
దుండిగల్: చనిపోయి 35 రోజులైన ఓ ఎస్సైని మరో పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయడం విడ్డూరంగా ఉంది. దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న బి.ప్రభాకర్‌రెడ్డి జూన్ 8న గుండెపోటుతో మృతి చెందారు. చనిపోయి నెల రోజులు దాటింది. కాగా.. సైబరాబాద్ పరిధిలో 83 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ గురు వారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో సీరియల్ నంబరు 26లో ప్రభాకర్‌రెడ్డిని జినోమి వ్యాలీ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయడం గమనార్హం. సైబరాబాద్ పోలీసు అధికారుల నిర్లక్ష్యం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగి.. ప్రభాకర్‌రెడ్డి పేరును జాబితాలోంచి తొలగించి మరోసారి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment