దుండిగల్: రెస్క్యూ హోం నుంచి ముగ్గురు బాలిక లు అదృశ్యమైన ఘటన దుండిగల్ పోలీ స్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై విద్యాసాగర్‌రెడ్డి కథనం ప్రకారం... సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన గ్రేసీకర్ (15) ఇంటి నుంచి పారిపోయి వచ్చింది. దీంతో బాలికను కుత్బుల్లాపూర్ మండ లం చర్చి గాగిల్లాపూర్‌లోని నవజ్యోతి నికేతన్ రెస్క్యూ హోంలో చేర్పించారు. ప్రస్తుతం గ్రేసీకర్ స్థానిక సెయింట్ ఇగ్నీషియస్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది.
ఇదిలా ఉండగా.. ఆరు నెలల క్రితం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద తప్పిపోయిన తమిళనాడుకు చెందిన వరలక్ష్మి (14), రెండు నెలల క్రితం జూపార్కు వద్ద తప్పిపోయిన సారా కాటూన్ (17)లను రెస్క్యూ హోంకు తరలించారు.వరలక్ష్మి స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతుండగా, సారాకాటూన్ రెస్క్యూ హోంలోనే ఉంటోంది. కాగా, శుక్రవారం రాత్రి ఈ ముగ్గురు బాలికలు రెస్క్యూ హోం నుంచి తప్పిం చుకున్నారు.
బాలికల ఆచూకీ కోసం ప్రయత్నిం చినా ఫలితం లేకపోవడంతో శనివారం రెస్క్యూ హోం నిర్వాహకులు దుండిగల్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. మరో బాలిక సైతం వెళ్లి తిరిగి వచ్చినట్లు సమాచారం. గ్రేసీకర్ గతంలోనూ ఇదే విధం గా రెస్క్యూ హోం నుంచి వెళ్లినట్లు తెలిసింది. ఈ మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రెస్క్యూ హోం నుంచి ముగ్గురు బాలికల అదృశ్యం
Published Sun, Jan 24 2016 3:02 AM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM
Advertisement
Advertisement