సాక్షి,ముంబై: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లకు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో గూగుల్ తన యూజర్లకు తీపి కబురు అందించనుంది. త్వరలోనే గూగుల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోనును గూగుల్ తీసుకు రానుంది.
గూగుల్ తొలి ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌ను ‘పిక్స్‌ల్ ఫోల్డ్’ పేరుతో దీన్ని లాంచ్ చేయనుంది. దీనిపై గూగుల్ అధికారికంగా ప్రకటించక పోయినప్పటికి ఆన్‌లైన్‌లో తాజా లీకులు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ప్రీమియం విభాగంలో గూగుల్ ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొస్తోందని యూట్యూబ్, టిప్‌స్టర్ ఫ్రంట్ పేజ్ టెక్ జాన్ ప్రాస్సెర్ వెల్లడించారు. 2023, మే నెలలో దీన్ని గూగుల్ విడుదల చేయనుందని పిక్సల్ ఫోల్డ్ ఫోన్ బ్లాక్, సిల్వర్ రంగుల్లో రానుందని తెలపారు. అలాగే పిక్సెల్ 7 ప్రొ మాదిరిగానే ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు ఉంటాయని అంచనా. ఇంకా రియర్ ట్రిపుల్ కెమెరా,బెజెల్స్‌తో కవర్ స్క్రీన్, సెల్ఫీ కెమెరా సెన్సార్ కోసం హోల్డ్-పంచ్ పిల్-ఆకారపు కటౌట్‌తో రానుంది. దీని ధర రూ.1,799 డాలర్లు అంటే సుమారు రూ.1.45 లక్షలుగా ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment