college bus
-
మంటల్లో కాలేజీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
సాక్షి,బాపట్లజిల్లా: చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద ప్రైవేటు కాలేజి బస్సు దగ్ధమైంది. రేపల్లెకు నర్సింగ్ కాలేజీ విద్యార్థులను తీసుకువెళ్తుండగా బస్సులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.అప్రమత్తమై బస్సును డ్రైవర్ ఆపేశారు. వెంటనే విద్యార్థులను బస్సు డ్రైవర్ దింపేశారు. విద్యార్థులందరూ దిగిన తర్వాత కాలేజీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తత వల్లే తాము పప్రాణాలతో మిగిలామని విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.ఇదీ చదవండి: మా పాపకు అన్యాయం జరిగింది -
హైదరాబాద్: చార్జీలు సరే.. బస్సేదీ!
సాక్షి, హైదరాబాద్: టికెట్ ధరల్లో రౌండప్ పేరిట, డీజిల్ సెస్ పేరుతో భారీగా చార్జీలు పెంచిన ఆర్టీసీ తాజాగా విద్యార్థులను సైతం వదిలిపెట్టకుండా పాస్‌లపై మోత మోగించింది. చార్జీలను రెండింతలు చేసింది. ప్రయాణికుల రద్దీ, వివిధ ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌కు సరిపడా బస్సులు మాత్రం ఏర్పాటు చేయలేకపోతోంది. నగర శివారు ప్రాంతాల్లోని వందలాది కాలనీలు, బస్తీలకు తగినన్ని బస్సుల్లేవు. ఆర్టీసీ పెంచిన చార్జీలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా బస్సులు అందుబాటులో లేకపోవంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. ఉదయం, సాయంత్రం విద్యార్థుల రద్దీ మేరకు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ రూపొందించకపోవడం విడ్డూరం. సకాలంలో బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సివస్తోంది. కొరత.. తీరని వ్యధ.. ∙కీసర, రాంలింగంపల్లి, తూముకుంట, బండకాడిపల్లి, ఉషారుపల్లి, ఉద్దమర్రి తదితర ప్రాంతాల నుంచి ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు ఈసీఐఎల్, కుషాయిగూడ, సైనిక్‌పురి, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలకు వెళ్తుంటారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఘట్కేసర్, కీసర వైపు ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలకు వేలాది మంది విద్యార్థులు ప్రతి రోజు రాకపోకలు సాగిస్తారు. ఈసీఐఎల్ నుంచి ఉషారుపల్లి, ఉద్దమర్రి, బండకాడిపల్లి తదితర గ్రామాలకు బస్సులు పెంచాలని ఏడాదిగా స్థానికులు ఆర్టీసీని కోరుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ రూట్లో బస్సుల సంఖ్య పెరగలేదు. దీంతో విద్యార్ధులు, కూరగాయల రైతులు, పాల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగర శివార్లలోని అనేక ప్రాంతాల్లోనూ విద్యార్ధులు, స్థానికుల డిమాండ్ మేరకు సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో రోజుకు 6 ట్రిప్పులు తిరిగిన రూట్లలో ఇప్పుడు మూడు ట్రిప్పులే నడుస్తున్నాయి. 4 ట్రిప్పులను రెండింటికి కుదించారు. గ్రేటర్లో బస్సుల సంఖ్య భారీగా తగ్గడమే ఇందుకు కారణం. గతంలో 3850 బస్సులు ఉంటే ఇప్పుడు 2550 మాత్రమే తిరుగుతున్నాయి. ట్రిప్పుల సంఖ్య గణనీయంగా తగ్గింది. విద్యా సంస్థలు తెరిస్తే కష్టమే... నగర శివార్లలోని ప్రాంతాల్లోని కళాశాలల్లో సుమారు 7 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వివిధ మార్గాల్లో ప్రతి రోజు 1500 బస్సులు నడుస్తున్నట్లు అంచనా. కానీ సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులకు రవాణా సదుపాయాన్నందజేసే ఈ బస్సుల్లో విద్యార్థులు ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నారు. అమ్మాయిలకు బస్సు ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. -
పట్టుతప్పితే..
చాంద్రాయణగుట్ట :ఉదయం కాలేజీకి వెళ్లే విద్యార్థులు బస్సు ఫుట్‌బోర్డులపై సర్కస్ ఫీట్లు చేస్తూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. పలువురు వద్దని వారిస్తుంటే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. పొరపాటున కిటికీ రాడ్డు ఊడిపోతే ప్రాణానికే ప్రమాదం.. మంగళవారం ఉదయం చాంద్రాయణగుట్ట వద్ద కనిపించిందీ ఈ దృశ్యం. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
శ్రీకాకుళం , టెక్కలి/టెక్కలి రూరల్: మండలంలోని పరశురాంపురం జంక్షన్ సమీప జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఎనిమిది మంది విద్యార్థులు స్వల్ప గాయాలతోనూ మిగిలిన వారు సురక్షితంగానూ బయట పడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే... కళాశాల నుంచి పాతపట్నం వైపు వెళ్లేందుకు విద్యార్థులతో సాయంత్రం 4 గంటలకు బస్సు బయలు దేరింది. పరశురాంపురం జంక్షన్ రోడ్డులో మళ్లించే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి మెల్లగా రోడ్డుకు ఒక భాగంలోని కంకర మీదుగా వెళ్లి బోల్తా పడింది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న మెళియాపుట్టి ఎస్ఐ రాజేష్ హుటాహుటిన చేరుకుని స్థానికుల సాయంతో గాయాలపాలైన విద్యార్థులను, బస్సు సిబ్బందిని రక్షించే ప్రయత్నాలు చేశారు. అనంతరం టెక్కలి పోలీసులకు సమాచారం అందజేశారు. హైవే అంబులెన్స్, 108 వాహనం సాయంతో గాయపడిన విద్యార్థులను టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ డీ లక్ష్మణరావుతోపాటు విద్యార్థులు ఎస్ సోనియా, ఆర్ తనూషా, కే గంగాధర్, పీ జయకృష్ణ, బీ లక్ష్మణరావు, ఎల్ సాయి, ఎస్ ప్రేమ, ఏ శివానీ తదితరులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిలో సోనియాను మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించే చర్యలు చేపట్టారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది అత్యుత్సాహంపై ఆగ్రహం ఈ సంఘటనను చూసిన స్థానికులు కొంతమంది తమ వాహనాలను పార్కింగ్ చేసి సహాయక చర్యలు చేపడుతుండగా, హైవే పెట్రోలింగ్ పోలీస్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానికుల వాహనాలకు చెందిన ప్లగ్‌లు తొలగించడంతో వారంతా ఎదురుతిరిగారు. తామంతా సహాయ చర్యలు చేపడుతుండగా, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఇలా వ్యవహరించడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కళాశాల బస్సుకు షార్ట్ సర్క్యూట్
తూర్పుగోదావరి, మారేడుమిల్లి: ఓ కళాశాల బస్సు ఇంజిన్‌లో షార్టుసర్యూట్ కారణంగా మంటలు చెలరేగి, బస్సులో పొగలు వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. రాజానగర మండలం తూర్పు గోనగూడెం ఐఎస్టీఎస్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు శుక్రవారం కళాశాల బస్సులో రాజానగరం నుంచి విశాఖ జిల్లా సీలేర్కు టూర్‌కు వెళుతుండగా మారేడుమిల్లి వచ్చే సరికి బస్సు ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి బస్సులో పొగలు వ్యాపించాయి. స్థానిక వినాయక గుడి వద్దకు వచ్చే సరికి బస్సు అంతా పొగ వ్యాపించడంతో డ్రైవర్ తక్షణమే బస్సును నిలిపివేశాడు. భయందోళనకు గురైన విద్యార్థులు వెంటనే బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు. బస్సులో సుమారు 55 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. పొంగ కారణంగా ఇంజినీరింగ్ ఫస్టియర్ చెందిన సింధూ అనే విద్యార్థి స్పృహ కోల్పోయింది. సమీపంలో పోలీస్ స్టేషన్ ఉండడంతో ప్రమాదాన్ని గుర్తించిన గుర్తేడు ఎస్సై నాగేశ్వరరావు సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి బస్సులో మంటలు అదుపుజేశారు. స్పృహ కోల్పోయిన విద్యార్థికి ప్రథమ చికిత్స అందించడంతో కోలుకుంది. -
కాలేజీ బస్సును ఢీకొట్టిన లారీ
-
దుండిగల్‌లో కాలేజీ బస్సును ఢీకొట్టిన లారీ..
సాక్షి, హైదరాబాద్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. హితం కాలేజీకి చెందిన బస్సును ఓ లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు, బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. బస్సును లారీ వెనక నుంచి ఢీకొట్టడంతో వెనుక సీట్లలో కూర్చున్న ఇద్దరు విద్యార్థులు ఇరుక్కుపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. వర్షం కారణంగా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయని వెల్లడించారు. తలకు తీవ్ర గాయంకావడంతో బస్సు డ్రైవర్ అపస్మారక స్థితిలోకి జారుకున్నాడని వైద్య సిబ్బంది తెలిపారు. -
అదుపు తప్పి.. మదపుటేనుగులా..
రాజోలు : డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపు తప్పిన కళాశాల బస్సు.. మదపుటేనుగులా విద్యార్థులతో పాటు రోడ్డుపై వెళుతున్న వారిని భీతావహులను చేసింది. 5గురు విద్యార్థులు సహా 8 మందిని తీవ్రంగా గాయపరిచింది. శనివారం ఉదయం 8.30 గంటలకు తాటిపాక నుంచి ఓడలరేవు వెళ్తున్న బీవీసీ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మొదట ట్రాక్టర్‌ను, మోటార్ సైకిల్‌ను, సైకిల్‌ను, తర్వాత రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. స్తంభం ముక్కలై బస్సు మీద పడడంతో విద్యార్థులు ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కర్రి సత్యనారాయణ, మోటార్‌సైకిల్‌పై కుమారుడిని పదవ తరగతి పరీక్షకు తీసుకు వెళ్తున్న దీపాటి జగదీష్, సైకిలిస్ట్ రుద్రా సత్యనారాయణ, విద్యార్థులు పుచ్చకాయల దుర్గాప్రసాద్, దొడ్డా జ్యోతి శిరీష, మల్లిపూడి రాజేష్, కానూరి నరేష్, ప్రభుతేజ తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. బస్సు డ్రైవర్ పరారయ్యాడు. గాయపడ్డ వారిలో కొందరిని స్థానిక ఎంఎస్ ఆస్పత్రికి , కొందరిని అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఆర్డీవో పి.వి.రమణ, సీఐ క్రిష్టోఫర్, ఎస్సై లక్ష్మణరావు పరిశీలించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులకు అందిస్తున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ఘటన సమయంలో విద్యుత్ నిలిచిపోవడంతో 30 మంది విద్యార్థులకు పెను ముప్పు తప్పిందని స్థానికులు తెలిపారు. సఖినేటిపల్లి నుంచి ఓడలరేవు బయలుదేరిన బస్సును ప్రారంభం నుంచి డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపాడని, సోంపల్లి, పొదలాడ సమీపంలోనే కొద్దిలో ప్రమాదం తప్పిందని విద్యార్థులు చెప్పారు. రాజోలు, పి.గన్నవరం వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. -
బాలికను చిదిమేసిన కాలేజీ బస్సు
హైదరాబాద్: అదుపుతప్పిన ఓ కళాశాల బస్సు బాలికను చిదిమేసింది. శుభకార్యానికి వెళ్తున్న బాలిక కాలేజీ బస్సు కారణంగా తిరిగిరాని లోకాలకు వెళ్లింది. బుధవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపేటకు చెందిన బొడ్డుపల్లి బాలకిషన్ కూతురు మధుశాలిని (12) చైతన్యపురిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని తమ బంధువుల ఇంట్లో జరిగే ఓ శుభకార్యానికి వెళ్లే క్రమంలో తన బాబాయ్ వెంకటేశ్‌తో కలసి బైకుపై వెళ్తుండగా.. పెద్దఅంబర్‌పేట గ్రామం నుంచి ఓ ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతుండగా నగరం వైపు నుంచి వస్తున్న సెయింట్‌మేరీస్ కాలేజీకి చెందిన బస్సు ఢీ కొట్టింది. దానిని తప్పించే క్రమంలో కాలేజీ బస్సు వెంకటేశ్ బైకును వెనుకనుంచి ఢీ కొట్టింది. దీంతో బైకు వెనుకసీటులో కూర్చున్న మధుశాలిని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంలో వెంకటేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అంబులెన్స్‌ను ఢీకొన్న కాలేజీ బస్సు..ముగ్గురి మృతి
విజయనగరం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న అంబులెన్స్‌ను ఓ కాలేజీ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన దెంకాడ మండలం లెండి ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో జరిగింది. బాధితులు రాయగఢ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కాలేజి బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థిని మృతి
కూకట్పల్లి (హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి వివేకానందనగర్‌లో మంగళవారం జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని మౌనిక(16) ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సాయంత్రం మృతిచెందింది. తన అక్కతో కలిసి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాయటానికి స్కూటీపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన సీఎంఆర్ కళాశాలకు చెందిన ఏపీ 23 వి 7333 నంబరు గల బస్సు ఢీకొట్టింది. మౌనికను స్థానిక రెమెటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె సాయంత్రం మృతిచెందింది. మౌనిక కూకట్‌పల్లిలోని శ్రీచైతన్య కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. -
పాతబస్తీలో కాలేజీ బస్సు బీభత్సం
బహదూర్‌పురా (హైదరాబాద్) : ఓ ప్రైవేటు కళాశాల బస్సు మందుల దుకాణంలోకి దూసుకెళ్లిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇన్స్పెక్టర్ ఎ.బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం... గురునానక్ ఇనిస్టిట్యూషన్స్‌కు చెందిన బస్సు పురానాపూల్ చౌరస్తాలోని గుడ్‌విల్ హోటల్ వద్దకు రాగానే బ్రేకులు ఫెయిల్ కావడంతో సాయిబాబా మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది. అదే సమయంలో షాపు వద్ద మందులు కొనుగోలు చేస్తున్న కామాటిపురా మురళీనగర్ ప్రాంతానికి చెందిన శివకళాబాయి (60) అక్కడికక్కడే మృతి చెందింది. ధూల్‌పేట్ ప్రాంతానికి చెందిన ప్రేమాబాయి, ఉస్మాన్‌బాగ్ ప్రాంతానికి చెందిన బషీర్ (32)కు గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కాలేజ్ బస్సు, లారీ ఢీ: ఏడుగురికి గాయాలు
అనకాపల్లి: విశాఖ జిల్లా అనకాపల్లి పరిధిలోని సుంకరమెట్ట-జలగల మధు జంక్షన్ల మధ్య ఓ కళాశాల బస్సు, లారీ ఢీకొనడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు అనకాపల్లి డైట్ కళాశాలకు చెందినది. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇద్దరు బీటెక్ విద్యార్థుల దుర్మరణం
కుత్బుల్లాపూర్ : కారును ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కళాశాల బస్సును బైక్ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు, ఎస్సై వెంకటేష్ కథనం ప్రకారం.. మెదక్ జిల్లా జిన్నారం మండలం చెట్లపోతారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ చిన్న కుమారుడు మద్దులపటేల్ శ్రీధర్(22) కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజీలో బీటెక్ తృతీయ సంవత్సరం, షాపూర్‌నగర్‌కు చెందిన రఘుపతి పెద్ద కుమారుడు దూపనపల్లి నవీన్(21) బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. స్నేహితులైన వీరిద్దరూ శనివారం సాయంత్రం కళాశాల నుంచి బైక్‌పై బహదూర్‌పల్లి వైపు వస్తూ మైసమ్మగూడ మూలమలుపు వద్ద ముందుగా వెళ్తున్న కారును ఓవర్టేక్ చేశారు. ఇదే క్రమంలో ఎదురుగా వచ్చిన ఎంఎల్ఆర్ ఐటీ కళాశాల బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శ్రీధర్, నవీన్ తలలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సూరారంలోని నారాయణ హృదయాలయకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.