సంచలనం రేపిన డ్రగ్స్ మాఫియా కేసులో ఎక్సైజ్‌శాఖపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మపై రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలైంది. సినీ పరిశ్రమను టార్గెట్ చేసి వేధిస్తున్నారని, ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ బాహుబలిలా మీడియాకు కనిపిస్తున్నారని వర్మ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వర్మ వ్యాఖ్యలను తప్పుబడుతూ న్యాయవాది రంగప్రసాద్ రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులో ఎక్సైజ్‌శాఖ విచారణకు ఆటంకం కలిగించేలా వర్మ వ్యాఖ్యలు చేశారని, ఇలా వ్యాఖ్యలు చేయడం శిక్షార్హమేనని రంగప్రసాద్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.