New Year Sale: Google Pixel 6a for just Rs 9,499 in Flipkart, Check Details - Sakshi
Sakshi News home page

న్యూ ఇయర్‌ ఆఫర్‌: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 తగ్గింపు.. త్వరపడాలి, అప్పటివరకే!

Published Fri, Dec 30 2022 3:44 PM

New Year Offer: You Can Buy Google Pixel 6a At Half Price In Flipkart Sale - Sakshi

కొత్త కొత్త టెక్నాలజీ, ఫీచర్లతో అప్‌డేట్‌ అవుతూ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలో ఫోన్‌ లవర్స్‌ తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేసేందుకు ప్లాన్‌ చేస్తుంటారు. అయితే కొందరు మంచి ఆఫర్ల కోసం వేచి చూస్తుంటారు. మీరు కనుక ఆ జాబితాలో ఉంటే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫాంలో ఇయర్ ఎండ్ సేల్ నడుస్తోంది. దీనిలో పలు ప్రాడెక్ట్స్‌పై భారీగా తగ్గింపులను అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఈ సేల్ డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. అంతేకాకుండా ఇందులో వినియోగదారులకు బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం అందులో స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే Google Pixel 6a పై భారీ ఆఫర్‌ను అందిస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం!

ఆఫర్‌ ఎంతంటే
Google ఈ ఫోన్ ఒకే కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 29,999 ధరకు అందుబాటులో ఉంది. కంపెనీ దీనిని రూ.43,999కి గ్రాండ్‌గా మార్కెట్లో ప్రారంభ ధరగా లాంచ్ చేసింది. దీని బట్టి చూస్తే ప్రస్తుతం రూ.14,000 డిస్కౌంట్‌తో గూగుల్ పిక్సెల్ 6ఏ లిస్ట్ అయింది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 3000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే, మీరు రూ. 17,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ఫోన్ చాక్, చార్‌కోల్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. అన్ని డిస్కౌంట్ల తర్వాత, మీరు ఈ ఫోన్‌ను సగం కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసే బంపర్‌ ఆఫర్‌ని ఫ్లిప్‌కార్ట్‌ న్యూ ఇయర్‌ సందర్భంగా మీకు అందిస్తోంది.

ఫీచర్లు ఇవే
గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే  6.14 ఇంచెస్‌తో పూర్తి HD + డిస్‌ప్లేను కలిగి ఉంది.  స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ ఉంది. ఇందులో 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 12 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ కెమెరాలతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. హ్యాండ్‌సెట్ గూగుల్ టెన్సర్ చిప్‌సెట్‌లో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. దీనికి 5G వరకు సపోర్ట్ కూడా ఉంది. పరికరం 4410mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు వంటి లక్షణాలను కలిగి ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement