
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సెలబ్రిటీలు, ఇన్‌సెట్‌లో కెల్విన్ (పాత ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ జైలు నుంచి విడుదలయ్యారు. నాంపల్లి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆదివారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి బయటికొచ్చారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి తనపై వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలని కెల్విన్ అన్నారు. ఇకపై సాధారణ జీవితాన్నే కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు.
ఆరు నెలల కిందట వెలుగు చూసిన డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును విచారించింది. ఈవెంట్ మేనేజర్‌గానూ పనిచేసిన కెల్విన్‌కు అంతర్జాతీయ, గోవా డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని, టాలీవుడ్‌లోని పలువురు దర్శకులు, నటీనటులకు అతను మాదకద్రవ్యాలను సరఫరా చేశాడని నిర్ధారించాయి. ఈ క్రమంలో ఆయా దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్లను సిట్ విచారించింది. కాగా, దర్యాప్తు దశలోనే ఈ కేసు నీరుగారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
(చదవండి : డ్రగ్స్ కేసు కథ కంచికేనా!)
Comments
Please login to add a commentAdd a comment