
సాక్షి,బాపట్లజిల్లా: చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద ప్రైవేటు కాలేజి బస్సు దగ్ధమైంది. రేపల్లెకు నర్సింగ్ కాలేజీ విద్యార్థులను తీసుకువెళ్తుండగా బస్సులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అప్రమత్తమై బస్సును డ్రైవర్ ఆపేశారు. వెంటనే విద్యార్థులను బస్సు డ్రైవర్ దింపేశారు. విద్యార్థులందరూ దిగిన తర్వాత కాలేజీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తత వల్లే తాము పప్రాణాలతో మిగిలామని విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: మా పాపకు అన్యాయం జరిగింది
Comments
Please login to add a commentAdd a comment