ఎక్సైజ్ సిబ్బందిని అభినందిస్తున్న అకున్‌సబర్వాల్
కాజీపేట అర్బన్: మేడారం జాతరలో ఉమ్మడి వరంగల్ ఎక్సైజ్ సిబ్బంది సేవలు అభినందనీయమని రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అన్నారు. మేడారం జాతరలో పాల్గొన్న ఎక్సైజ్ సిబ్బందికి హైదరాబాద్‌లోని ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కార్యాలయంలో శనివారం అభినందన సభను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అకూన్‌సబర్వాల్ హాజరై మాట్లాడారు. మేడారం జాతరలో కోటీ 20లక్షల మంది భక్తులు పాల్గొనగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎక్సైజ్ సిబ్బంది చర్యలు చేపట్టడం అభినందనీయం అన్నారు.
గత మేడారం జాతరలో ఎక్సైజ్‌శాఖకు రూ. 2.47 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది 3. 76 కోట్లు లభించిందని అన్నా రు. విశిష్ట సేవలందించిన ఉమ్మడి వరంగల్ ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్లు కరంచంద్, టీ.శ్రీనివాస్, ఎంటీఆర్.చంద్రశేఖర్, శ్రీనివాస్, నర్సింహారెడ్డి, ఎస్సైలు కే.ఎస్.సత్యనారాయణ, సీ.సుబ్బరాజు, మాన్‌సింగ్, భాస్కర్‌రెడ్డి, రాంమోహన్‌రావులతో పాటు ఎనిమిది మంది కానిస్టేబుళ్లను అభినందించి ప్రశాంసా పత్రం, మెమోంటోలను అందజేశారు. కార్యక్రమంలో డీసీ సురేష్ రాథోడ్, వరంగల్ రూరల్ జిల్లా ఎక్సైజ్‌సూపరింటెండెంట్ శ్రీనివాస్, భూపాలపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment