గుండ్ల పోచంపల్లిలో ఫ్లిప్కార్ట్ అతిపెద్ద స్టోర్ | Flipkart launches largest fulfillment centre in Telangana | Sakshi
Sakshi News home page

గుండ్ల పోచంపల్లిలో ఫ్లిప్కార్ట్ అతిపెద్ద స్టోర్

Published Fri, Oct 30 2015 5:01 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

గుండ్ల పోచంపల్లిలో ఫ్లిప్కార్ట్ అతిపెద్ద స్టోర్ - Sakshi

గుండ్ల పోచంపల్లిలో ఫ్లిప్కార్ట్ అతిపెద్ద స్టోర్

హైదరాబాద్: ఈ కామర్స్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తెలంగాణలో భారీ స్టోర్ను ప్రారంభించింది. మేడ్చల్ మండలంలోని గుండ్ల పోచంపల్లి గ్రామంలో ఫ్లిప్ కార్ట్ కార్యాలయం శుక్రవారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ బ్రాంచ్ ను ప్రారంభించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఫ్లిప్ కార్ట్ స్టోర్ ల సంఖ్య 17కు చేరాయి. మొత్తం 2.2లక్షల చదరపు అడుగుల వెడల్పులో 5.89లక్షల క్యూబిక్ అడుగుల సామర్థ్యంతో భారీ స్థాయిలో దీనిని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఫ్లిప్ కార్డ్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ మాట్లాడుతూ తెలంగాణ ఈ కామర్స్ ను విస్తరింపజేయడానికి అనువైన ప్రాంతమని, అందుకే తాము కొత్త బ్రాంచ్ను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించామని చెప్పారు. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం 17 వేలమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఇక ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశంలో ఈ కామర్స్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో తెలంగాణలో ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థ తన బ్రాంచీని స్థాపించడం సంతోషంగా ఉందని, ఈ సంస్థను చూసి మరిన్ని సంస్థలు తెలంగాణలో వ్యాపార సంస్థలు స్ధాపించేందుకు అనుకూలంగా ఉందని వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement