తాగునీటికి వెళ్లి.. ముగ్గురి జలసమాధి | Go drinking .. three jalasamadhi | Sakshi
Sakshi News home page

తాగునీటికి వెళ్లి.. ముగ్గురి జలసమాధి

Published Sat, Jul 5 2014 3:48 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

Go drinking .. three jalasamadhi

  • బీజాపుర జిల్లాలో ఘోరం..
  •  బీమా నదిలో ఇసుక కోసం గోతిలో పడి దుర్మరణం
  •  ఆగ్రహించిన గ్రామస్తులు
  •  ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ఆందోళన
  •  స్వల్పంగా లాఠీచార్‌‌జ చేసిన పోలీసులు
  •  మరింత ఆగ్రహించిన గ్రామస్తులు
  •  పోలీస్ జీపు దగ్ధం
  •  మాఫియా వెనక ఇండీ ఎమ్మెల్యే?
  • సాక్షి, బెంగళూరు :  నదిలో ఇసుక కోసం తవ్విన గుంతలో ముగ్గురు బాలికలు పడి మరణించిన సంఘటన బీజాపుర జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  ఇండీ తాలూకా, గుబ్బేవాడ గ్రామంలో నీటి ఎద్దడి నెలకుంది. దీంతో ఆ గ్రామస్తులు కిలోమీటర్ దూరంలో ఉన్న బీమా నది నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు.

    ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున తాగునీటి కోసం భాగ్యశ్రీ సిద్రామధుళి (14), మహానంద అప్పాశ అతనూరు (14), భాగ్యశ్రీ బసవరాజు (12) మరో ముగ్గురు బాలికలు ఆ నదికి వెళ్లారు. నదిలో ఇసుక కోసం తీసిన గోతిలో మొదట ఓ బాలిక పడింది. ఆ బాలికను రక్షించడానికి మరో బాలిక.. ఇలా ఆరుగురూ అందులో పడ్డారు. వారి కేకలు ఉన్న ఓ వ్యక్తి అతికష్టంపై అందులో ముగ్గురిని రక్షించాడు. ఈ ముగ్గురూ మరణించారు.

    దీంతో ఆ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక సేకరణకు వచ్చిన వాహనాలు, సిబ్బందిపై రాళ్లు రువ్వారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపు చేయడానికి లాఠీచార్‌‌జ చేయాల్సి వచ్చింది. దీంతో మరింతగా రెచ్చిపోయిన స్థానికులు.. ఓ జీపుకు నిప్పంటిచారు. తర్వాత అదనపు బల గాలు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిం ది. ఇండీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
     
    ఇసుక మాఫియానే కారణం..

     
    గుబ్బేవాడ గ్రామస్తులు మీడియాతో.. ‘ఇక్కడ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. దీంతో మా గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకుంది. భారీ యంత్రాలతో ఇసుక తీస్తుండటంతో సుమారు 15 అడుగుల మేర గోతులు ఏర్పడుతున్నాయి. ఈ ఇసుక మాఫియా వెనుక ఇండీ ఎమ్మెల్యే యశవంతరాయపాటిల్ హస్తం ఉంది.’ అని విమర్శించారు.
     
    అనుమతితోనే ఇసుక సేకరణ : ఎమ్మెల్యే


    ఇండీ ఎమ్మెల్యే యశవంతరాయపాటిల్ మాట్లాడుతూ.. ‘ నేను అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర పరిధిలోకి వస్తుంది. అక్కడి ప్రభుత్వం అనుమతితోనే ఇసుక సేకరణ జరుగుతోంది. నష్ట పరిహారం చెల్లించే విషయం కూడా అధికారులతో చర్చించి చెబుతా.’ అని వివరణ ఇచ్చారు. కాగా, పరిహారం చెల్లించేందుకు మహారాష్ర్ట ప్రభుత్వం నిరాకరించినట్లు సమాచారం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement