సాక్షి,ముంబై: టెక్ దిగ్గజం గూగుల్ పిక్సెల్ సిరీస్‌లో ప్రపంచవ్యాప్తంగా కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రొ తోపాటు పిక్సెల్ వాచ్‌ను కూడా తీసు కొస్తోంది. అక్టోబర్ 6న ‘మేడ్ బై గూగుల్’ పేరుతో నిర్వహించే గ్లోబల్ స్పెషల్ ఈవెంట్‌లో వీటిని లాంచ్ చేయనుంది. ఆన్‌లైన్ రిటైల్ భాగస్వామిని ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో అందుబాటులో ఉంటాయి.
గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ భారతదేశంలో కూడా అందుబాటులో ఉంటుందని గూగుల్ ధృవీకరించింది. మీ వెయిటింగ్ ముగిసింది! పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రొ త్వరలో భారత్‌లోకి రానున్నాయి. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి అంటూ గూగుల్ ఇండియా ట్వీట్ చేసింది. స్నీక్‌పీక్ అంటూ ఒక వీడియోను షేర్ చేసింది.
పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రొ ఫిచర్ల విషయానికి వస్తే...6.3 అంగుళాల డిస్‌ప్లే, టెన్సర్ G2 చిప్‌సెట్, 5,000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్, ట్రిపుల్ కెమెరా సెటప్ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయని అంచనా. పిక్సెల్ 7 అబ్సిడియన్ (నలుపు),వైట్, లెమన్‌గ్రాస్ (పసుపు) కలర్స్‌లో రానున్నాయి పిక్సెల్ 7 ప్రొ అబ్సిడియన్ బ్లాక్, వైట్, హాజెల్ (ఆకుపచ్చ) రంగులలో అందుబాటులో ఉంటుంది.
Here's a sneak peak 👀 https://t.co/pt5Aoa2qsB pic.twitter.com/4hbcD0wufY
— Google India (@GoogleIndia) September 21, 2022
Comments
Please login to add a commentAdd a comment