
సాక్షి, హైదరాబాద్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. హితం కాలేజీకి చెందిన బస్సును ఓ లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు, బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. బస్సును లారీ వెనక నుంచి ఢీకొట్టడంతో వెనుక సీట్లలో కూర్చున్న ఇద్దరు విద్యార్థులు ఇరుక్కుపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. వర్షం కారణంగా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయని వెల్లడించారు. తలకు తీవ్ర గాయంకావడంతో బస్సు డ్రైవర్ అపస్మారక స్థితిలోకి జారుకున్నాడని వైద్య సిబ్బంది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment