Karimangar
-
కరీంనగర్లో కేసీఆర్ పొలంబాట.. రైతులకు పరామర్శ
Live Updates.. ► కరీంనగర్లో కేసీఆర్ పొలంబాట ►కరీంనగర్ చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్ ►జిల్లాలోని మొగ్దుంపూర్లో ఎండిపోయిన పంటను కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులను పరామర్శించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ► రోడ్డు మార్గంలో కరీంనగర్‌కు బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్ ►లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులతో మమేకమవుతున్నారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులను పరిశీలిస్తున్నారు. నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ►ఈ సందర్బంగా సాగునీటి కొరతతో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. హైదరాబాద్ నుండి రోడ్డుమార్గంలో ప్రత్యేక బస్సులో రానున్న కేసీఆర్ ముందుగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలిస్తారు. ► మధ్యాహ్నం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తరువాత సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, వేములవాడ నియోజకవర్గాల్లో పంటలను పరిశీలిస్తారు. సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనంతరం ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌజ్‌కు తిరుగుపయనమవుతారు. కాగా, ఈ పర్యటనలో కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
వంటలు రుచిగా లేవు, బట్టలు సరిగా ఉతకడం లేదని భర్త వేధింపులు.. భరించలేక
సాక్షి, మెట్పల్లి (కరీంనగర్): వంటలు రుచిగా తయారు చేయడంలేదని, బట్టలు సరిగ్గా ఉతకడంలేదంటూ తన భర్త పెట్టే మానసిక వేధింపులు తాళలేక ఫర్హానా బేగం(31) బలవన్మరణానికి ఒడిగట్టింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని గాజులపేటకు చెందిన ఫర్హానాబేగంకు నిజామాబాద్‌కు చెందిన వాజిద్దాన్తో 2016లో వివాహం జరిగింది. కొంతకాలం అక్కడే ఉన్నవారు.. ఆ తర్వాత మెట్‌పల్లికి వచ్చి స్థానిక వెల్లుల్ల రోడ్డులో నివాసం ఉంటున్నారు. వీరికి చిన్నారి(15నెలలు) ఉంది. అయితే, వంటలు రుచిగా తయారు చేయడం లేదని, బట్టలు సరిగ్గా ఉతకడం లేదని వాజిద్దాన్ తన భార్యను తరచూ మానసికంగా వేధించేవాడు. దీనిపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయినా అతడి వైఖరిలో మార్పు రాలేదు. దీంతో శనివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఫర్హానా బేగం చనిపోయింది. తన బావపై అనుమానం వ్యక్తం ఫార్హానాబేగం సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. చదవండి: మూడు రోజుల్లో ముగ్గురు ఎస్సైలు.. కారణమేంటంటే -
మూడు రోజుల్లో ముగ్గురు ఎస్సైలు.. కారణమేంటంటే
సాక్షి, కోనరావుపేట (కరీంనగర్): కోనరావుపేట పోలీస్‌స్టేషన్‌లో మూడు రోజుల్లో ముగ్గురు ఎస్సైలు విధులు నిర్వర్తించారు. ఇప్పటి వరకు ఎస్సైగా పనిచేసిన క్రాంతికిరణ్ ఈ నెల 6న బదిలీ కాగా.. 7వ తేదీన శ్రీనివాస్ జాయినయ్యారు. ఆయన వచ్చిన కొద్ది గంటల్లోనే మరో ఎస్సై శ్రీరాం ప్రేమ్‌దీప్‌కు కోనరావుపేట పోలీస్‌స్టేషన్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శనివారం శ్రీరాం ప్రేమ్‌దీప్ బాధ్యతలు స్వీకరించారు. కత్తులతో వీరంగం.. పరస్పరం ఫిర్యాదు తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఒక యువకుడిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి కత్తులతో దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు.. ఇటీవల గ్రామానికి తిరిగొచ్చాడు. అతనికి గ్రామంలోనే ఉంటున్న మరో యువకుడి మధ్య వాగ్వాదం జరిగింది. పక్కనే ఉన్న గౌడ్‌కులస్తుని దగ్గర నుంచి కల్లుగీసే కత్తులను లాక్కుని దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆ యువకుడు ప్రాణ భయంతో పరుగులు పెట్టాడు. ఈ ఘటనపై పోలీసులను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: నీ కూతురు వేరే వ్యక్తితో చాటింగ్ చేసింది.. డిలీట్ చేయాలంటే! -
కోట్లు పట్టుకుని.. మళ్లీ ఇచ్చేశారు!: విస్తుగొలుపే వాస్తవాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో దొరికిన డబ్బునంతా దాదాపు తిరిగి ఇచ్చేశారు. నమోదు చేసిన పోలీస్ కేసుల పరిస్థితి సైతం బుట్టదాఖలయ్యాయి. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో డబ్బు పంపిణీ – కేసుల నమోదు తదితర అంశాలపై సుపరిపాలనా వేదిక సేకరించిన సమాచారంలో విస్తుగొలుపే వాస్తవాలు వెల్లడైయ్యాయి. ఈ మేరకు ఫోరం కార్యదర్శి, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పద్మనాభరెడ్డి గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ)కు లేఖ రాస్తూ హుజూరాబాద్ ఉప ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ విఫలమైన తీరుపై తీవ్ర అంసతృప్తిని వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికను ఒక కేస్ స్టడీగా తీసుకుని ఎన్నికల్లో డబ్బు పాత్రను పూర్తిగా తగ్గించేందుకు వెంటనే తగు మార్గదర్శకాలు విడుదల చేయాలని పద్మనాభ రెడ్డి కోరారు. 94 కేసులు నమోదు... హుజూరాబాద్ ఉపఎన్నికల్లో అక్టోబర్1 నుంచి నవంబర్ 2 వరకు వివిధ ప్రాంతాల్లో రశీదులు లేని రూ.3.80 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని 94 కేసులు నమోదు చేశారు. ఇందులో కేవలం 18 లక్షలే కోర్టుకు సమర్పించి, మిగిలిన కేసుల్లో డబ్బంతా వాపస్ ఇచ్చేశారు. 94 కేసుల్లో కేవలం ఐదు కేసుల్లోనే అభియోగాలు నమోదు చేయగా, అందులో రెండు కేసులు పేకాటకు సంబంధిం చినవి కాగా, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన డబ్బు పంపిణీకి సంబంధించి మూడు కేసుల్లో మాత్రమే అభియోగాలు నమోదు చేశారు. చదవండి: మోదీ జీ... ప్లీజ్ పెంచండి.. పోస్ట్‌కార్డ్ సందేశాల పవర్ ఇది! -
బావ లైంగిక వేధింపులు.. మహిళ ఆవేదన.. ఆత్మహత్య
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక కాపువాడలో నివాసం ఉండే వివాహిత.. లైంగిక వేధింపులు తాళలేక సెల్ఫీవీడియో తీసిన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బావ కనకయ్య కొన్ని రోజులుగా తనను.. లైంగికంగా వేధిస్తున్నాడని ఆత్మహత్య చేసుకునే ముందు వీడియోలో తెలిపింది. ఈ వీడియోలో బాధితురాలు అరుణ.. తన భర్త ఇంట్లో లేని సమయంలో కనకయ్య ఇంటికి వచ్చి వేధిస్తూ.. పిల్లలకు తప్పుగా చెబుతానని బెదిరించేవాడని పేర్కొంది. కాగా, తాను.. కష్టపడి మిషన్ కుట్టుకుంటూ తన పిల్లలను పోషించుకుంటున్నట్లు తెలిపింది. కనకయ్య వేధింపులు తట్టుకోలేక.. ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో అరుణ ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలు ఎవరిజోలికి పోకుండా జాగ్రత్తగా బతకాలని తన చివరి మాటగా అరుణ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
హృదయ విదారకం.. కళ్లు పీకేసిన ఎలుగుబంటి
-
రోడ్డు పక్క బావి.. కారును మింగేసింది..
-
రోటీన్ లైఫ్‌తో విసిగి పోయారా ?.. ఈ వీడియో మీ కోసమే...
-
జలజల జలపాతం కావాలా? ఇదుగో ఇలా వెళ్లండి
-
కరీంనగర్లో మరోసారి టెన్షన్
సాక్షి, కరీంనగర్ : జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తికి కొత్తగా కరోనా పాజిటివ్ రావడంతో మరోసారి కరీంనగర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సదరు వ్యక్తి కొద్దిరోజుల పాటు కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ చల్మెడ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. అతనికి ట్రీట్మెంట్ ఇచ్చిన వైద్యులు, కలిసిన ఆస్పత్రి సిబ్బంది, బంధువుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. పేషెంట్ బంధువు కరీంనగర్లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. కరోనా పాజిటివ్ పేషెంట్‌తో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న అందరిని క్వారంటైన్ పంపించే అవకాశం ఉంది. దేశంలోనే ఒకేసారి పది కరోనా పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాగా.. తొలిసారి రెడ్‌జోన్ ప్రకటించిన ప్రాంతంగా కరీంనగర్ అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడినా.. అధికారులు, ప్రజాప్రతినిదులు తీసుకున్న కఠిన నిర్ణయాలతో కరోనాను కట్టడి చేయగలిగారు. అయితే ఇప్పుడు మరోసారి కరోనా పాజిటివ్ రావడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. -
'అమ్మ మాట నన్ను ఐఏఎస్ దాకా నడిపించింది'
సాక్షి, కరీంనగర్ : ‘ప్రజాసేవకై నాన్న నడిపిన బాట.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలని అమ్మచెప్పిన మాట’ నన్ను ఐఏఎస్ చదివేలా చేశాయి. మాది డాక్టర్ల కుటుంబం. అయినప్పటికీ చిన్నతనం నుంచి ప్రజాసేవ చేయాలని నాకున్న మక్కువ.. దాన్ని గుర్తించిన తల్లిదండ్రులు.. వారి ప్రోత్సాహం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎన్ని ఓటములు ఎదురైనా సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది. ఈ సూత్రం నా జీవితంలో నిజమైంది. సివిల్స్‌లో రెండుసార్లు లక్ష్యాన్ని చేరుకోకపోయినా.. కృషి, పట్టుదల విజయాన్ని నా దరికి తీసుకొచ్చాయి. మూడోసారి సివిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ టాపర్‌గా నిలిచేలా చేశాయని యువ ఐఏఎస్, కరీంనగర్ నగరపాలకసంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. మాది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ పట్టణం. నాన్న వల్లూరి రంగారెడ్డి, అమ్మ లక్ష్మి. ఇద్దరూ వైద్యులే. అక్కయ్య అమెరికాలో ఉంటోంది. ప్రజాసేవ చేయాలని నా చిన్నతనం నుంచి నాన్న చెబుతుండేవారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలని అమ్మ ఎప్పుడూ అంటుండేది. ఆ మాటలు నా మనసులో నాటుకుపోయాయి. ఎలాగైనా ప్రజాసేవ చేయాలని అప్పుడే లక్ష్యంగా పెట్టుకున్నా. కర్నూల్లోని భాష్యం హైస్కూల్లో 10వ తరగతి, హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తిచేశా. ఐఐటీ ఢిల్లీలో మోకానికల్ ఇంజినీరింగ్ చదివా. ఐఐటీ చదువుతూనే సివిల్స్‌పై దృష్టి.. ఐఐటీలో ఉన్నప్పుడే ‘నెక్ట్స్ ఏంటీ..’ అన్న అమ్మానాన్న మాటలు గుర్తొచ్చేవి. ఉన్నతస్థాయిలో ఉన్నప్పుడే ప్రజాసేవ చేసే అవకాశం దొరుకుతుందని ఎప్పుడూ చెబుతుంటేవారు. ఆ మాటలే నన్ను సివిల్స్‌కు సిద్ధమయ్యేలా చేశాయి. ఢిల్లీలో శ్రీరామ్ ఇనిస్టిట్యూట్‌లో సివిల్స్‌కు ఆరునెలలు కోచింగ్ తీసుకున్నా. తరువాత సొంతంగా ప్రిపేరయ్యా. బుక్స్‌తో పాటు నెట్లోనూ సమాచారాన్ని సేకరించా. ఇంట్లో వాళ్లంతా సైన్స్.. నేను మాత్రం మ్యాథ్స్‌పై ఇష్టం పెంచుకున్నా. ఆ లెక్కలే ఐఐటీలో సీటు, సివిల్స్‌లో ర్యాంకు వచ్చేలా ఉపయోగపడ్డాయి. మూడోసారి సాధించా.. ఐఏఎస్ లక్ష్యంగా సివిల్స్‌కు సిద్ధమయ్యా. తొలిసారి 2013లో రాసిన సివిల్స్‌లో 562ర్యాంకు వచ్చింది. ఐఆర్టీఎస్(ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్)లో జాబ్ పొందాను. రెండోసారి 2014లో సివిల్స్ రాసి 230ర్యాంకు సాధించా. ఐఆర్ఎస్(ఇండియన్ రెవెన్యూ సర్వీస్)వచ్చింది. అయినా సంతృప్తి చెందకుండా ఐఏఎస్ లక్ష్యంగా మరోసారి సివిల్స్ రాశా. 2016లో ప్రకటించిన ఫలితాల్లో 65వ ర్యాంకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే టాపర్‌గా నిలిచా. 24 ఏళ్లకే ఐఏఎస్ సాధించా. శిక్షణలో ఎన్నో జ్ఞాపకాలు.. ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ ఇచ్చారు. జీవితంలో దేనినైనా ఎదుర్కొనే తత్వాన్ని నేర్పించారు. ప్రజాసేవలో ఎలా ముందుకు సాగాలో చూపించారు. ట్రెక్కింగ్ నేర్పించారు. శిక్షణలో భాగంగా కశ్మీర్‌లోని ఎల్ఓసీని సందర్శించా. అక్కడ పర్యటిస్తున్నప్పుడు ఆ ప్రాంత వాతావరణం నాలో ధైర్యాన్ని పెంచింది. దేశం రక్షణకు సైనికులు పడే కష్టాన్ని కళ్లారా చూశా. అక్కడికి వెళ్లిన క్షణాలు నా జీవితాంతం గుర్తుంటాయి. ఆటలు.. తెలంగాణ పాటలు ఇష్టం చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఆటలు ఇష్టం. బాస్కెట్‌బాల్ ఎక్కువ ఆడేదాన్ని. తరువాత టెన్నిస్, ఇప్పుడు బ్యాడ్మింటన్ నేర్చుకుంటున్నా. ప్రముఖుల బయోగ్రఫీ పుస్తకాలు చదవడం ఇష్టం. తెలంగాణ ఉద్యమం నేపథ్యం, సంస్కృతిపైన వచ్చిన జానపద పాటలు బాగుంటాయి. మా రాయలసీమ సంస్కృతికి ఇక్కడి వాతావరణానికి చాలా తేడా ఉంది. వరంగల్‌లో మొదటిసారి బతుకమ్మ ఆడాను. తెలంగాణ క్యాడర్‌కు కేటాయించాక నిర్మల్‌లో శిక్షణ తీసుకున్నా. మహబూబ్‌నగర్‌లో ప్రత్యేకాధికారిగా పని చేశాను. అక్కడి నుంచి కరీంనగర్‌కు వచ్చా. మిగితా ప్రాంతాల కన్నా ఇక్కడ భిన్న వాతావరణం కనిపిస్తోంది. పోరాటాలకు సిద్ధంగా ఉండాలి ఎంత ఒత్తిడితో ఉన్నా పాజిటివ్మైండ్తో ఆలోచించాలి. ఎంతటి సమస్య అయినా సులువుగా పరిష్కరించవచ్చు. ఓటమిని తట్టుకుని విజయం సాధించే వరకు మొండిగా పోరాటం సాగించాలి. మహిళలు ఉన్నత ఉద్యోగాలు పొందేందుకు కృషి చేయాలి. చాలా మంది ఎన్నో లక్ష్యాలను పెట్టుకుని, తర్వాత కుటుంబం బంధాల్లో చిక్కుకుపోతారు. వివాహాలు అయిన తర్వాత కూడా లక్ష్యాలను సాధించిన వారూ ఉన్నారు. మిగితా వారు వీరిని ఆదర్శంగా తీసుకోవాలి. సమాజంలో మనకంటూ ప్రత్యేకతను చాటాలి. ఫైనల్‌గా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. -
కరీంనగర్ మున్సిపల్ ఎన్నికకు బ్రేక్
సాక్షి, కరీంనగర్ : నిర్ధిష్ట ప్రమాణాలు పాటించకుండా.. మాజీ కార్పొరేటర్లకు ప్రయోజనం చేకూరేలా అధికార యంత్రాంగం హడావుడిగా చేసిన వార్డుల పునర్విభజన ప్రక్రియ మొదటికే మోసం తెచ్చింది. కరీంనగర్ కార్పొరేషన్లో డివిజన్ల పునర్విభజన, ఓటర్ల కుల గణనలో అవకతవకలపై సాక్ష్యాధారాలతో పలువురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించడంతో ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. లోపాలను సవరించేంత వరకు ఎన్నికలు నిర్వహించరాదని స్టే జారీ చేసింది. దీంతో కరీంనగర్ మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై గందరగోళం ఏర్పడింది. పునర్విభజన అనంతరం ఏర్పాటైన 2, 3, 18 డివిజన్లలో అవకతవకలు జరిగాయని, ఇష్టానుసారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఓటర్లను తారుమారు చేశారని మాజీ కార్పొరేటర్ కూర తిరుపతి, హౌజింగ్‌బోర్డుకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు వాడె వెంకటరెడ్డితోపాటు ఎన్నం శ్రీనివాస్, చిగురు వెంకటేశం తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి రిట్ పిటిషన్లలో మరో 26 మంది వరకు ఇంప్లీడ్ అయినట్లు సమాచారం. శుక్రవారం హైకోర్టులో రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో వార్డుల పునర్విభజనపై విచారణ జరగగా, కరీంనగర్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలను సరిచేసి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినట్లు పిటిషనర్లు ‘సాక్షి’కి తెలిపారు. హైకోర్టు ఆర్డర్ ప్రతులు రాకపోవడంతో సోమవారం ఈ స్టేకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇష్టానుసారంగా పునర్విభజన, ఓటర్ల తుది జాబితా ప్రభుత్వం మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేయడంతోనే డివిజన్ల పునర్విభజన ప్రక్రియ మొదలైంది. ముందుగా డివిజన్ల సంఖ్యను ప్రకటించిన అధికారులు, ఆ సంఖ్యకు అనుగుణంగా ఓటర్లను నిర్ధారిస్తూ హద్దులను నిర్ణయించారు. ఇక్కడి నుంచే అసలు తతంగం మొదలైంది. కరీంనగర్లో 50 డివిజన్లు గతంలో ఉండగా, చుట్టుపక్కలున్న 8 గ్రామాలను విలీనం చేయడంతో వాటి సంఖ్య 60కి పెరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కో డివిజన్లో ఓటర్ల సంఖ్య 3,700 నుంచి 4,600 వరకు ఉండాలని మునిసిపల్ అధికారులు నిర్ణయించారు. తదనుగుణంగా తొలుత డివిజన్లను పునర్విభజించినప్పటికీ, ఇంటి నెంబర్ల ఆధారంగా విభజన జరపడంతో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో అభ్యంతరాలకు అనుగుణంగా ఒకటి రెండు రోజుల్లో మార్పులు చేసి ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంతోపాటు రిజర్వేషన్ల ముసాయిదా కూడా తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. రాజకీయ జోక్యంతో అస్తవ్యస్తం డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలు స్వీకరించినప్పుడే రాజకీయ జోక్యం మొదలైంది. తాజా మాజీ కార్పొరేటర్లు మునిసిపల్ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. డివిజన్ల రిజర్వేషన్లు ప్రభావితం అయ్యేలా ఓటర్లను ఇష్టానుసారంగా మార్చివేశారు. తాజా మాజీలైన కార్పొరేటర్లు చెప్పినట్టే మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది డివిజన్లలో ఓటర్లను చేర్చడం, తొలగించడం జరిగిందనేది వాస్తవం. శాస్త్రీయ పద్ధతి లేకుండా కొంతమంది ప్రయోజనాల కోసమే ఓటర్లను మార్చడంతో ఏకంగా 26 మంది వరకు కోర్టును ఆశ్రయించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు బీసీగానో, జనరల్‌గానో ఉన్న డివిజన్ ఎస్సీ లేదా ఎస్టీ అయితే పదేళ్ల వరకు తనకు మళ్లీ పోటీ చేసే అవకాశం రాదనే ఉద్దేశ్యంతో ఓ మాజీ కార్పొరేటర్ రాష్ట్ర స్థాయిలో పైరవీ చేసి, ఒక వర్గం ఓటర్లను పక్క డివిజన్‌లోకి మార్పించారనే విమర్శ ఉంది. కౌన్సిల్లో మొన్నటిదాకా కీలకస్థానంలో ఉన్న ఓ నాయకుడు తన డివిజన్లో కొత్తగా వేరే డివిజన్ల ఓట్లు చేరకుండా జాగ్రత్త పడడంతో అతితక్కువ ఓటర్లుగా నమోదయ్యాయి. ఆ పక్కనే ఉన్న డివిజన్లో దాదాపు రెట్టింపు ఓటర్లు ఉండడం గమనార్హం. ఎస్టీ డివిజన్లో మొదలై.. మిగతా ప్రాంతాలకు పాకి.. 3వ డివిజన్లో ఎస్టీ ఓటర్లు 350కి పైగా ఉండగా, అవన్నీ రాత్రికి రాత్రే 2వ డివిజన్‌లోకి చేరాయి. కేవలం ఎస్టీ ఓటర్లున్న ఇళ్లను మాత్రమే 2వ డివిజన్లో కలిపి, మిగతా ఓటర్లను యధాతథంగా 3వ డివిజన్లో ఉంచడం వల్ల ఎస్టీ రిజర్వేషన్ కావలసిన ఈ డివిజన్ జనరల్‌గానో, బీసీగానో చేసే కుట్ర జరిగిందని మాజీ కార్పొరేటర్ కూర తిరుపతి వాదన. ఇదే అంశాన్ని ఆయన కోర్టులో సవాల్ చేశారు. ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉన్న 2వ డివిజన్లో ఎస్టీ ఓటర్లను చేర్చడం వల్ల తమకు కేటాయించాల్సిన రిజర్వేషన్ కాకుండా పోతుందని ఎన్నం శ్రీనివాస్, చిగురు వెంకటేశం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 18వ డివిజన్లో ఏకంగా 600 అగ్రవర్ణ ఓటర్లను బీసీలుగా చూపించారని హౌజింగ్‌బోర్డుకు చెందిన వాడె వెంకటరెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. డివిజన్లో 4,600కు మించకుండా ఓటర్లు ఉండాలనే నిబంధనను పక్కన బెట్టి 4,813 మంది ఓటర్లతో డివిజన్ ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. 24వ డివిజన్లో ఏకంగా 2900 మంది ఓటర్లు మాత్రమే ఉంటే, పక్కనున్న 25వ డివిజన్లో 5,100 మంది ఓటర్లు ఉన్నారు. 19వ డివిజన్లో కూడా ఓటర్లను చేర్చడంలో అవకతవకలు జరిగాయని మాజీ కార్పొరేటర్ సతీష్ సైతం కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. 40వ డివిజన్లో ఒకే ఇంట్లో వంద మంది ఓటర్లు ఉన్నారని బీజేపీ నాయకులు చిట్టిబాబు, రాజేష్ సైతం కోర్టుకు విన్నవించారు. కోర్టు స్టే కాపీ కోసం అధికారుల నిరీక్షణ శాస్త్రీయత లేకుండా ఇష్టానుసారంగా డివిజన్ల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన కరీంనగర్ నగర పాలక సంస్థ అధికారులు హైకోర్టు ఆగ్రహంతో తల పట్టుకుంటున్నారు. హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసినా, ఏయే అంశాలపై కోర్టు అభ్యంతరం తెలియజేసిందో హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ వస్తే గానీ తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో మునిసిపల్ కమిషనర్, ఇతర అధికారులు డివిజన్ల విభజన విధానాన్ని మరోసారి పరిశీలించే పనిలో పడ్డారు. ప్రధానంగా 2,3, 18, 19 వార్డులతోపాటు అభ్యంతరాలు వ్యక్తమైన ఇతర డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియలో జరిగిన లోటుపాట్లను సవరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. కాగా కోర్టు ఆదేశాల మేరకు డీలిమిటేషన్లో హైకోర్టు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, లోపాలను సవరించి కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ‘సాక్షి’కి తెలిపారు. అన్ని మునిసిపాలిటీలతోపాటే కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
రెండు ముక్కలే..!
సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై వెనక్కు తగ్గిన సర్కారు ఆయా మండలాలు కరీంనగర్‌లోనే కొనసాగింపు జగిత్యాల జిల్లా స్వరూపంపై స్పష్టత మ్యాపులు సిద్ధం చేస్తున్న జిల్లా యంత్రాంగం ఉద్యోగుల విభజన కసరత్తులో బిజీబిజీ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు తగిన మండలాలు లేకపోవడం, చొప్పదండి నియోజకవర్గంలోని మండలాల ప్రజలు సిరిసిల్ల జిల్లాలో కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న కరీంనగర్ జిల్లాను రెండు ముక్కలుగా విభజించి కరీంనగర్, జగిత్యాల జిల్లాలుగా మాత్రమే ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. గతంలో ప్రతిపాదిత సిరిసిల్ల జిల్లాలోని మండలాలను పూర్తిగా కరీంనగర్ జిల్లాలోనే కలపాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి కలెక్టర్ నీతూప్రసాద్‌కు సంకేతాలు అందాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ కరీంనగర్, జగిత్యాల జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో రెవెన్యూ, ఎన్ఐసీ అధికారులు కరీంనగర్, జగిత్యాల ప్రతిపాదిత జిల్లాల మ్యాపులను సిద్ధం చేయడంతోపాటు ఏ జిల్లాకు ఎంతమంది ఉద్యోగులను కేటాయించాలనే కసరత్తు చేస్తున్నారు. కరీంనగర్లో 28, జగిత్యాలో 16 మండలాలు ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఉన్న 57 మండలాలను నాలుగు ప్రతిపాదిత జిల్లాలకు సర్దుబాటు చేశారు. భూపాలపల్లి జిల్లాలో నాలుగు, వరంగల్ జిల్లాలో ఐదు, సిద్దిపేట జిల్లాలో నాలుగు మండలాలను కలపాలని ప్రతిపాదించారు. అట్లాగే 16 మండలాలతో జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. ఇవిపోగా మిగిలిన 28 మండలాలను కరీంనగర్ జిల్లాలో కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. మహదేవపూర్, కాటారం, మల్హర్, మహాముత్తారం మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాలను సిద్దిపేట జిల్లాలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట మండలాలను వరంగల్ జిల్లాకు కేటాయించారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోకవర్గాల్లోని 12 మండలాలతోపాటు వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్, మేడిపల్లి మండలాలు, చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాలను జగిత్యాల జిల్లాలో కలపాలని సూచించారు. పైన పేర్కొన్న మండలాలు పోగా ప్రస్తుత జిల్లాలోని 28 మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని ప్రతిపాదించారు. ఇవి ప్రతిపాదనలు మాత్రమేనని, రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా మార్పులు చేర్పులుంటాయని జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడేవరకు మార్పులుండే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. కొత్త మండలాలపై సందిగ్ధత కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతమున్న 57 మండలాలకు తోడు అదనంగా మరో 17 కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని కోరుతూ కలెక్టర్ గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇందులో ఒక్క సిరిసిల్ల డివిజన్‌లోనే ఆరు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అట్లాగే ప్రస్తుతమున్న కరీంనగర్ మండలాలన్ని కొత్తగా నాలుగు మండలాలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రామగుండం మండలాన్ని మూడుగా విభజించాలని సూచించారు. పెద్దపల్లి, సిరిసిల్ల, వేములవాడ మండలాలను రెండుగా విభజించాలని పేర్కొన్నారు. కొత్త మండలాల సంఖ్యను కుదించాలని ఇటీవల ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో మళ్లీ మండలాలను కుదించే పనిలో పడ్డారు. ఇటీవల ప్రతిపాదించిన 17 మండలాలను తాజాగా ఎనిమిది నుంచి పదికి కుదించాలని యోచిస్తున్నారు. సోమవారం నాటికి ఈ ప్రక్రియకు తుదిరూపు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరోవైపు బెజ్జంకి, ఇల్లంతకుంట, హుస్నాబాద్ మండలాలను సిద్దిపేట జిల్లాలో ప్రతిపాదించినప్పటికీ స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికే వదిలేశామని జిల్లా అధికారులు చెబుతున్నారు. మళ్లీ ఉద్యోగుల విభజన షురూ... రెవెన్యూ డివిజన్, ఆ పైస్థాయి కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిని రెండు జిల్లాలకు విభజించే పనిలో పడ్డారు. జిల్లావ్యాప్తంగా 54 శాఖల వివరాలను సేకరించగా 7732 మంది ఉద్యోగులున్నట్లు గుర్తించారు. వీరిని కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు కేటాయించే కసరత్తు కొనసాగిస్తున్నారు. గతంలో కరీంనగర్ జిల్లాకు 2085 మంది, జగిత్యాల జిల్లాకు 2072 మంది, సిరిసిల్ల జిల్లాకు 2053 మందిని కేటాయిచాలని ప్రతిపాదించారు. తాజాగా సిరిసిల్లకు కేటాయించిన వారిని మిగిలిన రెండు జిల్లాలకు సర్దుబాటు చేయనున్నారు. -
కరీంనగర్ లో రాంగోపాల్ వర్మ హల్ చల్