Dundigal police station
-
ఇదేందయ్యా ఇది! ఎస్సై చనిపోయి 35 రోజులు.. ఇప్పుడు బదిలీ ఉత్తర్వులు
దుండిగల్: చనిపోయి 35 రోజులైన ఓ ఎస్సైని మరో పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయడం విడ్డూరంగా ఉంది. దుండిగల్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న బి.ప్రభాకర్‌రెడ్డి జూన్ 8న గుండెపోటుతో మృతి చెందారు. చనిపోయి నెల రోజులు దాటింది. కాగా.. సైబరాబాద్ పరిధిలో 83 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ గురు వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో సీరియల్ నంబరు 26లో ప్రభాకర్‌రెడ్డిని జినోమి వ్యాలీ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయడం గమనార్హం. సైబరాబాద్ పోలీసు అధికారుల నిర్లక్ష్యం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగి.. ప్రభాకర్‌రెడ్డి పేరును జాబితాలోంచి తొలగించి మరోసారి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. -
మంత్రి మల్లారెడ్డిపై పోలీసు కేసు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. తన భూమిలో మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ.. కుత్బుల్లాపూర్ మండలం సూరారంకు చెందిన శ్యామలదేవి అనే మహిళ మల్లారెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి చెరలో ఉన్న భూమిని విడిపించాలంటూ ఓ న్యాయవాదిని సంప్రదిస్తే.. ఆయనతోనే మంత్రి మల్లారెడ్డి కుమ్మకై తప్పుడు పత్రాలు సృష్టించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళ ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. (చదవండి : భార్యను హతమార్చి.. పక్కనే వీడియో గేమ్ ఆడుతూ!) -
వ్యక్తి దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన యాదగౌడ్‌ను ఆసిఫ్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. ఫుల్‌గా మద్యం తాగించి, అనంతరం కత్తితో దాడి చేశాడు. మద్యం మత్తులోనే ఆసిఫ్ కత్తిచూపిస్తూ హల్చల్ చేశాడని స్థానికులు చెబుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగిందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
కాలేజీ బస్సును ఢీకొట్టిన లారీ
-
దుండిగల్‌లో కాలేజీ బస్సును ఢీకొట్టిన లారీ..
సాక్షి, హైదరాబాద్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. హితం కాలేజీకి చెందిన బస్సును ఓ లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు, బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. బస్సును లారీ వెనక నుంచి ఢీకొట్టడంతో వెనుక సీట్లలో కూర్చున్న ఇద్దరు విద్యార్థులు ఇరుక్కుపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. వర్షం కారణంగా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయని వెల్లడించారు. తలకు తీవ్ర గాయంకావడంతో బస్సు డ్రైవర్ అపస్మారక స్థితిలోకి జారుకున్నాడని వైద్య సిబ్బంది తెలిపారు. -
దుండిగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
హైదరాబాద్: నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాగిల్లాపూర్‌లో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి చెందడంతో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. సీఎం కేసీఆర్ ఈ ప్రమాదం ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మెదక్ జిల్లా కౌడిపల్లికి మండలం దేవుల్లపల్లి గ్రామస్తులు సూరారంలోని శివాలయనగర్లోని అమ్మవారి టెంపుల్లోని ఓ శుభకార్యానికి వచ్చారు. వారంతా ట్రాక్టర్లో ఇంటికి తిరిగి వెళుతుండగా దుండిగల్‌లోని చర్చి గాగిల్లాపూర్ వద్ద మెదక్ నుంచి అతివేగంతో వస్తున్న ఓ లారీ ఢీకొట్టింది. గాయపడ్డ వారిలో తేజా(10), శోభ (25), భవానీ(20), శ్రీదేవి(1)ల పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు మొగులానసాబ్ (55), నవీన్‌గౌడ్ (23), అంజమ్మ (65), భీమయ్య (60), రాజుగౌడ్ (10) గా పోలీసులు గుర్తించారు. -
రెస్క్యూ హోం నుంచి ముగ్గురు బాలికల అదృశ్యం
దుండిగల్: రెస్క్యూ హోం నుంచి ముగ్గురు బాలిక లు అదృశ్యమైన ఘటన దుండిగల్ పోలీ స్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై విద్యాసాగర్‌రెడ్డి కథనం ప్రకారం... సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన గ్రేసీకర్ (15) ఇంటి నుంచి పారిపోయి వచ్చింది. దీంతో బాలికను కుత్బుల్లాపూర్ మండ లం చర్చి గాగిల్లాపూర్‌లోని నవజ్యోతి నికేతన్ రెస్క్యూ హోంలో చేర్పించారు. ప్రస్తుతం గ్రేసీకర్ స్థానిక సెయింట్ ఇగ్నీషియస్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ఇదిలా ఉండగా.. ఆరు నెలల క్రితం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద తప్పిపోయిన తమిళనాడుకు చెందిన వరలక్ష్మి (14), రెండు నెలల క్రితం జూపార్కు వద్ద తప్పిపోయిన సారా కాటూన్ (17)లను రెస్క్యూ హోంకు తరలించారు.వరలక్ష్మి స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతుండగా, సారాకాటూన్ రెస్క్యూ హోంలోనే ఉంటోంది. కాగా, శుక్రవారం రాత్రి ఈ ముగ్గురు బాలికలు రెస్క్యూ హోం నుంచి తప్పిం చుకున్నారు. బాలికల ఆచూకీ కోసం ప్రయత్నిం చినా ఫలితం లేకపోవడంతో శనివారం రెస్క్యూ హోం నిర్వాహకులు దుండిగల్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. మరో బాలిక సైతం వెళ్లి తిరిగి వచ్చినట్లు సమాచారం. గ్రేసీకర్ గతంలోనూ ఇదే విధం గా రెస్క్యూ హోం నుంచి వెళ్లినట్లు తెలిసింది. ఈ మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్ఎంపీ గొంతుకోసిన దుండగులు
రంగారెడ్డి(దుండిగల్): దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సూరారంలో గుర్తుతెలియని వ్యక్తులు బాల్లింగమ్(50) అనే ఆర్ఎంపీ డాక్టర్ గొంతు కోశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలిసింది. స్థానికుల సహాయంతో బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలిసిన వాళ్లే ఈ పని చేసుంటారని అనుమానిస్తున్నారు. -
కిరాతకుడు
కన్నతండ్రి ఘాతుకం పిల్లలను చంపి.. ఆత్మహత్యాయత్నం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఘటన హత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు దుండిగల్, న్యూస్‌లైన్: మానవత్వం మంటగలిసింది.. సభ్యసమాజం తల దించుకుంది.. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు.. ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కలకలం సృష్టించిన ఈ సంఘటన మంగళవారం దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నర్మేట మండలం గండిరామరం గ్రామానికి చెందిన కొండేటి సంపత్‌కుమార్ (40)కు అదే జిల్లా మద్దూర్ మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన గాజుల మురహరి, అండాలు కుమార్తె కరుణ (లక్ష్మి)తో పదకొండేళ్ల క్రితం వివాహం జరిగింది. పదేళ్ల క్రితం కుటుంబంతో కలిసి నగరానికి వలస వచ్చిన సంపత్.. సూరారం కాలనీ డివిజన్ సాయిబాబా నగర్ పాండు బస్తీలో నివసిస్తున్నాడు. వీరికి రాకేష్(10), రాజశ్రీ (09) అనే ఇద్దరు పిల్లలున్నారు. డీసీఎం డ్రైవర్‌గా పనిచేసే సంపత్ భార్య కరుణ గత సంవత్సరం ఫిబ్రవరి 15న అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో అప్పటి నుంచి పిల్లలిద్దరూ బోరబండలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. స్థానికంగా ఉన్న భార్గవి విద్యానికేతన్ స్కూల్లో రాకేశ్ 5వ తరగతి, రాజశ్రీ 4వ తరగతి చదువుతున్నారు. కాగా పది రోజుల క్రితం బోరబండలోని అత్తగారి ఇంటికి వెళ్లిన సంపత్.. వేసవి సెలవులకు పిల్లలను తీసుకెళ్తానని చెప్పి తన ఇంటికి తీసుకు వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి రాకేశ్, రాజశ్రీలకు మొదట విషం ఇచ్చి ఆ తరువాత ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆనక మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో సంపత్ పురుగుల మందు (ఎండ్రిన్) తాగాడు. వెంటనే బయటకు వచ్చి తనంతట తానే కొట్టుకుంటుండగా.. స్థాని కులు గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా.. ఇద్దరు చిన్నారులు మంచంపై విగత జీవులుగా పడి ఉన్నారు. వారు అందించిన సమాచారం మేరకు దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సంపత్‌ను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిన్నారుల మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పంపారు. కాగా సంపత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చిన్నారులను ఎందుకు హత్య చేసినట్టు? గత సంవత్సరమే సంపత్ భార్య చనిపోయింది. ఈ క్రమంలో ఇద్దరు పిల్లల ఆలనాపాలన వారి అమ్మమ్మ వాళ్లే చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సంపత్ ఒక్కడే ఉంటున్నాడు. అయితే చిన్నారులను అతి దారుణంగా హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా సంపత్ ఇతర స్త్రీలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని.. గతంలో తన అక్క కరుణను, ఇప్పుడు ఈ పిల్లల్ని హత్య చేశాడని అతని బావమరిది రాంప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఎలా హత్య చేశాడు? పిల్లలిద్దరికీ విషం ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. అయితే గొంతు నులి మి హత్య చేశాడా.. లేక దిండు మొఖానికి అడ్డు పెట్టి చంపాడా.. లేదా పురుగుల మందు తాగించి హత్య చేశాడా అన్న వివరాలు పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలనున్నాయి. ఫ్యాన్‌కు మాత్రం టవల్‌తో ఉరి వేసి ఉంది. చిన్నారులను రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య సమయంలో హత్య చేసి ఉండవచ్చని పోలీసు లు భావిస్తున్నారు. కాగా సంపత్ మాత్రం రాత్రంతా ఇంట్లోనే గడిపి ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో ఉన్న ఎండ్రిన్ తాగినట్లు తెలుస్తోంది. ఇంట్లో గోడలపై రాతలు.. ఇంట్లోని గోడలపై బొగ్గుతో సంపత్ పలు రాతలు రాశాడు. వారి పిల్లలు రాసినట్లుగా ‘మా అమ్మ కరుణ’ అంటూ ఇంట్లోని అన్ని గోడలపై రాశాడు. పిల్లలే రాసినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అదేవిధంగా స్థానికంగా ఉండే ఓ మహిళ పేరును ప్రస్తావిస్తూ ‘ఐ లవ్ యూ.. నిన్ను నేను మరవను.. నీ గురించే నా మరణం’ అంటూ గోడపై రాశాడు. బాత్రూం గోడపై మాత్రం ‘ప్లీజ్ కరుణ నన్ను మన్నించు’ అని రాశాడు. వివాహేతర సంబంధాల కారణంగానే సంపత్ చిన్నారులను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా చిన్నారులను దారుణంగా హత్య చేసిన సంపత్‌ను నడిరోడ్డుపై ఉరి తీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.