Google Pixel smartphones
-
న్యూ ఇయర్ ఆఫర్: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 తగ్గింపు.. కేవలం 2 రోజులే!
కొత్త కొత్త టెక్నాలజీ, ఫీచర్లతో అప్డేట్ అవుతూ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలో ఫోన్ లవర్స్ తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే కొందరు మంచి ఆఫర్ల కోసం వేచి చూస్తుంటారు. మీరు కనుక ఆ జాబితాలో ఉంటే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫాంలో ఇయర్ ఎండ్ సేల్ నడుస్తోంది. దీనిలో పలు ప్రాడెక్ట్స్పై భారీగా తగ్గింపులను అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఈ సేల్ డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. అంతేకాకుండా ఇందులో వినియోగదారులకు బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం అందులో స్మార్ట్ఫోన్ల విషయానికొస్తే Google Pixel 6a పై భారీ ఆఫర్‌ను అందిస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం! ఆఫర్ ఎంతంటే Google ఈ ఫోన్ ఒకే కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 29,999 ధరకు అందుబాటులో ఉంది. కంపెనీ దీనిని రూ.43,999కి గ్రాండ్‌గా మార్కెట్లో ప్రారంభ ధరగా లాంచ్ చేసింది. దీని బట్టి చూస్తే ప్రస్తుతం రూ.14,000 డిస్కౌంట్‌తో గూగుల్ పిక్సెల్ 6ఏ లిస్ట్ అయింది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 3000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే, మీరు రూ. 17,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ఫోన్ చాక్, చార్కోల్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అన్ని డిస్కౌంట్ల తర్వాత, మీరు ఈ ఫోన్‌ను సగం కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసే బంపర్ ఆఫర్‌ని ఫ్లిప్‌కార్ట్ న్యూ ఇయర్ సందర్భంగా మీకు అందిస్తోంది. ఫీచర్లు ఇవే గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.14 ఇంచెస్‌తో పూర్తి HD + డిస్ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. ఇందులో 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. హ్యాండ్సెట్ గూగుల్ టెన్సర్ చిప్‌సెట్‌లో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. దీనికి 5G వరకు సపోర్ట్ కూడా ఉంది. పరికరం 4410mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు వంటి లక్షణాలను కలిగి ఉంది. -
గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7ప్రొ కమింగ్ సూన్
సాక్షి,ముంబై: టెక్ దిగ్గజం గూగుల్ పిక్సెల్ సిరీస్‌లో ప్రపంచవ్యాప్తంగా కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రొ తోపాటు పిక్సెల్ వాచ్‌ను కూడా తీసు కొస్తోంది. అక్టోబర్ 6న ‘మేడ్ బై గూగుల్’ పేరుతో నిర్వహించే గ్లోబల్ స్పెషల్ ఈవెంట్లో వీటిని లాంచ్ చేయనుంది. ఆన్లైన్ రిటైల్ భాగస్వామిని ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో అందుబాటులో ఉంటాయి. గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ భారతదేశంలో కూడా అందుబాటులో ఉంటుందని గూగుల్ ధృవీకరించింది. మీ వెయిటింగ్ ముగిసింది! పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రొ త్వరలో భారత్‌లోకి రానున్నాయి. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి అంటూ గూగుల్ ఇండియా ట్వీట్ చేసింది. స్నీక్‌పీక్ అంటూ ఒక వీడియోను షేర్ చేసింది. పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రొ ఫిచర్ల విషయానికి వస్తే...6.3 అంగుళాల డిస్ప్లే, టెన్సర్ G2 చిప్సెట్, 5,000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్, ట్రిపుల్ కెమెరా సెటప్ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయని అంచనా. పిక్సెల్ 7 అబ్సిడియన్ (నలుపు),వైట్, లెమన్‌గ్రాస్ (పసుపు) కలర్స్‌లో రానున్నాయి పిక్సెల్ 7 ప్రొ అబ్సిడియన్ బ్లాక్, వైట్, హాజెల్ (ఆకుపచ్చ) రంగులలో అందుబాటులో ఉంటుంది. Here's a sneak peak 👀 https://t.co/pt5Aoa2qsB pic.twitter.com/4hbcD0wufY — Google India (@GoogleIndia) September 21, 2022 -
2022లో లాంచ్ కానున్న పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!
Top Upcoming Smartphones Of 2022: కొత్త ఏడాది రాబోతుంది. 2022 సంవత్సరానికి గాను ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం కంపెనీలు భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లపై తమ కొత్త ఫోన్లతో దండయాత్ర చేయనున్నాయి. 2021లో చిప్స్ సమస్య, సప్లై చైయిన్‌లో ఆటంకాలు కల్గించినప్పటికీ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో దిగ్గజ కంపెనీలు కొంతమేర లాభాలను దక్కించుకున్నాయి. 2022గాను భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లను శాసించేందుకు ఆయా కంపెనీలు సిద్దమైనాయి. శాంసంగ్, యాపిల్, వన్‌ప్లస్, షావోమీ, గూగుల్, ఒప్పో కంపెనీలు 2022లో కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్ లాంచే చేసేందుకు రెడీ అయ్యాయి. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో తమ స్థానాలను పదిలంగా ఉంచేందుకు ఆయా కంపెనీలు ఊవిళ్లురుతున్నాయి. 2022లో రానున్న పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..! 1. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా శాంసంగ్ గెలాక్సీ ఎస్21 స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లలో భారీ ఆదరణ లభించింది. పవర్ఫుల్ కెమెరా సపోర్ట్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్21 నిలిచింది. దీనిని కంటిన్యూ చేస్తూ శాంసంగ్ మరిన్ని అద్బుతమైన ఫీచర్స్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రాను శాంసంగ్ లాంచ్ చేయనుంది. Galaxy S22, Galaxy S22 Plus మరియు Galaxy S22 అల్ట్రాకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 2. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ గెలాక్సీ సిరీస్‌లో భాగంగా శాంసంగ్ తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 38,990గా ఉండనుంది. IP68 రేటింగ్ వంటి లక్షణాలను శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ పొందనుంది. 5జీ మోడల్, క్వాలకం స్నాప్‌డ్రాగన్ 865 సపోర్ట్‌తో రానుంది. 3. ఐఫోన్ 14 మ్యాక్స్ కరోనా రాకతో ఐఫోన్13 స్మార్ట్ ఫోన్ల లాంచ్‌కు కాస్త బ్రేకులు పడింది. లేట్‌గా వచ్చిన లేటెస్ట్గా ఐఫోన్ 13 భారత మార్కెట్లలో భారీ ఆదరణను పొందింది. కాగా వచ్చే ఏడాది అనుకున్న సమయానికే ఐఫోన్ 14 స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసేందుకు యాపిల్ సన్నాహాలను చేస్తోంది. ఐఫోన్ 14 మ్యాక్స్‌కు అనుకూలంగా ఐఫోన్ 14 మినీని తొలగించవచ్చని తెలుస్తోంది. అంటే మినీ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ ఇకపై ఉండకపోవచ్చును. 4. వన్‌ప్లస్ 10 ప్రొ శాంసంగ్, యాపిల్ లాంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు వన్‌ప్లస్ దీటైన సమాధానం ఇచ్చింది. వచ్చే ఏడాది వన్‌ప్లస్ 10 స్మార్ట్ఫోన్లను కంపెనీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ 9 కంటే అదిరిపోయే ఫీచర్స్‌తో వన్‌ప్లస్ 10 స్మార్ట్ ఫోన్స్ రానున్నాయి. Qualcomm స్నాప్డ్రాగెన్ 8 Gen 1 ప్రాసెసర్ దీనిలో రానుంది. 5. షావోమీ 12 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ భారత్‌లో పాతుకుపోయింది. షావోమీ స్మార్ట్‌ఫోన్స్‌కు భారీ ఆదరణ లభించడంతో వివిధ రకాల మోడల్ స్మార్ట్ఫోన్లను షావోమీ లాంచ్ చేస్తోంది. షావోమీ 12 స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాదిలో తొలినాళ్లలో లేదా ఈ ఏడాది చివరన లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు 2022లోనే అందుబాటులో ఉండనుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో షావోమీ 12 రానుంది. 6. గూగుల్ పిక్సెల్ 6ఏ యాపిల్ స్మార్ట్‌ఫోన్స్ తరువాత గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్‌కు ఉండే క్రేజ్ వేరు. పవర్ఫుల్ సెక్యూరిటీతో, కెమెరా ఆప్షన్లతో గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్ భారత్‌లో తనదైన స్థానాన్ని కైవసం చేసుకుంది. గూగుల్ పిక్సెల్ 6, 6 ప్రొ ఇప్పటికే లాంచ్ ఐనప్పటికీ వచ్చే ఏడాది బడ్జెట్ ప్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్‌లో భాగంగా గూగుల్ పిక్సెల్ 6ఏ ఫోన్‌ను గూగుల్ లాంచ్ చేయనుంది. 7. ఒప్పో ఫైండ్ ఎన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లలోకి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో కూడా ప్రవేశించింది. ‘ఒప్పో ఫైండ్ ఎన్’ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్ 15న కంపెనీ లాంచ్ చేసింది. కాగా తొలుత చైనా మార్కెట్లలోనే ఈ ఫోన్ అందబాటులో ఉండనుంది. ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లలో ప్రఖ్యాతిగాంచిన శాంసంగ్ కంపెనీ స్మార్ట్ఫోన్లకు తక్కువ ధరలోనే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో తీసుకువచ్చింది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 92,000 నుంచి ప్రారంభమవుతుంది. ఒప్పో ఫైండ్ ఎన్ స్మార్ట్‌ఫోన్ 33 వాట్ సూపర్ఫ్లాష్ టెక్నాలజీతో పనిచేయనుంది. అయితే 33W SUPERVOOC ఫ్లాష్ ఛార్జ్ 30 నిమిషాల్లో 55 శాతానికి , 70 నిమిషాల్లో 100 శాతానికి బ్యాటరీ ఛార్జ్ అవ్వనుంది. చదవండి: వరల్డ్ ఫస్ట్ ఇన్నోవేటివ్ ఫీచర్స్ కేవలం ఈ స్మార్ట్‌ఫోన్‌లో...! -
Google Pixel 6 Series: అదిరిపోయే ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ లాంఛ్
All about The New Google Pixel 6 and Pixel 6 Pro Smart Phones: చాలాకాలంగా ప్రచారంలో వినిపిస్తున్న పిక్సెల్ 6 సిరీస్‌ను ఎట్టకేలకు గూగుల్ అధికారికంగా లాంఛ్ చేసింది. మంగళవారం రాత్రి జరిగిన గూగుల్ ఈవెంట్లో.. పిక్సెల్ సిరీస్‌లో భాగంగా పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో మోడల్స్ ఫీచర్స్‌ను రివీల్ చేసింది. పిక్సెల్ సిరీస్‌లో గూగుల్ ఈ ఫోన్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు కారణాలు.. సొంత టెన్సార్ చిప్సెట్లతో పాటు ఆండ్రాయిడ్12 వెర్షన్‌తో తీసుకురావడం. గూగుల్ పిక్సెల్ 6 ► 6.4 ఇంచుల ఎఫ్‌హెచ్‌డీ+అమోలెడ్ స్క్రీన్, 90 హెచ్‌జెడ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ ► పంచ్‌హోల్ కట్అవుట్, గొరిల్లా గ్లాస్ విక్టస్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ► టెన్సార్ చిప్సెట్తో 8జీబీ ర్యామ్ 128 జీబీ/256 జీబీ వేరియెంట్లలో లభ్యం.. యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ► 4,614ఎంఏహెచ్ బ్యాటరీ, 30డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ ► 50ఎంపీ మెయిన్ కెమెరా, వైడర్ షాట్స్ కోసం 12ఎంపీ ultrawide lens ► 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ► మ్యాజిక్ ఎరేస్ లాంటి సాఫ్ట్వేర్ ఫీచర్ కూడా గూగుల్ పిక్సెల్ 6 ప్రో ► 6.7 ఇంచుల క్యూహెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెచ్‌జెడ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ ► కట్అవుట్, గొరిల్లా గ్లాస్ విక్టస్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ► టెన్సార్ చిప్సెట్తో 12జీబీ ర్యామ్ 128 జీబీ/256 జీబీ/512జీబీ.. యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ► 5,003 ఎంఏహెచ్ బ్యాటరీ, 30డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ ► 50ఎంపీ మెయిన్ కెమెరా, వైడర్ షాట్స్ కోసం 12ఎంపీ ultrawide lens, 48ఎంపీ టెలిఫొటో లెన్స్ అదనం. ► 11.1 ఎంపీ సెల్ఫీ కెమెరా ► మ్యాజిక్ ఎరేస్ లాంటి సాఫ్ట్వేర్ ఫీచర్ కూడా We're launching Pixel 6 and Pixel 6 Pro today! They’re unlike any phone we've built before, with a new industrial design, Android 12 with Material You user interface, and running on our custom Google Tensor chip. Can't wait to see how people use them:)https://t.co/QPvVrCtxvB pic.twitter.com/2eFJsGmSOc — Sundar Pichai (@sundarpichai) October 19, 2021 చిప్‌మేకర్ క్వాల్కమ్ కంపెనీని కాదని.. సొంత టెన్సార్ చిప్‌తో గూగుల్ ఈ ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ రెండింటి టెన్సార్షిప్ కూడా టైటాన్ ఎం2 చిప్ ద్వారా భద్రత కల్పించనుంది. స్టీరియో స్పీకర్, మూడు మైక్రోఫోన్స్, డ్యుయల్ సిమ్ సపోర్ట్, వైఫై 6ఈ సపోర్ట్, బ్లూటూత్ 5.2, సబ్ 6సీహెచ్ 5జీ.. సపోర్ట్‌తో ఈ ఫోన్లు వచ్చాయి. ధరలు ఎంతంటే.. పిక్సెల్ 6 ప్రారంభ ధర 599 డాలర్లు(దాదాపు మన కరెన్సీలో రూ.44, 971), పిక్సెల్ ప్రొ ధర 899 డాలర్లు(దాదాపు 67,494 రూపాయలు). అయితే ఈ సిరీస్ ఫోన్లు భారత్‌లో ఎప్పుడు లాంఛ్ అవుతాయనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఫోన్లతో పాటు పిక్సెల్ పాస్ ప్రోగ్రామ్‌ను సైతం అనౌన్స్ చేసింది. దీని ప్రకారం.. నెల నెల కొంత చెల్లించి ప్రీమియం గూగుల్ వన్ స్టోర్ 200 జీబీ, యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం, గూగుల్ ప్లే పాస్ పొందొచ్చు. యూఎస్‌లో ఈ ప్లాన్ల ధరను పిక్సెల్ మోడల్స్‌కు 45 డాలర్లుగా, పిక్సెల్ ప్రోకు 55 డాలర్లుగా నిర్ణయించారు. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! -
గుడ్ న్యూస్: ఇకపై ఫొటోలు, వీడియోల 'లీకు'ల బెడద తప్పనుంది
ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న పర్సనల్ ఫొటోలు, వీడియోలు భద్రంగా ఉంటాయా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. సైబర్ నేరస్తులు మాల్ వేర్ సాయంతో ఫోన్లలో ఉన్న పర్సనల్ డేటాను లీక్ చేస్తున్నారు.డార్క్ వెబ్‌లో అసాంఘిక కార్యకలపాల కోసం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక ఈ బాధ మీకు తొలగనుంది. త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్ వినయోగదారులకు లీకుల బెడద తప్పనుంది. తొలుత 'గూగుల్ ఫిక్సెల్' వినియోగదారుల కోసం ఫొటో, వీడియో ఫోల్డర్‌కి లాక్ వేసే ఫీచర్ ఆప్షన్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది చివరి నాటికి మిగిలిన అన్నీ స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పెరుగుతున్న టెక్నాలజీతో పొంచి ఉన్న ప్రమాదం నుంచి గూగుల్ ఫిక్సెల్ ఫోన్ వినియోగదారుల్ని రక్షించేందుకు ఈ ఏడాది జూన్‌లో గూగుల్ లాక్ ఫీచర్‌ను విడుదల చేసింది. అయితే ఆ ఫీచర్‌ను మరింత అప్డేట్ చేసి త్వరలో విడుదల చేయనుందని టెక్ న్యూస్ వెబ్సైట్ 'ది వెర్జ్' ఓ కథనాన్ని ప్రచురించింది. ది వెర్జ్ రిపోర్ట్ ప్రకారం..గూగుల్ ఫిక్సెల్ ఫోన్ ఆండ్రాయిడ్ వెర్షన్ 6.0 యూజర్లు తమ ఫోన్లో ఉన్న ఫొటోలు, వీడియోలు సురక్షితంగా ఉండేందుకు లాక్ పెట్టుకోవచ్చు.గూగుల్ ఫోటోస్ నుంచి వచ్చే నోటిఫికేషన్ సాయంతో పాస్‌వర్డ్‌ను జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ లాక్ ఫీచర్‌ను వినియోగిస్తే ప్రమాదకరమైన థర్డ్ పార్టీ యాప్స్ ఫోన్లో ఉన్న ఫొటోల్ని, వీడియోల డేటాను సేకరించ లేవు. ఆ యాప్స్‌కు చిక్కకుండా ఈ లాక్ ఫీచర్ వాటిని హైడ్ చేస్తుంది. వీటితో పాటు గుర్తు తెలియని వ్యక్తులు రహస్యంగా ఫోన్లో ఉన్న ఫొటోల్ని బ్యాకప్ తీసుకోవడానికి లేదా షేర్ చేసే అవకాశం ఉండదు. తప్పనిసరిగా పాస్‌వర్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. గూగుల్ ఫొటోస్' నుంచి వచ్చే నోటిఫికేషన్‌తో ఫోల్డర్‌కి లాక్ చేయడం వల్ల సురక్షితంగా ఉండొచ్చని వెర్జ్ తన కథనంలో పేర్కొంది. చదవండి: గూగుల్ మ్యాప్స్: ఓ గుడ్ న్యూస్-ఓ బ్యాడ్ న్యూస్ -
గూగుల్ పిక్సెల్ 5ఏ 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల..
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మార్కెట్లలోకి గూగుల్ పిక్సెల్ 5ఏ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. కొత్తగా లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ గూగుల్ 4ఏ 5జీ మాదిరగానే ఉండనుంది. డిజైన్ మాత్రమే కాదు, చాలా స్పెసిఫికేషన్లు అలాగే ఉన్నాయి. పిక్సెల్ 5 ఎ స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్లకు మరింత చౌక ధరకు అందించేందుకు ఈ స్మార్ట్‌ఫోన్‌లో కొద్ది మార్పులను చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కాస్త పెద్ద డిస్ప్లేతో రానుంది, డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ తో ఈ ఫోన్‌ను మార్కెట్లలోకి రిలీజ్ చేసింది. పిక్సెల్ 4ఎ 5జీ మోడల్‌తో పోలిస్తే చాలా పెద్ద బ్యాటరీని ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చారు. పిక్సెల్ 5ఏ 5జీ స్మార్ట్‌ఫోన్ చార్జర్‌తో పాటురానుంది. కాగా పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లకు చార్జర్ రాదని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే కలర్ బ్లాక్ కలర్లో రానుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం యూఎస్ఏ, జపాన్ దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. త్వరలోనే భారత మార్కెట్లలోకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పిక్సెల్ 5ఏ 5జీ ధర సుమారు రూ. 33,400 ఉండనుంది. గూగుల్ పిక్సెల్ 5ఏ 5జీ ఫీచర్స్ ఆండ్రాయిడ్ 11 అపరేటింగ్ సిస్టమ్ 6.34-అంగుళాల ఫుల్-హెచ్డి+ (1,080x2,400 పిక్సెల్స్) ఓఎల్ఈడీ డిస్ప్లే విత్ 60 హెర్జ్ రిఫ్రెష్ రేట్ 20: 9 యాస్పెక్ట్ రేషియో, 413ppi పిక్సెల్ డెన్సిటీ+ హెచ్డీఆర్ సపోర్ట్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 765జీ ఎస్ఓసీ అడ్రినో 620 జీపీయూ 6జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ 12.2+ 16మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా 8మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 118.7 ఫీల్డ్ ఆఫ్ వ్యూ IP67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 4,680mAh బ్యాటరీ -
ఫ్లిప్‌కార్ట్ న్యూ పించ్ సేల్: స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరోసారి సేల్స్ ను ప్రకటించింది. ‘న్యూ పించ్ డేస్’ పేరుతో ఈ కొత్త సేల్‌ను లాంచ్ చేసింది . నేటి శుక్రవారం డిసెంబర్ 15) 17వ తేదీ వరకు ఈ విక్రయాలను నిర్వహించనుంది. క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను ఊరిస్తోంది. ముఖ్యంగా ఈ న్యూ పించ్ డేస్ సేల్‌లో రెడ్మీ నోట్ 4, ఐ ఫోన్ 8 , గూగుల్ పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్ఎల్, షియోమీ ఎంఐ ఎ1, మోటో ఎక్స్4, శాంసంగ్ ఫోన్లు, ఐఫోన్లు, మొబైల్ యాక్ససరీలపై ఆకర్షణీయమైన రాయితీలు, ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్నది. ఫ్లిప్‌కార్ట్ యాప్ లేదా సైట్ ఎందులో ఐటమ్స్‌ను కొన్నాఈ ఆఫర్లు లభిస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 రూ.29,990 (రూ.16,010 తగ్గింపు) ధరకు, గెలాక్సీ ఆన్‌నెక్ట్స్ పై రూ.11, 900కు లభిస్తోంది. గెలాక్సీ జే 3 ప్రొ, గెలాక్సీ ఆన్ 5పై డిస్కౌంట్ ఆఫర్. అలాగే గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ రూ.5,001 తగ్గింపుతో రూ.58,999 ధరకు లభిస్తుండగా, హెచ్‌టీసీ యూ11 రూ.44,999 (రూ.8,991 తగ్గింపు) ధరకు, పిక్సెల్ 2 రూ.39,999 (రూ.11,001 తగ్గింపు) ధరకు, యాపిల్ ఐఫోన్ 7 32జీబీ రూ.42,999 (రూ.6,001 తగ్గింపు) ధరకు, మోటో ఎక్స్4 (4జీబీ, 64జీబీ) రూ.20,999 (రూ.2వేల తగ్గింపు) ధరకు లభ్యం కానున్నాయి. షావోమీ ఎంఐ ఎ1 రూ.12,999 (రూ.2వేల తగ్గింపు) ధరకు, షావోమీ రెడ్మీ నోట్ 4 (4జీబీ, 64జీబీ) రూ.10,999 (రూ.2వేల తగ్గింపు) ధరకు , ఎంఐ మ్యాక్స్ 2 64జీబీ రూ.14,999 (రూ.2వేల తగ్గింపు) ధరకు, లభిస్తున్నాయి. ఇవే కాకుండా మరెన్నో ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభ్యం. వీటితోపాటు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ పీసీలు, యాక్ససరీలపై కూడా ఈ సేల్‌లో ఆఫర్లను అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. -
గూగుల్ ఫోన్ల గ్రాండ్ లాంచింగ్!
శాన్ఫ్రాన్సిస్కో : ఆండ్రాయిడ్ వెర్షన్లో తనదైన ముద్ర వేసుకున్న గూగుల్, స్మార్ట్ఫోన్ల మార్కెట్లోనూ తన క్రేజ్‌ను మరింత పెంచడానికి వచ్చేస్తోంది. సొంత బ్రాండుతో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు ముహుర్తం ఖరారు చేసుకుందట. అక్టోబర్ 4న గ్రాండ్ ఈవెంట్‌గా సొంత బ్రాండెడ్ ఫోన్లను ప్రపంచానికి పరిచయం చేయబోతుందని టెక్ విశ్లేషకులు టాక్. అక్టోబర్ 4న ఉదయం 9గంటలకు నిర్వహించబోయే ఈ ప్రత్యేక ఈవెంట్‌కు గూగుల్ ఆహ్వానాలు సైతం పంపించేసిందట. ఈ ఈవెంట్ టీజర్ వీడియోను గూగుల్, యూట్యూబ్‌లో కూడా పెట్టింది. అయితే కంపెనీ పిక్సెల్ ఫోన్ల విడుదలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే సొంత బ్రాండుతో స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి పెడతామన్న గూగుల్, ఈ ఈవెంట్లోనే వీటి లాంచింగ్ చేపడుతుందని అంచనాలు భారీగా పెరిగాయి. కొత్త ఫోన్లపై ప్రకటన మాత్రమే కాకుండా ఇతర గూగుల్ ఉత్పత్తుల గురించి వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది. దీంతో ఈ ఈవెంట్‌పై వినియోగదారుల్లో, టెక్ వర్గాల్లో ఫుల్ ఆసక్తి ఏర్పడింది. సెయిల్ ఫిష్, మార్జిన్ కోడ్ పేర్లతో రాబోతున్న ఈ ఫోన్లు 5, 5.5 అంగుళాల డిస్ప్లే ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ సాప్ట్‌వేర్‌లో ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన వెర్షన్ నోగట్తో ఈ ఫోన్లను లాంచ్ చేస్తుందని సమాచారం. నెక్షస్ పేరుతో ఇంతకాలం భాగస్వామ్య కంపెనీల సహకారంతో గూగుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి ప్రవేశించనప్పటికీ.. ఎక్కడా గూగుల్ బ్రాండు కనిపించదు. దీంతో నెక్షస్ బ్రాండుతో కాకుండా తనకంటూ ఓ సొంత బ్రాండు, పిక్సెల్ పేరు మీద గూగుల్ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టేందుకు అన్ని సెట్ చేసుకుంది. యాపిల్‌కు ధీటుగా హై ఎండ్ టెక్నాలజీతో తన ఫోన్లను గూగుల్ తీసుకొస్తోందని మార్కెట్ వర్గాల టాక్. దీంతో ఇన్ని రోజులు శాంసంగ్ నుంచి ఎదుర్కొన్న పోటీ ప్రస్తుతం యాపిల్‌కు, గూగుల్ నుంచి కూడా ఎదురుకాబోతుంది. కాగ ఇటీవలే టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ 7 మోడల్స్ రెండింటిని శాన్ఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహం సివిక్ వేదికగా గ్రాండ్‌గా ప్రవేశపెట్టింది.