సీతంపేట (శ్రీకాకుళం): ఓ మహిళ ముగ్గురు ఆడ శిశివులకు జన్మనిచ్చింది. అయితే కాసేపట్లోనే ముగ్గురూ మృత్యువాత పడ్డారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సీతం పేట మండలంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని కారెం గ్రామానికి చెందిన సరోజిని ఇంట్లోనే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. తర్వాత కూడా నొప్పులు రావడంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ మరో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన కాసేపట్లోనే ముగ్గురు శిశువులు మృతి చెందారు. తల్లి ఆరోగ్యం కూడా విషమంగా ఉండటంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.