టెక్కీ చేతిలో ప్రియురాలి హతం
గతంలో ప్రేమించుకుని, వేర్వేరుగా పెళ్లిళ్లు
కృష్ణరాజపురం: బెంగళూరులో ప్రేమ వ్యవహారాలు ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల పెళ్లయిన యువతి, అవివాహిత యువకుడు ప్రేమ ఫలించలేదని ఆత్మహత్యలు చేసుకోవడం తెలిసిందే.
ప్రేయసిని ఓ ప్రియుడు చంపిన ఘటన కుందలహళ్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటన పూర్వాపరాలు.. ఉజ్మాఖాన్, ఇమ్దాద్ బాషా, ఇద్దరూ టెక్కీలుగా పనిచేసేవారు. పరస్పరం ప్రేమలో ఉన్నారు. అయితే వారి ప్రేమను వారి కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో ఇద్దరూ వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ ఇటీవల ఇద్దరూ విడాకులు తీసుకుని మళ్లీ తమ పాత ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించారు. గత నెల 30న కుందలహళ్లిలో కలుసుకున్నారు. ఆ సమయంలో ఏదో విషయానికి వాగ్వాదం జరగడంతో ప్రియుడు ఇమ్దాద్ బాషా ఆమెను గొంతు పిసికి చంపేశాడు. చాలా గంటలపాటు అక్కడే ఒంటరిగా గడిపాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు తామిద్దరం విషం తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాట్సాప్ మెసేజ్ చేశాడు.
పోస్టుమార్టంలో ఇలా
బంధువులు చేరుకుని చూడగా ఉజ్మాఖాన్ మరణించి ఉంది, అతడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. మృతదేహానికి జరిపిన పోస్టుమార్టం నివేదికలో ఇమ్దాద్ బాషా మెసేజ్ చేయడానికి 10 గంటల ముందే ఆమె మరణించినట్లు వెలుగులోకి వచ్చింది. ఇమ్దాద్ బాషాను అదుపులోకి తీసుకున్న హెచ్‌ఏఎల్ పోలీసుల విచారణలో మరొక టెక్కీ యువకునితో ఉజ్మాఖాన్ చనువుగా ఉంటోందని, అతనిని పెళ్లి చేసు కుంటానని చెప్పడం వల్లనే తాను ఆమెను చంపేసినట్లు ఒప్పకున్నాడు. అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment