fulfillment centre
-
హైదరాబాద్‌లో ఈ వీలర్స్ మొబిలిటీ ఫుల్‌ఫిల్ సెంటర్
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాలకు దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఈవీలర్స్ మొబిలిటీ’ హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఫుల్ఫిల్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, వేగంగా డెలివరీ చేసేందుకు వీలుగా ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. కస్టమర్లకు ఇంటి వద్దకే ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేయాలన్న కంపెనీ లక్ష్యం దిశగా ఇది కీలక ముందడుగు అని పేర్కొంది. -
ఆ కంపెనీలో 30వేల కొలువులు..
లక్నో : రిటైల్ రంగంలో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే దిగ్గజాలు భారీ స్టోర్ల ఏర్పాటుకు పూనుకుంటున్నాయి. యూపీలో 15 స్టోర్లను ఏర్పాటు చేయడం ద్వారా స్ధానికులకు 30,000 ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువస్తామని వాల్‌మార్ట్ ఇండియా పేర్కొంది. యూపీలో వాల్‌మార్ట్ ఇప్పటికే నాలుగు క్యాష్ అండ్ క్యారీ స్టోర్లను నిర్వహిస్తుండగా, ఇటీవల లక్నోలో ఫుల్ఫిల్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లో 1500 మంది నైపుణ్యంతో కూడిన సిబ్బందికి ఉపాధి కల్పించింది. యూపీలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో భాగంగా రాష్ట్రంలో 15 హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ స్టోర్స్ ఏర్పాటుకు యూపీ సర్కార్‌తో ఒప్పందం చేసుకుంది. ప్రతిస్టోర్లో 2000 వరకూ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని,మొత్తం 30 వేల మంది స్ధానికులకు ఉపాధి కలుగుతుందని వాల్‌మార్ట్ ఇండియా ప్రతినిధి రజనీష్ కుమార్ చెప్పారు. కాగా, లక్నోలో ఆదివారం జరిగే శంకుస్ధాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యానాథ్ హాజరవనున్నారు. ఈ కార్యక్రమంలో వాల్‌మార్ట్ సహా పలు దిగ్గజ కంపెనీలు తమ యూనిట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నాయని యూపీ పరిశ్రమల మంత్రి సతీష్ మహన చెప్పారు. -
గుండ్ల పోచంపల్లిలో ఫ్లిప్‌కార్ట్ అతిపెద్ద స్టోర్
హైదరాబాద్: ఈ కామర్స్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తెలంగాణలో భారీ స్టోర్‌ను ప్రారంభించింది. మేడ్చల్ మండలంలోని గుండ్ల పోచంపల్లి గ్రామంలో ఫ్లిప్ కార్ట్ కార్యాలయం శుక్రవారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ బ్రాంచ్ ను ప్రారంభించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఫ్లిప్ కార్ట్ స్టోర్ ల సంఖ్య 17కు చేరాయి. మొత్తం 2.2లక్షల చదరపు అడుగుల వెడల్పులో 5.89లక్షల క్యూబిక్ అడుగుల సామర్థ్యంతో భారీ స్థాయిలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫ్లిప్ కార్డ్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ మాట్లాడుతూ తెలంగాణ ఈ కామర్స్ ను విస్తరింపజేయడానికి అనువైన ప్రాంతమని, అందుకే తాము కొత్త బ్రాంచ్‌ను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించామని చెప్పారు. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం 17 వేలమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఇక ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశంలో ఈ కామర్స్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో తెలంగాణలో ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థ తన బ్రాంచీని స్థాపించడం సంతోషంగా ఉందని, ఈ సంస్థను చూసి మరిన్ని సంస్థలు తెలంగాణలో వ్యాపార సంస్థలు స్ధాపించేందుకు అనుకూలంగా ఉందని వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.