Sarojini
-
వెండితెర సరోజిని
స్వాతంత్య్ర సమరయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన సరోజినీ నాయుడు బయోపిక్ తెరకెక్కనుంది. ఈ బయోపిక్కు ‘సరోజిని’ అనే టైటిల్ ఖరారు చేశారు. హిందీలో ‘రామాయణ్’ (1987) టీవీ సీరియల్లో సీతగా నటించి, ఇప్పుడు బాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తోన్న దీపికా చిఖలియా టైటిల్ రోల్ చేయనున్నారు. ఆకాష్ నాయక్, ధీరజ్ మిశ్రా ద్వయం ఈ బయోపిక్కు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని రాయల్ ఫిల్మ్ మీడియా సమర్పణలో కాను భాయ్ పటేల్ నిర్మించనున్నారు. గురువారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు దీపిక. ‘‘సరోజినీ నాయుడుగా మీ లుక్ బాగుంది’’ అంటూ దీపికను చాలామంది అభినందించారు. లాక్డౌన్ పూర్తయ్యాక ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. -
ఓ తల్లి వేదన
-
పొత్తిళ్ల ఉయ్యాల
దీపంతో దీపాలను వెలిగిస్తాం. ఆరిపోయిన దీపంతో ఇప్పటికి ఎనిమిది వందల దీపాలను వెలిగించారు సరోజినీ! తన పొత్తిళ్లను ఇంటి ముందు ఊయలలా కట్టి, సమాజం వద్దనుకున్న ఆడబిడ్డల్ని చేరదీసి, ముద్దుచేసి, విద్యాబుద్ధుల్ని నేర్పించి, ప్రయోజకులను చేసి.. మరణించిన తన చిన్నారిని వారందరి ఎదుగుదలలో చూసుకుని మురిసిపోతున్నారు. ఆ ఇంటి బయట ఒక ఊయల కట్టి ఉంటుంది. వచ్చిపోయేవాళ్లు ఆ ఊయలను వింతగా చూస్తుంటారు. ఆడపిల్ల పుడితే వద్దనుకునే వివక్షాపూరిత సమాజం నుంచి అమ్మాయిలు ఆ ఊయలకు చేరుతుంటారు. అలాంటి వారికి తల్లి ప్రేమను, కుటుంబ ఆప్యాయతల్ని, సంరక్షణను 30 ఏళ్లకు పైగా అందిస్తున్నారు డా.సరోజినీ అగర్వాల్. 80 ఏళ్ల వయసున్న సరోజినీ లక్నోలోని గోమతి నగర్లో ‘మనీష మందిర్’ పేరుతో తన ఇంటినే ఆశ్రమంగా చేసుకొని నడుపుతున్నారు. ఇప్పటి వరకు 800 మంది ఆడపిల్లలను పెంచి, పెద్ద చేసి, వారికో మంచి భవిష్యత్తును ఇచ్చిన తల్లి ఆమె. ఈ వృద్ధాప్యంలోనూ ఆడపిల్లల పెంపకం గురించి, వారి బాగోగుల గురించి నిత్యం తపిస్తూనే ఉన్నారు. ఈ తపనకు, కృషికి గుర్తింపుగా ఆమె ఎన్నో రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డులను అందుకున్నారు. కంటి వెలుగు హారతి! హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేసిన సరోజిని కవితలు, కథలు, నవలలు రాస్తుంటారు. నలభై ఏళ్ల క్రితం వరకు.. భర్త, ముగ్గురు కొడుకులు, కూతురుతో ఆమె జీవితం ఆనందంగా సాగేది. ఒకనాడు మార్కెట్‌కి టూ వీలర్ మీద ఎనిమిదేళ్ల కూతురు మనీషని కూర్చోబెట్టుకొని ప్రయాణిస్తున్నారు సరోజిని. అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సరోజినికి గాయాలు కాగా, చిన్నారి మనీష మరణించింది. కూతురు లేదన్న బాధ నుంచి ఆమె త్వరగా కోలుకోలేకపోయారు. కూతురు తన నుంచి ఎందుకు వెళ్లిపోయిందన్న దుఃఖం నుంచి ఆమె తన జీవితానికి ఓ కొత్త అర్థాన్ని వెతుక్కున్నారు. ‘‘కూతురిని పెంచి, పెళ్లి చేసి ఆమె ఆనందంగా ఉండటం కళ్లారా చూడాలనుకున్నాను. కానీ, దేవుడి నిర్ణయం వేరేగా ఉంది. అందుకే నా అన్నవారు లేని అమ్మాయిల్లో నా మనీషను చూసుకోవాలనుకుంటున్నాను’’ అని చెప్పారు ఒకనాడు భర్తతో. ఇదే విషయాన్ని తన ముగ్గురు కుమారులతోనూ మాట్లాడారు. వారూ తల్లి ఆలోచనకు, ఆవేదనకు మద్దతుగా నిలిచారు. దీంతో తమ ఇంటికే ‘మనీష మందిర్’గా నామకరణం చేశారు సరోజినీ. ఇంటి ముందు ఊయలను ఏర్పాటు చేశారు. ఆడశిశువును వద్దనుకున్నవారు ఎవరికీ కనిపించకుండా ఆ ఊయలలో ఉంచి వెళతారు. ఆ బిడ్డను కన్నబిడ్డలా ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుంటారు సరోజినీ. ఇంటి పేరు భారతి! మొదట తల్లీతండ్రీ మరణించి ఎవరూ లేని ముగ్గురు అమ్మాయిల సంరక్షణ తీసుకున్నారు డా.సరోజిని. ‘‘ఆ అమ్మాయిల్లో నా మనీష కనిపించింది. ఆ తర్వాత ఎక్కడ ఆడపిల్లలు నిరాదరణకు గురవుతున్నట్లు తెలిసినా నా మనీష గుర్తుకు వచ్చి మనసు తల్లడిల్లిపోయేది. వెంటనే వెళ్లి తెచ్చుకునేవాళ్లం. అలా రోజు రోజుకు మా మందిర్‌లో అమ్మాయిల సంఖ్య పెరుగుతూ వచ్చింది. నా భర్త, పిల్లల సంపాదన, నా పుస్తకాల మీద వచ్చిన డబ్బుతో హోమ్ నడుపుతూ వచ్చాను. తర్వాత దాతల సాయమూ తోడైంది. ఇక్కడ అమ్మాయిలందరి ఇంటి పేరు ‘భారతి’ అనే ఉంటుంది. ఇలా చేరిన వారందరికీ సంరక్షణ, చదువుతో పాటు స్వతంత్రంగా ఎదిగేందుకు కావాల్సిన అన్ని అర్హతలు వచ్చేలా శిక్షణ, ప్రోత్సాహం ఉంటుంది. ఇంతమంది నా కుమార్తెల్లో ఇప్పుడు చాలామంది బ్యాంకుల్లోనూ, స్కూళ్లలోనూ, ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు చేస్తున్నారు. స్వయం ఉపాధితో బతుకుతున్నారు. వివాహాలు చేసుకొని పిల్లాపాపలతో చల్లగా ఉన్నారు. బిడ్డల ఎదుగుదలే తల్లికి ఆత్మతృప్తి. నా జీవితపు తుది శ్వాస వరకు ఈ మనీషలందరినీ చూసుకునేటంత శక్తినివ్వమని ఆ దైవాన్ని ప్రార్థిస్తుంటాను. అమ్మాయిలు భారం కాదు. వారే ఈ సమాజపు పునాదులు. కుటుంబపు భవిష్యత్తుకు తల్లులు’’ అంటారు ఆమె. ‘‘బిడ్డల ఎదుగుదలే తల్లికి ఆత్మతృప్తి. నా జీవితపు తుది శ్వాస వరకు ఈ మనీషలందరినీ చూసుకునేటంత శక్తినివ్వమని ఆ దైవాన్ని ప్రార్థిస్తుంటాను. అమ్మాయిలు భారం కాదు. వారే ఈ సమాజపు పునాదులు. కుటుంబపు భవిష్యత్తుకు తల్లులు’’. – డాక్టర్ సరోజినీ అగర్వాల్ – ఎన్.ఆర్. చేరదీసి, పెంచి పెద్దచేసిన బాలికలతో సరోజిని -
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
అనంతగిరి: మండలంలో భీంపోలు పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన మద్దేల సరోజిని అలియాస్ చిన్ని(22) అనే యువతి ఆదివారం పురుగు మందు తాగి ఆత్మహత్యాకు పాల్పడింది. తన భర్తతో వివాహేతర సంబంధం ఉందనిఓ మహిళ వేధించడంతో భరించలేక సరోజిని మనస్తాపం చెంది పురుగు మందు తాగింది. ఆమెను కుటుంబ సభ్యులు శృంగవరపు కో ట కమ్యూనిటీహెల్త్సెంటర్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తాను ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలను సరోజిని సూ సైడ్ నోట్లో రాసినట్టు అనంతగిరి ఎస్ఐ పి.దామోదరనాయుడు తెలి పారు. గుమ్మకోటకు చెందిన పెరుమాళ్ళ మహేష్, అతని భార్య గీత,మహేష్ వదిన భవానీ వివాహేతర సంబంధం పేరుతో తనను వేధింపులకు గురి చేస్తున్నారని, బయటకు తెలిస్తే పరువు పోతుందని ఆత్మహత్య చేసుకున్నట్టు సరోజీని సూసైడ్ నోట్లో పేర్కొంది. మృతురాలి తల్లి దేముడమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.సోమవారం శృంగవరపుకోటసీహెచ్ిసీలోమృతదేహానికిపోస్టుమార్టంపరీక్షలు నిర్వహించారు. -
కన్నీటి ఆసుపత్రి
-
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. కాసేపట్లోనే మృతి
సీతంపేట (శ్రీకాకుళం): ఓ మహిళ ముగ్గురు ఆడ శిశివులకు జన్మనిచ్చింది. అయితే కాసేపట్లోనే ముగ్గురూ మృత్యువాత పడ్డారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సీతం పేట మండలంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని కారెం గ్రామానికి చెందిన సరోజిని ఇంట్లోనే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. తర్వాత కూడా నొప్పులు రావడంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ మరో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన కాసేపట్లోనే ముగ్గురు శిశువులు మృతి చెందారు. తల్లి ఆరోగ్యం కూడా విషమంగా ఉండటంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
ప్రచారహోరు
సాక్షి, చెన్నై:సేలం జిల్లా ఏర్కాడు ఉప ఎన్నికను అన్నాడీఎంకే, డీఎంకే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. డీఎంకే అభ్యర్థిగా మారన్, అన్నాడీఎంకే తరపున సరోజ పెరుమాల్ పోటీకి దిగారు. ఈ ఇద్దరూ నియోజకవర్గానికి కొత్త ముఖాలే. మారన్ స్థానికంగా ధనబలం, బంధుగణం మద్దతు కలిగిన యువ నాయకుడు. ఇక సరోజ దివంగత మాజీ ఎమ్మెల్యే పెరుమాల్ సతీమణి. రాజకీయ పరిజ్ఞానం ఉన్నా ప్రజల్లోకి ఆమె వెళ్లిన సందర్భాలు అరుదే. డీఎండీకే, పీఎంకే, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న మారన్ బంధుగణం రంగంలోకి దిగింది. ఒక్క అవకాశం అంటూ మారన్ ప్రచారంలో అమాయకపు ముఖంతో ఓటర్లను అభ్యర్థిస్తూ ఆకర్షిస్తున్నారు. పార్టీతో సంబంధం లేకుండా మారన్ గెలుపు కోసం ఆయన బంధుగణం శ్రమిస్తుండడం అన్నాడీఎంకేకు ముచ్చెమటలు పట్టిస్తోంది. తొలుత తమ గెలుపు నల్లేరు మీద నడకే అని భావించిన అన్నాడీఎంకే ప్రస్తు తం జంబో జట్టునే రంగంలోకి దించింది. ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం, విద్యుత్‌శాఖ మంత్రి నత్తం విశ్వనాథన్, కేబినెట్లోని సగానికిపైగా మంత్రులు ఏర్కాడులో తిష్ట వేశారు. సరోజ విజ యమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తన భర్త వదలి పెట్టి వెళ్లిన పనుల్ని పూర్తి చేయడం లక్ష్యంగా ఓ అవకాశం ఇవ్వాలని కన్నీటితో ఓటర్లను సరోజ అభ్యర్థిస్తుండడం గమనార్హం. అద్దె ఇళ్లకు గిరాకీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఏర్కాడులో అద్దె ఇళ్లకు గిరాకీ పెరిగింది. మంత్రులు, నేతల కోసం ఏర్కాడులోని హోటళ్లు, లాడ్జీలు, రిసార్ట్స్ ముందుగానే రిజర్వు అయ్యాయి. అయితే ఈ ఖర్చులన్నీ అభ్యర్థుల ఖాతాలో జమ చేయాడానికి ఎన్నికల యంత్రాంగం నిర్ణయించింది. దీంతో వాటి పక్కకు వెళ్లకుండా అద్దె ఇళ్లను, బంగళాలను బుక్ చేసుకునే పనిలో నాయకులు పడ్డారు. దీంతో వాలంపాడి, పోత్త నాయకం పాలెం, ఏత్తాపూర్, ఆత్తూరుల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగింది. నెలకు రెండు వేలూ అద్దె రాని ఇళ్లు ప్రస్తుతం రూ.20 వేల వరకు పలుకుతుండడం గమనార్హం. మొత్తం మీద ఉప ఎన్నిక కారణంగా ఏర్కాడు నియోజకవర్గంలో సందడి వాతావరణం నెలకొంది.