
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాలకు దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెట్ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఈవీలర్స్ మొబిలిటీ’ హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, వేగంగా డెలివరీ చేసేందుకు వీలుగా ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. కస్టమర్లకు ఇంటి వద్దకే ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేయాలన్న కంపెనీ లక్ష్యం దిశగా ఇది కీలక ముందడుగు అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment