సాక్షి,ముంబై: సెలబ్రిటీలు ఉపయోగించే స్మార్ట్‌ఫోన్లపై ఆసక్తి ఉంటుంది. అందులోనూ టెక్ నిపుణులు, స్వయంగా స్మార్ట్‌ఫోన్ మేకర్స్ తమ సొంత ఫోన్లనే వాడతారా లేక వేరే కంపెనీలవి వాడతారా అనేది ఆరా తీస్తాం. తాజాగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ దీనికి సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించారు.
గూగుల్ కంపెనీ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘పిక్సెల్ ఫోల్డ్’ను ఇటీవల లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. వార్షిక డెవలపర్ల సమావేశంలో పిక్సెల్ ఫోల్డ్ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సందర్ పిచాయ్ స్వయంగా పిక్సెల్‌ని ఉపయోగిస్తున్నారా? లేదా అనుమానం రాకమానదు. ఈ క్రమంలో అడిగిన ప్రశ్నకు సుందర్ పిచాయ్ తనదైన శైలిలో జవాబు చెప్పారు. గూగుల్ ఉత్పత్తులను వినియోగించే తొలి యూజర్లలో తానూ ఒకడినని వెల్లడించారు. గూగుల్ ఇటీవల విడుదల అయిన పిక్సల్ ఫోల్డ్ , పిక్సల్ 7ఏ ఫోన్లను (టెస్టింగ్) వినియోగిస్తున్నట్టు చెప్పారు. (Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ)
యూట్యూబర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, పిచాయ్ తాను పిక్సెల్ ఫోల్డ్‌ను చాలా కాలంగా పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు. అయితే గూగుల్ పిక్సల్ 7 ప్రోను తన ప్రైమరీ ఫోన్‌గా వినియోగిస్తున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. అలాగే శాంసంగ్ గెలాక్సీ నుంచి, కొత్త గూగుల్ పిక్సెల్ ఫోల్డ్, ఐఫోన్‌దాకా దాదాపు అన్ని ఫోన్లను టెస్టింగ్ కోసం వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. మల్టీటాస్కింక్, ఒకేసారి వివిధ యాప్‌లలో పని చేయడానికి పిక్సెల్ ఫోల్డ్ వాడడాన్ని ఇష్టపడతారట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వేర్వేరు సిమ్ కార్డులకు వేర్వేరు ఫోన్లను వినియోగిస్తానన్నారు. (Infosys: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం, షాక్‌లో ఉద్యోగులు!)
ఇక స్మార్ట్‌ఫోన్ల భవిష్యత్తుపై మాట్లాడిన సుందర్ పిచాయ్ ప్రజల అవసరాలకు అనుగుణంగా వారు మెచ్చే స్మార్ట్‌ఫ్లోన్లను అందించాలనుకుంటున్నామని, ఇందులో ఫోల్డబుల్ ఫోన్లు మాత్రమే తమ అంతిమ లక్ష్యం కాదని చెప్పుకొచ్చారు. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్)
సాంకేతికత ప్రారంభ దశలో ఉన్న ఈనాటిలా కాకుండా ఏఐ మరింత నేచురల్‌గా ఉండబోతోందన్నారు. రానున్న సంవత్సరాల్లో మరింత ఇంటరాక్టివ్‌గా, సహజమైన భాషలతో ఫోన్‌లు ప్రతిదీ అర్థం చేసుకునేలా ఉంటుందన్నారు. అలాగే ఇప్పటివరకు మానవులు ఏఐకి అనుగుణంగా ఉన్నారు.కానీ అయితే భవిష్యత్తులో ఏఐ అనేది మానవులకు అనుగుణంగా మారిపోయేలా కంప్యూటర్‌లను ఎనేబుల్ చేస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, సక్సెస్ స్టోరీలు, ఇతర అప్‌డేట్స్ కోసం చదవండి: సాక్షి,బిజినెస్
Comments
Please login to add a commentAdd a comment