అధికారులతో అకున్ సబర్వాల్ వీడియో కాన్ఫరెన్స్
Published Mon, Jul 24 2017 1:22 PM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
హైదరాబాద్: తెలంగాణలోని అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో ఆ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానంగా జిల్లాల్లో డ్రగ్స్ విక్రయాలు, సరఫరా చేస్తున్న వారి గురించి చర్చించినట్లు సమాచారం. డ్రగ్స్ నియంత్రణకు మార్గాలు, డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరినామాలపై అవగాహన పెంపోందించేందుకు చేయాల్సిన కార్యక్రమాల గురించి సబర్వాల్ అధికారులతో చర్చించారు.
Advertisement
Advertisement