొందుతోన్న ఉద్యోగులు, కొందరు విద్యార్థులకు కూడా ఈ వ్యవహారంలో భాగస్వాములైనట్లు తెలిపారు. తెలంగాణ ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్, స్టేట్ టాస్క్‌ఫోర్స్‌లు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ముఠా.. ఎల్ఎస్డీ, ఎండీఎంఏ అనే డ్రగ్‌ను సరఫరా చేస్తోందని, ఈ ద్రావకం ఒక్కో చుక్కా వేల రూపాయల ఖరీదు ఉంటుందని, మొత్తం 700 యూనిట్ల ఎల్ఎస్డీ, 34 గ్రాముల ఎండీఎంఏను సీజ్ చేశామని సబర్వాల్ చెప్పారు. సినీ పరిశ్రమకు చెందినవారికి ఈ ముఠాతో సంబంధాలున్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అరెస్టయిన ముగ్గురూ ఉన్నత విద్యావంతులేనని, మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నవారేనని సబర్వాల్ వివరించారు. ఈ ముఠాకు సంబంధించి అబ్దుల్ బాహాద్, అబ్దుల్ కుదుస్లను ప్రధాన నిందితులుగా గుర్తించామని, సెల్ఫోన్లలోని డేటాను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, వివరాలు అందిన వెంటనే డ్రగ్స్ రాకెట్‌తో ఎంతమందికి సంబంధాలున్నాయి? డ్రగ్స్ ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ అమ్మారు? అనే దిశగా దర్యాప్తు చేస్తామని అకున్ సబర్వాల్ తెలిపారు. సినీ వ్యక్తులలో కొందరికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్లు పోలీసులు ప్రకటించడం పరిశ్రమలో కలకలంరేపింది. -
ఆబ్కారీ.. కొత్త స్వారీ!
► పోలీసు జీపులకు సైరన్ యూనిఫామ్‌లోనే దాడులు ►గ్రామాల్లో అవగాహసదస్సులు ►కొత్త విధివిధానాలు ఖరారు ►జూన్ 2నాటికి సారారహిత జిల్లాలుగా మార్చేందుకు ప్రణాళికలు మహబూబ్‌నగర్ క్రైం: సారాతయారు విధానంపై మరోసారి ఆబ్కారీశాఖ ఉక్కుపాదం మోపనుంది. వందశాతం సారారహిత జిల్లాగా ప్రకటించాలని ఆబ్కారీశాఖ కఠినమైన కొత్త విధివిధానాలు ఖరారుచేసింది. డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అకూన్ సబర్వాల్ ఆ శాఖ సిబ్బందితో సమీక్ష నిర్వహించడమే కాకుండా కఠినమైన నిర్ణయాలతో కూడిన ఆదేశాలు జారీచేశారు. నిర్ధేశించిన లక్ష్యం కళ్లెదుట ఉండటంతో ఆబ్కారీశాఖ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడిజిల్లాలో సంబంధితశాఖ అధికారులు సారా నియంత్రణపై ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. సారారహిత జిల్లాలే లక్ష్యం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి సంపూర్ణ సారారహిత రాష్టంగా ప్రకటించేందుకు కసరత్తు చేయాలని అధికారులను అకూన్ సబర్వాల్ ఆదేశించారు. ఈ నెల 28నాటికి నాలుగు జిల్లాల్లో సారారహితంగా ప్రకటించాక రాష్ట్రస్థాయి అధికారిక బృందాలు ఆయా జిల్లాల్లో పర్యటించి ధ్రువీకరిస్తారని అన్నారు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేస్తే జూన్ 2న జరిగే ఆవిర్భావ వేడుకల్లో çస్వయంగా సీఏం నివేదిక ప్రకటిస్తారని పేర్కొంటూ దీని అమలుకు కఠినమైన నిర్ణయాలు జారీ చేశారు. అయితే గతేడాది జిల్లాల విభజన తర్వాత మూడునెలల్లో సారా కేసుల పరంపర ఒక్కసారిగా పెరిగింది. నెలరోజులుగా నల్లబెల్లం విక్రయాలు జోరందుకున్నాయి. అక్రమ రవాణా పెరిగింది. ఇటీవల ఆబ్కారీశాఖ అధికారులు తనిఖీలు చేయడానికి గ్రామాల్లోకి వెళ్లగా సివిల్డ్రస్లో ఉండటంతో ప్రజలనుంచి వ్యతిరేకత వచ్చింది. ఖిల్లాఘణపురంలో కల్తీకల్లు అమ్ముతున్నట్లు సమాచారం తెలుసుకుని రైడ్‌కు వెళ్లిన ఎక్సైజ్ఎస్ఐపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఇలాంటి ఘటనల నుంచి బయటపడాలంటే డ్రస్ ధరించే తనిఖీలు చేయడానికి వెళ్లాలని స్పష్టం చేశారు. ఎక్సైజ్ అధికారుల వాహనాలపై ఆబ్కారీశాఖ లోగోతో పాటు పోలీస్ తరహా సైరన్లు పెట్టనున్నారు. సర్పంచ్ల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు గ్రామాల్లో, పట్టణాల్లో రోడ్ల వెంట ఉండే ప్రహరీలపై, ప్రభుత్వ కార్యాలయాలపై ‘కల్తీకల్లు, నాటుసారా తరిమివేద్దాం.. బంగారు తెలంగాణను నిర్మిద్దాం’ వంటి నినాదాలను రాయిస్తున్నారు. రెండు జిల్లాల్లో అధికం నూతనంగా ఏర్పడిన వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలో సారా తయారీ అధికంగా ఉందని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట మండలాల్లో ఎక్కువ సంఖ్యలో తయారుచేస్తున్నట్లు తేల్చారు. ఈ రెండు నెలలలో నాగర్‌కర్నూల్ జిల్లాలో 54కేసులు నమోదుకాగా 52మందిని అదుపులో తీసేకున్నారు. 350లీటర్ల సారా సీజ్ చేయడంతో పాటు 8వేల లీటర్ల బెల్లం పానకం దొరికింది. ఉమ్మడి జిల్లాలో 1365కిలోల బెల్లం సీజ్ చేయగా నాగర్‌కర్నూల్ జిల్లాలోనే 1236కేజీల బెల్లం సీజ్ చేశారు. వనపర్తి జిల్లాలో రెండు నెలల నుంచి 25కేసులు నమోదు చేయగా 30మందిని అదుపులో తీసుకున్నారు. 120లీటర్ల సారా సీజ్ చేయడంతో పాటు 6వేల బెల్లం పానం పారబోశారు. కఠిన ఆదేశాలు ఇలా.. ఆబ్కారీశాఖ యూనిఫాంలోనే సిబ్బంది దాడులు చేయాలి. ►ఈ నెల చివరినాటికి అన్ని స్టేషన్ల జీపులకు సైరన్ పెట్టి సమాచారం అందించాలి. ►రాజకీయ ప్రమేయం రానివ్వకూడదు. ఒకవేళ ఎవరైనా తారాస్థాయి ఒత్తిడి తెస్తే వారి పేర్లను తెలియజేయాలి. ►సారా కేసుల్లో బైండోవర్ నమోదయ్యాక కూడా సారా అమ్మి పట్టుబడితే వారి నుంచి రూ.1లక్ష జరిమానా, జైలు శిక్షకు పంపించాలి. ►సారా కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చే పద్ధతిని పూర్తిగా రద్దు చేయాలి. తప్పనిసరిగా కోర్టుకు రిమాండ్ చేయాల్సిందే. ►రాష్ట్రస్థాయిలో ఆబ్కారీస్టేషన్ల ఎస్హెచ్ఓలతో సమీక్ష తర్వాత వాట్సాప్ గ్రూప్ రూపొందించారు. రోజు వారీ కార్యకలాపాలను పొందుపరచాలి. ►మద్యం ధరల ఎమ్మార్పీ ఉల్లంఘన, నల్లబెల్లం అమ్మకాలు, మద్యం కల్తీ, పర్మిట్రూం, బయట మద్యం తాగితే కేసుల నమోదును వేగంగా చేపట్టాలి. ►అవసరమైన పక్షంలో సారా, బెల్లం దారులపై పీడీయాక్టు నమోదు చేయాలి. ►గతేడాది నుంచి నమోదైన కేసులు 1989, అరెస్టు అయిన వారు 2199, సీజ్ చేసిన వాహనాలు152, స్వాధీనం చేసుకున్న సారా ►10వేల లీటర్లు, పారబోసిన బెల్లం పానకం 50వేల లీటర్లు, సీజ్ చేసిన బెల్లం 88,561కేజీలు. ప్రతి గ్రామంలో పోస్టర్లు సారారహిత జిల్లాగా మార్పులో భాగంగా ప్రతి గ్రామంలో పోస్టర్లు, ప్రహరీలపై స్లోగమ్స్ రాయించాం. అదేవిధంగా ప్రతి సర్పంచ్‌కు లేఖలు రాశాము. జూన్ 2నాటికి ఉమ్మడి జిల్లాలో సారా లేకుండా చేయడానికి కృషి చేస్తున్నాం. ప్రస్తుతం నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలో అధికంగా ఉంది దానిపై దృష్టి పెట్టడం జరిగింది. ప్రతిరోజు తనిఖీలు చేయడంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. – జయసేనరెడ్డి, అబ్కారీశాఖ డీసీ, మహబూబ్‌నగర్ -
సారా బంద్ చేస్తే 2 లక్షలు
మహబూబ్‌నగర్ : నాటుసారా తయారు చేయడం మానేసి ఇతర రంగాలు, కుల వృత్తులలో ఉపాధి పొందుతున్న కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.2లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకూన్ సబర్వాల్ పెర్కొన్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన రూ.80వేలు కాకుండా ప్రస్తుతం నూతనంగా రూ.2లక్షలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ఈనెల 23న దీనికి సంబంధించిన జీవో విడుదల చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో సారా తయారు చేయడం ఆపేసి వివిధ వృత్తులలో ఉపాధి పొందుతున్న 175మంది కుటుంబాలతో సోమవారం ఆర్అండ్బీ అతిథిగృహాంలో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకూన్ సబర్వాల్ ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ 2015నుంచి 2016సెప్టెంబర్ వరకు జిల్లాలో 690మందిని గుర్తించడం వారందరికి నేరుగా రెండు లక్షలు చెల్లించడం జరుగుతుందని జాబితాలో పేర్లు లేనికుటుంబాలు ఉంటే వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మళ్లీ సారా తయారు చేయడం మొదలు పెడితే అలాంటి వారికి ఆర్థిక సహాయం అందకపోగా అలాంటి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సహాయంతో ఇతర వృత్తులలో పెట్టుబడులు పెట్టుకొని ఉపాధి పొందాలని సూచించారు. ఆనంతరం బాధితులు పలు విషయాలు డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ వృత్తి మానేసి రెండేళ్లు గడుస్తున్న ఇప్పటికి ఎలాంటి రుణం రాలేదని కొందరు..మాకు మీరు ఏదైనా ఆధారం చూపించాలని సమస్యలు చెప్పుకున్నారు. దీంట్లో కొందరు చదువుకున్న వారిని ప్రత్యేకంగా గుర్తించి అలాంటి వారికి ప్రత్యేకంగా ఉపాధి చూపించాలని కోరారు. ఆనంతరం ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకూన్ సబర్వాల్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్తో బేటి అయ్యి జిల్లాలో నాటు సారా, కల్తీ కల్లుపై చర్చించారు. మద్యం దుకాణాలు నిబంధనలు పాటించాలి జిల్లాలో ఉండే మద్యం దుకాణాలు పూర్తిగా నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకూన్ సబర్వాల్ అన్నారు. ఆర్అండ్బీ అతిథి గృహాంలో ఎక్సైజ్ శాఖ డీసీ జయసేనరెడ్డి, ఈఎస్ నర్సింహ్మారెడ్డి, సీఐ, ఎస్ఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో అవగహన సదస్సులు నిర్వహించాలనే విషయంపై పోస్టర్లు ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ జూన్ 2కంటే ముందే జిల్లాలో నాటుసారా, కల్తీకల్లు లేకుండా చేయాలని దీనికోసం నిబద్దతతో పని చేయాలని స్పష్టం చేశారు. కల్తీకల్లు, నాటుసారా తయారు చేస్తూ అమ్ముతున్న కుటుంబాలను వీలైనంత వేగంగా గుర్తించి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పట్టణా ప్రాంతాల్లో కిరాణ దుకాణాలు, సూపర్మార్కెట్లలో నల్లబెల్లం, తెల్లబెల్లం నిల్వలపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు పాటించాని మద్యం దుకాణాలపై దాడులు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. -
పల్లెల్లో శాంతికి ‘గ్రామ పోలీసు’
- ప్రయోగాత్మకంగా తాండూరులో అమలు - హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ తాండూరు: ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోపాటు పల్లెల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ‘గ్రామ పోలీసు అధికారి(వీపీఓ)’ కార్యక్రమాన్ని ప్రయోగాత్మంగా అమలు చేయనున్నట్లు హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ వెల్లడించారు. వికారాబాద్ జిల్లా తాండూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముందుగా తాండూరు మండలం కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌లో వీపీఓ కార్యక్రమం అమలు చేస్తామని, అది విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. మూడు పంచాయతీలకు కలిపి ఓ గ్రామ పోలీసు అధికారిని నియమిస్తామన్నారు. వారంలో రెండుసార్లు వీపీఓలు తమకు కేటాయించిన గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లాలని, ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించి శాంతియుత వాతావరణం నెలకొనేలా కృషి చేయాలని సూచించారు. 12 రోజులకోసారి పల్లెనిద్ర వీపీఓ ఆయా గ్రామాల్లో 12 రోజులకోసారి పల్లె నిద్ర చేస్తారని డీఐజీ తెలిపారు. నేరరహిత గ్రామాలకు ప్రత్యేక చొరవతో పాటు ప్రభుత్వ పథకాలు వర్తించేలా చూస్తామని చెప్పారు. మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలోని 22 పంచాయతీలను ఇప్పటికే క్రైం ఫ్రీగా ప్రకటించినట్టు ఆయన గుర్తుచేశారు. ఇప్పటి వరకు పాత కేసులను తగ్గించడంతోపాటు 2017 జనవరి నాటికి నేరాలను నియంత్రించి కొత్తగా కేసులు నమోదు కాని గ్రామాలను క్రైం ఫ్రీ గ్రామాలుగా ప్రకటిస్తామని డీఐజీ తెలిపారు. -
ఎస్ఐల బదిలీలు
19 మందికి స్థాన చలనం సంగారెడ్డి టౌన్: నిజామాబాద్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అకున్ సబర్వాల్ ఆదేశాల మేరకు జిల్లాలో 19 మంది ఎస్సైలను బదిలీ చేయడంతో పాటు పోస్టింగులు ఇస్తూ జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మరో ఆరుగురు ఎస్సైలను వెయిటింగ్లో ఉంచారు. బి.పెంటయ్య (వెల్దుర్తి), డి.అశోక్ (నారాయణఖేడ్), పి.ప్రభాకర్‌రెడ్డి (కౌడిపల్లి), డి.సుందర్రావు (జహీరాబాద్ టౌన్), జె.హనుమంతు (మెదక్ టౌన్), ఎన్. ఇంద్రసేనారెడ్డి (సిద్దిపేట్ 1 టౌన్) తదితరులను రిజర్వులో ఉంచారు.