
ఎస్ఐల బదిలీలు
నిజామాబాద్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అకున్ సబర్వాల్ ఆదేశాల మేరకు జిల్లాలో 19 మంది ఎస్సైలను బదిలీ
19 మందికి స్థాన చలనం
సంగారెడ్డి టౌన్: నిజామాబాద్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అకున్ సబర్వాల్ ఆదేశాల మేరకు జిల్లాలో 19 మంది ఎస్సైలను బదిలీ చేయడంతో పాటు పోస్టింగులు ఇస్తూ జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మరో ఆరుగురు ఎస్సైలను వెయిటింగ్‌లో ఉంచారు. బి.పెంటయ్య (వెల్దుర్తి), డి.అశోక్ (నారాయణఖేడ్), పి.ప్రభాకర్‌రెడ్డి (కౌడిపల్లి), డి.సుందర్‌రావు (జహీరాబాద్ టౌన్), జె.హనుమంతు (మెదక్ టౌన్), ఎన్. ఇంద్రసేనారెడ్డి (సిద్దిపేట్ 1 టౌన్) తదితరులను రిజర్వులో ఉంచారు.