
సాక్షి, హైదరాబాద్: వినియోగదారుల కమిషన్‌లో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదుల అప్పీల్స్, రివిజన్ పిటిషన్‌లపై జాతీయ వినియోగదారుల వివాదాల, రిడ్రెసల్ కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) సర్క్యూట్ బెంచ్ సోమవారం నుంచి హైదరాబాద్‌లో విచారణ ప్రారంభించనుందని పౌరసరఫరాల కమిషనర్ అకున్ సభర్వాల్ ఆదివారం తెలి పారు. ఈ కేసుల విచారణ కోసం హైదరాబాద్ వచ్చిన జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్.కె.అగర్వాల్‌ను ఆదివారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా వినియోగదారుల ఫోరంల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఆదర్శనగర్‌లోని తెలంగాణ పుడ్ కమిషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సర్క్యూట్ బెంచ్‌లో తెలంగాణ, ఏపీకి చెందిన పెండింగ్ కేసుల విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment