three girls
-
రాజస్తాన్‌లో ముగ్గురు బాలికలపై అత్యాచారాలు
జైపూర్: రాజస్తాన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు బాలికలు అత్యాచారానికి గురయ్యారు. ఇందులో ఆళ్వార్ జిల్లా కూడా ఉంది. ఇటీవల ఈ జిల్లాలోనే దళిత మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆళ్వార్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(15) ఈ నెల 14వ తేదీన బంధువుల ఇంట్లో జరిగిన వివాహానికి వెళ్లగా ముగ్గురు బాలురు ఆమెను అపహరించి, గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడ్డారు. ఇది తెలిసిన బాధితురాలి బంధువులు నిందితుల్లో ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. వారిలో ఒకరు మరుసటి రోజు రోడ్డు పక్క శవమై కనిపించాడు. మిగతా ఇద్దరినీ కోర్టు ఆదేశాల మేరకు జువెనైల్ హోంకు తరలించినట్లు ఎస్పీ అనిల్ తెలిపారు. ఈ నెల 17న చురు ప్రాంతంలో ఆరేళ్ల బాలికపై బంధువైన 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఈనెల 16న ధోల్పూర్లో బాలిక(8)పై యువకుడు(18) అత్యాచారం చేశాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇలా ఉండగా, ఏప్రిల్ 26వ తేదీన ఆళ్వార్‌లో దళిత మహిళపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురిపైనా పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న లైంగికదాడులపై బీజేపీ మండిపడింది. -
ఢిల్లీలో ఆకలితో చిన్నారుల మరణం
-
ఇంటి నుంచి పారిపోయేందుకు బాలికల యత్నం
మంగళగిరి రూరల్:ముగ్గురు బాలికలు వారికి నచ్చిన వారితో బతకాలనుకున్నారు. ఒకేచోట పనిచేసే ఆ ముగ్గురూ ఒక మాటగా అనుకొని అర్ధరాత్రి ఇంట్లో నుంచి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణ పోలీసుల కథనం ప్రకారం... స్థానిక పార్క్ రోడ్ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలు మెయిన్ బజారులో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుంటారు. వీరు ముగ్గురూ కొద్దికాలంగా పట్టణానికి చెందిన ముగ్గురు యువకులతో స్నేహం చేస్తూ ప్రేమలో పడ్డారు. వారితో కలసి జీవించడం కోసం ఇంట్లో నుంచి పారిపోవాలని నిశ్చయించుకున్నారు. పక్కాగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇళ్లలో నుంచి వచ్చేసి బస్టాండ్ సమీపంలో వారు ప్రేమించిన యువకుల కోసం తిరుగుతున్నారు. అదే సమయంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పట్టణ ఎస్.ఐ. బాలకృష్ణ వారి వద్దకు చేరుకుని విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ముగ్గురు ప్రేమించిన యువకులు కూడా మైనర్లే కావడం విశేషం. బాలికల నుంచి ఎస్ఐ తల్లిదండ్రుల సమాచారం తెలుసుకుని వారిని పిలిపించి అప్పగించారు. సోమవారం ఉదయం బాలికలతో సహా తల్లిదండ్రులను పట్టణ సీఐ హరికృష్ణ, ఎస్ఐ బాలకృష్ణ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపివేశారు. అయితే, ఆ ముగ్గురు యువకుల వివరాలు మాత్రం తెలియలేదు. -
ముగ్గురు బాలికలు అదృశ్యం
హైదరాబాద్: రామంతాపూర్ సత్యసాయి టెక్నో స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు కనిపించకుండాపోయారు. చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు వెళ్తున్నామని తోటి వారికి చెప్పి శుక్రవారం ఉదయం బయలుదేరిన హరిణి, శ్రావ్య, నేహ అనే వారు తిరిగిరాలేదు. వీరి అదృశ్యంపై తల్లిదండ్రులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. -
బెంగాల్లో యువతులపై యాసిడ్ దాడి
-
ఆశ్రమంలో ముగ్గురు బాలికలు అదృశ్యం
-
రెస్క్యూ హోం నుంచి ముగ్గురు బాలికల అదృశ్యం
దుండిగల్: రెస్క్యూ హోం నుంచి ముగ్గురు బాలిక లు అదృశ్యమైన ఘటన దుండిగల్ పోలీ స్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై విద్యాసాగర్‌రెడ్డి కథనం ప్రకారం... సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన గ్రేసీకర్ (15) ఇంటి నుంచి పారిపోయి వచ్చింది. దీంతో బాలికను కుత్బుల్లాపూర్ మండ లం చర్చి గాగిల్లాపూర్‌లోని నవజ్యోతి నికేతన్ రెస్క్యూ హోంలో చేర్పించారు. ప్రస్తుతం గ్రేసీకర్ స్థానిక సెయింట్ ఇగ్నీషియస్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ఇదిలా ఉండగా.. ఆరు నెలల క్రితం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద తప్పిపోయిన తమిళనాడుకు చెందిన వరలక్ష్మి (14), రెండు నెలల క్రితం జూపార్కు వద్ద తప్పిపోయిన సారా కాటూన్ (17)లను రెస్క్యూ హోంకు తరలించారు.వరలక్ష్మి స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతుండగా, సారాకాటూన్ రెస్క్యూ హోంలోనే ఉంటోంది. కాగా, శుక్రవారం రాత్రి ఈ ముగ్గురు బాలికలు రెస్క్యూ హోం నుంచి తప్పిం చుకున్నారు. బాలికల ఆచూకీ కోసం ప్రయత్నిం చినా ఫలితం లేకపోవడంతో శనివారం రెస్క్యూ హోం నిర్వాహకులు దుండిగల్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. మరో బాలిక సైతం వెళ్లి తిరిగి వచ్చినట్లు సమాచారం. గ్రేసీకర్ గతంలోనూ ఇదే విధం గా రెస్క్యూ హోం నుంచి వెళ్లినట్లు తెలిసింది. ఈ మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దుండగుని మాటలు నమ్మి మోసపోయి...
నగరానికి చేరుకున్న బంగ్లాదేశ్ బాలికలు సికింద్రాబాద్: పని ఇప్పిస్తానని నమ్మబలికి ముగ్గురు బాలికలను బంగ్లాదేశ్ నుంచి నగరానికి తీసుకొచ్చి ఉడాయించాడో మోసగాడు. దీంతో దిక్కు తోచని స్థితిలో రైల్వేస్టేషన్లో తచ్చాడుతున్న ఆ ముగ్గురు బాలికలను మంగళవారం దివ్యదిశ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చేరదీసి ఆశ్రయం కల్పించారు. వివరాలు.. బంగ్లాదేశ్‌కు చెందిన ఆశియా అక్తర్ (11), రోహిమా (15), ముర్షీదాబేగం (13)లకు గుర్తు తెలియని వ్యక్తి హైదరాబాద్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, బాగా డబ్బు సంపాదించుకొని తల్లిదండ్రుల వద్దకు తిరిగి రావచ్చని నమ్మబలికాడు. దీంతో వారు అతడితో కలిసి రైలు ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకున్నారు. రైలు ప్రయాణంలోనే అతడి మాటలు, ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం వచ్చిన బాలికలు తమకు నిజంగానే ఉద్యోగాలు ఇప్పిస్తావా? లేదా అంటూ అతడిని నిలదీశారు. దీంతో అతను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లి కనిపించకుండాపోయాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాలికలు చేతిలో చిల్లిగవ్వలేకపోయినా తిరిగి బంగ్లాదేశ్ వెళ్లేందుకు సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని దివ్యదిశ స్వచ్ఛంద సంస్థకు చెందిన చైల్డ్ హెల్ప్‌డెస్క్ ప్రతినిధులు గమనించి వివరాలు తెలుకున్నారు. బాధిత బాలికలతో తమను నగరానికి తీసుకొచ్చి పారిపోయిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయించారు. అనంతరం నింబోలిఅడ్డాలోని బాలికల వసతిగృహంలో బాలికలకు ఆశ్రయం కల్పించారు. బాలికల కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. -
ముగ్గురు బాలికల ఆత్మహత్యాయత్నం
* స్టేట్ హోంలో ఘటన * చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలింపు * వేధింపులు తాళలేకే అంటున్న బాధితులు హైదరాబాద్: స్టేట్ హోంలో ముగ్గురు బాలికలు గురువారం ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది. వెంటనే బాలికలను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా సురక్షితంగా ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు. వారం క్రితం స్టేట్‌హోం సిబ్బంది కళ్లుగప్పి పారిపోయిన 11మంది బాధితుల్లో ఈ ముగ్గురు కూడా ఉండటం గమనార్హం. వివిధ నేరాలకు పాల్పడి అరెస్టైన 18 ఏళ్లలోపు అమ్మాయిలను కోర్టు ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాంగణంలోని రెస్క్యూ హోంకు తరలిస్తారు. అలాగే తల్లిదండ్రులులేని అనాథలు, భర్త, ఇతరుల నిరాధరణకు గురైన మహిళలకు స్టేట్‌హోంలో వసతి కల్పిస్తారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన 15 ఏళ్ళ బాలిక, మెదక్ జిల్లా కారమంగి గ్రామానికి చెందిన 16 ఏళ్ళ బాలిక, ఖమ్మం జిల్లా ముట్టితాండ గ్రామానికి చెందిన 15 ఏళ్ళ బాలిక సిబ్బంది వేధింపులు తాళలేక గురువారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రెస్క్యూహోంలోని ఇద్దరు బాలికలు ఐరన్ టాబ్లెట్లను మింగగా, స్టేట్‌హోంలోని మరో బాలిక సర్ఫ్ కలిపిన నీళ్లు తాగింది. హోం ఇన్చార్జి నిర్మల వెంటనే 108కు సమాచారం అందించి, చికిత్స కోసం వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలికలు మింగిన మాత్రలు, తాగిన సర్ఫ్ నీళ్లను వైద్యులు బలవంతంగా కక్కించారు. వేధింపులు తాళలేకే.. అధికారుల వేధింపులు తాళలేకే తాము ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే హోంలో ఆశ్రమం పొందుతున్న బాలికలందరినీ సొంత బిడ్డల్లా చూసుకుంటున్నామని, ఇప్పటి వరకూ తాము ఎవ్వరినీ వేధించలేదని శిశుసంక్షేమ శాఖ అధికారులు చెపుతున్నారు. రెస్క్యూ హోం, స్టేట్ హోంలో ఉండలేకే వారు ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. -
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. కాసేపట్లోనే మృతి
సీతంపేట (శ్రీకాకుళం): ఓ మహిళ ముగ్గురు ఆడ శిశివులకు జన్మనిచ్చింది. అయితే కాసేపట్లోనే ముగ్గురూ మృత్యువాత పడ్డారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సీతం పేట మండలంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని కారెం గ్రామానికి చెందిన సరోజిని ఇంట్లోనే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. తర్వాత కూడా నొప్పులు రావడంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ మరో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన కాసేపట్లోనే ముగ్గురు శిశువులు మృతి చెందారు. తల్లి ఆరోగ్యం కూడా విషమంగా ఉండటంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
వాట్ యాన్ ఐడియా గురూ !
-
తాగునీటికి వెళ్లి.. ముగ్గురి జలసమాధి
బీజాపుర జిల్లాలో ఘోరం.. బీమా నదిలో ఇసుక కోసం గోతిలో పడి దుర్మరణం ఆగ్రహించిన గ్రామస్తులు ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ఆందోళన స్వల్పంగా లాఠీచార్జ చేసిన పోలీసులు మరింత ఆగ్రహించిన గ్రామస్తులు పోలీస్ జీపు దగ్ధం మాఫియా వెనక ఇండీ ఎమ్మెల్యే? సాక్షి, బెంగళూరు : నదిలో ఇసుక కోసం తవ్విన గుంతలో ముగ్గురు బాలికలు పడి మరణించిన సంఘటన బీజాపుర జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇండీ తాలూకా, గుబ్బేవాడ గ్రామంలో నీటి ఎద్దడి నెలకుంది. దీంతో ఆ గ్రామస్తులు కిలోమీటర్ దూరంలో ఉన్న బీమా నది నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున తాగునీటి కోసం భాగ్యశ్రీ సిద్రామధుళి (14), మహానంద అప్పాశ అతనూరు (14), భాగ్యశ్రీ బసవరాజు (12) మరో ముగ్గురు బాలికలు ఆ నదికి వెళ్లారు. నదిలో ఇసుక కోసం తీసిన గోతిలో మొదట ఓ బాలిక పడింది. ఆ బాలికను రక్షించడానికి మరో బాలిక.. ఇలా ఆరుగురూ అందులో పడ్డారు. వారి కేకలు ఉన్న ఓ వ్యక్తి అతికష్టంపై అందులో ముగ్గురిని రక్షించాడు. ఈ ముగ్గురూ మరణించారు. దీంతో ఆ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక సేకరణకు వచ్చిన వాహనాలు, సిబ్బందిపై రాళ్లు రువ్వారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపు చేయడానికి లాఠీచార్జ చేయాల్సి వచ్చింది. దీంతో మరింతగా రెచ్చిపోయిన స్థానికులు.. ఓ జీపుకు నిప్పంటిచారు. తర్వాత అదనపు బల గాలు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిం ది. ఇండీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇసుక మాఫియానే కారణం.. గుబ్బేవాడ గ్రామస్తులు మీడియాతో.. ‘ఇక్కడ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. దీంతో మా గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకుంది. భారీ యంత్రాలతో ఇసుక తీస్తుండటంతో సుమారు 15 అడుగుల మేర గోతులు ఏర్పడుతున్నాయి. ఈ ఇసుక మాఫియా వెనుక ఇండీ ఎమ్మెల్యే యశవంతరాయపాటిల్ హస్తం ఉంది.’ అని విమర్శించారు. అనుమతితోనే ఇసుక సేకరణ : ఎమ్మెల్యే ఇండీ ఎమ్మెల్యే యశవంతరాయపాటిల్ మాట్లాడుతూ.. ‘ నేను అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర పరిధిలోకి వస్తుంది. అక్కడి ప్రభుత్వం అనుమతితోనే ఇసుక సేకరణ జరుగుతోంది. నష్ట పరిహారం చెల్లించే విషయం కూడా అధికారులతో చర్చించి చెబుతా.’ అని వివరణ ఇచ్చారు. కాగా, పరిహారం చెల్లించేందుకు మహారాష్ర్ట ప్రభుత్వం నిరాకరించినట్లు సమాచారం. -
ఖమ్మం జిల్లాలో ముగ్గురు బాలికల అదృశ్యం
ఖమ్మం: ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో బాలికల తల్లిదండ్రులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కనిపించకుండాపోయిన బాలికలను తిరుపతమ్మ (7), మేరిస్టార్ (9), మేరియా (11)గా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
ఇంట్లో మందలిస్తున్నారని.. విమానంలో పారిపోవాలనుకున్నారు!
శంషాబాద్, న్యూస్‌లైన్: చదువు గురించి ఇంట్లో తరచూ మందలిస్తుండటంతో మనస్తాపం చెందిన ముగ్గురు బాలికలు విమానంలో గోవా పారిపోవాలనుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చిక్కడపల్లి గాంధీనగర్ ప్రాంతంలో నివసిస్తున్న వేర్వేరు కుటుంబాలకు చెందిన సోను(13), ప్రీతి(14), కీర్తన (14) స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 8, 9 తరగతులు చదువుతున్నారు. సరిగ్గా చదవడం లేదంటూ తల్లిదండ్రులు మందలిస్తుండడంతో వీరు ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పని ఉందని ఇళ్లలో చెప్పిన వీరు ముగ్గురూ నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాత్రి పది గంటలప్పుడు టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి గోవా వెళ్లడానికి టికెట్లు ఇవ్వాలని అడిగారు. బాలికల తీరు అనుమానాస్పదంగా ఉండటంతో ఎయిర్‌లైన్స్ సిబ్బంది వారిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. బాలికలను ప్రశ్నించిన ఆర్జీఐఏ పోలీసులు.. వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డుల ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. దీంతో అర్ధరాత్రి సమయానికి విమానాశ్రయానికి చేరుకున్న తల్లిదండ్రులకు బాలికలను అప్పగించడంతో వారు క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు.