అతిక్రమణకు తప్పదు భారీ మూల్యం | Stop over pricing in theatres: Akun Sabharwal | Sakshi
Sakshi News home page

అతిక్రమణకు తప్పదు భారీ మూల్యం

Published Mon, Jul 30 2018 2:50 AM | Last Updated on Sat, Aug 11 2018 8:27 PM

Stop over pricing in theatres: Akun Sabharwal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆగస్టు 1 నుంచి సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌ థియేటర్లలో మంచినీటి బాటిళ్లు, శీతలపానీయాలు, ఇతర తినుబండారాలు ఎంఆర్‌పీ ప్రకార మే విక్రయాలు జరిపేలా తూనికలు కొలతల శాఖ దృష్టిపెట్టింది. ఎంఆర్‌పీ కంటే అదనంగా ఒక్క రూపాయి వసూలు చేసినా.. తూనికల కొలతల శాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా భారీ జరి మానాతో పాటు జైలు శిక్ష విధించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. విడిగా విక్రయించే తినుబండారాలు, పానీయాలకు సంబంధించి ధర, పరిమాణం వివరాలు స్టిక్కర్‌ రూపంలో కచ్చితంగా నమోదు చేసేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.  

ఫిర్యాదుల నేపథ్యంలో..
సినిమా హాళ్లు, మల్టీప్లెక్సుల్లో ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా కొంతకాలంగా ప్రేక్షకుల నుంచి తూనికల శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో అధిక ధరలకు అడ్డుకట్ట వేయడానికి తూనికలు కొలతల శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. నిర్ణీత ధరలకే విక్రయించాలని స్పష్టం చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని థియేటర్‌ యాజమాన్యాలకు అవగాహన కల్పించింది.
 
కొత్త నిబంధనలపై అకున్‌ సబర్వాల్‌ సమీక్ష
థియేటర్లలో అధిక ధరల విక్రయాల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, కొత్త నిబంధనల అమలుపై కంట్రోలర్‌ అకున్‌ సబర్వాల్‌ ఆదివారం గాంధీనగర్‌ లోని తూనికల కొలతల శాఖ కార్యాలయంలో అన్ని జిల్లాల అసిస్టెంట్‌ కంట్రోలర్‌లు, ఇన్‌స్పెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారుల కోసం ఉద్దేశించిన వ్యాపారం, సేవ, వినోదం ఏదైనా చట్టబద్ధంగా జరగాలన్నారు.

ఏ ఒక్క వినియోగదారుడికి నష్టం జరిగేలా థియేటర్ల యాజమాన్యాలు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విడిగా అమ్మే తినుబండారాలు, అందించే కం టైనర్లపై బరువు, పరిమాణం, తయారీ గడువు, తేదీలతో పాటు ఎంఆర్‌పీ స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్‌ ఉండాలన్నారు. ఇవన్నీ ప్రేక్షకులకు స్పష్టంగా కని పించేలా బోర్డుపై ప్రదర్శించాలని, ధర మారితే ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేయాలన్నారు.

ఒకే బ్రాండ్‌ తినుబండారాలు కాకుండా వినియోగదారుడి కి వివిధ బ్రాండులు అందుబాటులో ఉంచాలన్నారు. తూనికలు కొలతల శాఖ చట్టం ప్రకారం ప్యాకేజ్డ్‌ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి చిరునామా, వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు తదితర వివరాలు ఉండాలని తెలిపారు.


4, 5 తేదీల్లో తనిఖీలు..
కొత్త నిబంధనల అమలుపై ఆగస్టు 2, 3 తేదీ ల్లో గ్రేటర్‌ హైదరాబాద్, హెచ్‌ఎండీఏ పరిధిలోని థియేటర్లు, మల్టీప్లెక్సు ల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. అనంతరం 4, 5 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. ఒకే ధర విధానాన్ని అమలు చేయాలన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి కేసు నమోదు చేసి రూ.25 వేల ఫైన్, రెండోసారి రూ.50 వేల ఫైన్, మూడోసారి రూ.లక్ష జరిమానాతో పాటు 6 నెలల నుంచి ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. వినియోగదారుల ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 180042500333, వాట్సాప్‌ నంబర్‌ 7330774444ను విధిగా సినిమా హాళ్లలో ప్రదర్శించాలని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement