
బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీరాం
సాక్షి, కోనరావుపేట (కరీంనగర్): కోనరావుపేట పోలీస్‌స్టేషన్‌లో మూడు రోజుల్లో ముగ్గురు ఎస్సైలు విధులు నిర్వర్తించారు. ఇప్పటి వరకు ఎస్సైగా పనిచేసిన క్రాంతికిరణ్ ఈ నెల 6న బదిలీ కాగా.. 7వ తేదీన శ్రీనివాస్ జాయినయ్యారు. ఆయన వచ్చిన కొద్ది గంటల్లోనే మరో ఎస్సై శ్రీరాం ప్రేమ్‌దీప్‌కు కోనరావుపేట పోలీస్‌స్టేషన్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శనివారం శ్రీరాం ప్రేమ్‌దీప్ బాధ్యతలు స్వీకరించారు.
కత్తులతో వీరంగం.. పరస్పరం ఫిర్యాదు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఒక యువకుడిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి కత్తులతో దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు.. ఇటీవల గ్రామానికి తిరిగొచ్చాడు. అతనికి గ్రామంలోనే ఉంటున్న మరో యువకుడి మధ్య వాగ్వాదం జరిగింది.
పక్కనే ఉన్న గౌడ్‌కులస్తుని దగ్గర నుంచి కల్లుగీసే కత్తులను లాక్కుని దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆ యువకుడు ప్రాణ భయంతో పరుగులు పెట్టాడు. ఈ ఘటనపై పోలీసులను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చదవండి: నీ కూతురు వేరే వ్యక్తితో చాటింగ్ చేసింది.. డిలీట్ చేయాలంటే!
Comments
Please login to add a commentAdd a comment