సామ్రాజ్య భారతి: 1880/1947
ఘట్టాలు:
నైనిటాల్లో ఏకధాటిగా 68 గంటల వ్యవధిలో కుండపోతగా కురిసిన 36 సెంటీమీటర్ల వర్షపాతం 151 మందిని బలిగొంది. కొండ చరియలు విరిగి పడటంతో వారంతా శిథిలాల కింద చిక్కుకుని మరణించారు.
జననాలు:
రాజశేఖర్ బసు : రచయిత, కెమిస్ట్, నిఘంటు నిపుణులు (బెంగాల్); మున్షీ ప్రేమ్చంద్ : స్వాతంత్య్ర ఉద్యమకారుడు; హిందూ, ఉర్దూ భాషల్లో రచయిత (బెనారస్); అబ్దుల్ ముహసిన్ ముహమ్మద్ సజ్జద్ : పండితులు, స్వాతంత్య్ర సమర యోధులు, ‘ముస్లిం ఇండిపెండెంట్ పార్టీ’ వ్యవస్థాపకులు (బిహార్ ప్రావిన్స్); బరీంద్రకుమార్ ఘోష్ : స్వాతంత్య్ర సమర తిరుగుబాటు వీరుడు, జర్నలిస్ట్ (కలకత్తా); బళ్లారి రాఘవ : తెలుగు నాటక రంగ ప్రముఖులు, ప్రసిద్ధ న్యాయవాది (అనంతపురం జిల్లా); సుఖ్లాల్ సంఘ్వీ : జైన్ పండితులు, తత్వవేత్త (గుజరాత్); అమరేంద్ర చటర్జీ : స్వాతంత్య్రోద్యమ కార్యకర్త (పశ్చిమ బెంగాల్).
చట్టాలు:
రెలిజియస్ సొసైటీస్ యాక్ట్, కాజీస్ యాక్ట్, ఈస్టిండియా లోన్ (ఈస్టిండియన్ రైల్వే డిబెంచర్స్) యాక్ట్, ఇండియా స్టాక్ (పవర్స్ ఆఫ్ అటార్నీ) యాక్ట్.
(చదవండి: సామ్రాజ్య భారతి 1879/1947)