బావ లైంగిక వేధింపులు.. మహిళ ఆవేదన.. ఆత్మహత్య | Selfie Sucide: Man Molestation On Woman In karimnagar | Sakshi
Sakshi News home page

మరదలిపై బావ లైంగిక వేధింపులు.. సెల్ఫీ వీడియో తీసుకుని..

Published Thu, Dec 2 2021 6:05 PM | Last Updated on Thu, Dec 2 2021 9:19 PM

Selfie Sucide: Man Molestation On Woman In karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక కాపువాడలో నివాసం ఉండే వివాహిత.. లైంగిక వేధింపులు తాళలేక సెల్ఫీవీడియో తీసిన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  బావ కనకయ్య కొన్ని రోజులుగా  తనను.. లైంగికంగా వేధిస్తున్నాడని ఆత్మహత్య చేసుకునే ముందు వీడియోలో తెలిపింది.

ఈ వీడియోలో బాధితురాలు అరుణ.. తన భర్త ఇంట్లో లేని సమయంలో కనకయ్య ఇంటికి వచ్చి వేధిస్తూ.. పిల్లలకు తప్పుగా చెబుతానని బెదిరించేవాడని పేర్కొంది. కాగా, తాను.. కష్టపడి మిషన్‌ కుట్టుకుంటూ తన పిల్లలను పోషించుకుంటున్నట్లు తెలిపింది.

కనకయ్య వేధింపులు తట్టుకోలేక.. ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో అరుణ ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలు ఎవరిజోలికి పోకుండా జాగ్రత్తగా బతకాలని తన చివరి మాటగా అరుణ​ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement