
విజయనగరం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న అంబులెన్స్‌ను ఓ కాలేజీ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన దెంకాడ మండలం లెండి ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో జరిగింది. బాధితులు రాయగఢ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.