సాక్షి, కరీంనగర్ : జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తికి కొత్తగా కరోనా పాజిటివ్ రావడంతో మరోసారి కరీంనగర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సదరు వ్యక్తి కొద్దిరోజుల పాటు కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ చల్మెడ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు.
అతనికి ట్రీట్‌మెంట్ ఇచ్చిన వైద్యులు, కలిసిన ఆస్పత్రి సిబ్బంది, బంధువుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. పేషెంట్ బంధువు కరీంనగర్‌లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. కరోనా పాజిటివ్ పేషెంట్‌తో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న అందరిని క్వారంటైన్ పంపించే అవకాశం ఉంది. దేశంలోనే ఒకేసారి పది కరోనా పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాగా.. తొలిసారి రెడ్‌జోన్ ప్రకటించిన ప్రాంతంగా కరీంనగర్ అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడినా.. అధికారులు, ప్రజాప్రతినిదులు తీసుకున్న కఠిన నిర్ణయాలతో కరోనాను కట్టడి చేయగలిగారు. అయితే ఇప్పుడు మరోసారి కరోనా పాజిటివ్ రావడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment