284 మంది రేషన్‌ డీలర్లకు షోకాజ్‌ నోటీసులు | Ration dealers notices 284 members | Sakshi
Sakshi News home page

284 మంది రేషన్‌ డీలర్లకు షోకాజ్‌ నోటీసులు

Published Wed, May 3 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

Ration dealers notices 284 members

కాకినాడ సిటీ: 
జిల్లా వ్యాప్తంగా 284 మంది రేష¯ŒS డీలర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా  రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు షాపులను తెరిచి కార్డుదారులకు రేష¯ŒS సరుకులు పంపిణీ ప్రారంభించాల్సి ఉంది. మంగళవారం చాలామంది డీలర్లు ఉదయం 10 గంటలు దాటినా షాపులు తెరవలేదు. బయోమెట్రిక్‌ విధానం కారణంగా ఎవరెవరు షాపులు తెరిచి సరుకులు ఇస్తున్నారో ఆ¯ŒSలై¯ŒSలో తెలుస్తుంది. అసలే ఎండాకాలం కావడం... కార్డుదారులు ఇబ్బంది పడతారనే ఆలోచన లేకుండా డీలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని కలెక్టర్‌ తీవ్రంగా పరిగణించారు. కలెక్టర్‌ ఆదేశాలు మేరకు సబ్‌కలెక్టర్, ఆర్డీవోలు వారి డివిజన్ల పరిధిలోని షాపులు తెరవని డీలర్లకు షోకాజ్‌ నోటీసుల జారీకి చర్యలు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement