ఏఐ ఫండ్‌కు గూగుల్‌ రూ.వెయ్యి కోట్లు! ఏం చేస్తారంటే.. | how google helps to people through global ai opportunity fund | Sakshi
Sakshi News home page

ఏఐ ఫండ్‌కు గూగుల్‌ రూ.వెయ్యి కోట్లు! ఏం చేస్తారంటే..

Published Mon, Sep 23 2024 1:14 PM | Last Updated on Mon, Sep 23 2024 4:07 PM

how google helps to people through global ai opportunity fund

యూఎస్‌లో జరిగిన ‘యూఎన్‌ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్‌’ కార్యక్రమంలో ‘గ్లోబల్ ఏఐ ఆపర్చునిటీ ఫండ్‌’ పేరుతో గూగుల్‌ సీఈఓ సుందర్‌పిచాయ్‌ 120 మిలియన్‌ డాలర్ల(రూ.వెయ్యి కోట్లు) నిధిని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కమ్యూనిటీల్లో ఏఐ ఎడ్యుకేషన్‌, ట్రెయినింగ్‌ కోసం దీన్ని ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

న్యూయార్క్‌లో జరిగిన 79వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు పాల్గొన్నారు. ‘యూఎన్‌ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో భాగంగా ‘గ్లోబల్ ఏఐ ఆపర్చునిటీ ఫండ్‌’ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆల్ఫాబెట్‌ ఇంక్‌, గూగుల్‌ సీఈఓ సుందర్‌పిచాయ్‌ ప్రకటించారు. గూగుల్‌ తరఫున ఈ ఫండ్‌లో భాగంగా 120 మిలియన్‌ డాలర్లు(రూ.వెయ్యి కోట్లు) సమకూరుస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కమ్యూనిటీల్లో ఏఐ ఎడ్యుకేషన్‌, ట్రెయినింగ్‌ కోసం దీన్ని ఖర్చు చేస్తామన్నారు. ఇందుకోసం లాభాపేక్షలేని సంస్థలు, ఎన్‌జీఓలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని తెలిపారు. ఈ ఏఐ ఎడ్యుకేషన్‌, శిక్షణను స్థానిక భాషల్లో అందిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పెరుగుతున్న ఈఎంఐ కల్చర్‌!

ఈ సందర్భంగా సుందర్‌ మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా 15 గూగుల్‌ ఉత్పత్తులు ఒక్కోటి 50 కోట్ల వినియోగదారుల చొప్పున సేవలందిస్తోంది. వాటిలో ప్రధానంగా గూగుల్‌ సెర్చింజన్‌, మ్యాప్స్, డ్రైవ్ ఉన్నాయి. కంపెనీ రెండు దశాబ్దాలుగా ఏఐ సెర్చ్‌, టెక్నాలజీ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెడుతోంది. ఏఐని ఉపయోగించి గతేడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి అందుబాటులో ఉండే 110 కొత్త భాషల్లోకి గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ను విస్తరించాం. దాంతో ప్రస్తుతం గూగుల్‌ సేవలందించే ఈ భాషల సంఖ్య 246కు చేరుకుంది. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 1,000 భాషల్లో గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నాం. ఏఐ ప్రపంచ శ్రామిక ఉత్పాదకతను 1.4 శాతం పాయింట్లకు పెంచుతుంది. రాబోయే దశాబ్దంలో ఏఐ ప్రపంచ జీడీపీ ఏడు శాతం పెరిగేలా తోడ్పడుతుంది. ఉదాహరణకు ప్రపంచంలో కనెక్టివిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రాఫిక్ రద్దీ పెద్ద సవాళ్లుగా మారుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లో కార్యకలాపాలు, లాజిస్టిక్‌లను మెరుగుపరచడంలో ఏఐ సాయం చేస్తోంది’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement