కాలేజ్ బస్సు, లారీ ఢీ: ఏడుగురికి గాయాలు | 7 injured in road accident | Sakshi
Sakshi News home page

కాలేజ్ బస్సు, లారీ ఢీ: ఏడుగురికి గాయాలు

Published Sat, Jul 25 2015 10:32 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

7 injured in road accident

అనకాపల్లి: విశాఖ జిల్లా అనకాపల్లి పరిధిలోని సుంకరమెట్ట-జలగల మధు జంక్షన్ల మధ్య ఓ కళాశాల బస్సు, లారీ ఢీకొనడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు అనకాపల్లి డైట్ కళాశాలకు చెందినది. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement