కూకట్‌పల్లి (హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో మంగళవారం జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని మౌనిక(16) ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సాయంత్రం మృతిచెందింది. తన అక్కతో కలిసి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాయటానికి స్కూటీపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన సీఎంఆర్ కళాశాలకు చెందిన ఏపీ 23 వి 7333 నంబరు గల బస్సు ఢీకొట్టింది. మౌనికను స్థానిక రెమెటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె సాయంత్రం మృతిచెందింది. మౌనిక కూకట్‌పల్లిలోని శ్రీచైతన్య కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది.