google ai
-
చాట్‌జీపీటీ కొత్త ఆప్షన్.. గూగుల్‌కు పోటీ ఇవ్వనుందా?
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ జనరేటివ్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దానికి పోటీగా చాలా కంపెనీలు తమ సొంత ఏఐలను తయారు చేసి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా ఓపెన్ఏఐ ‘చాట్‌జీపీటీ సెర్చ్’ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రత్యేకతేంటో తెలుసుకుందాం.గూగుల్‌లో ఏదైనా అంశం గురించి తెలుసుకోవాలంటే సెర్చ్‌లోకి వెళ్లి వెతుకుతారు. అదేమాదిరి ఇకపై చాట్‌జీపీటీలోనూ సెర్చ్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. గూగుల్ బ్రౌజర్లో ఎలాగైతే మనం సెర్చ్ చేసిన అంశాలకు సంబంధించి లేటెస్ట్ సమాచారం వస్తుందో అదేవిధంగా చాట్‌జీపీటీలోనూ డిస్ప్లే అవుతుంది. విభిన్న వెబ్సైట్లలోని సమాచారాన్ని క్రోడికరించి మనం వెతుకుతున్న అంశాలను ముందుంచుతుంది. అయితే ఈ ఆప్షన్ ఓపెన్ఏఐ వినియోగదారులందరికీ అందుబాటులో లేదు. చాట్‌జీపీటీ ప్లస్ కస్టమర్లు మాత్రమే దీన్ని వినియోగించేలా ఏర్పాటు చేశారు. కాగా, ఈ చాట్‌జీపీటీ ప్లస్ కోసం ప్రత్యేకంగా డబ్బు చెల్లించి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.కొత్తగా పరిచయం చేసిన చాట్‌జీపీటీ సెర్చ్ వల్ల స్పోర్ట్స్ స్కోర్, స్టాక్ మార్కెట్ షేర్ ధరలు, లేటెస్ట్ వివరాలు..వంటి రియల్‌టైమ్ సమాచారాన్ని తెలసుకోవచ్చు. దాంతోపాటు విభిన్న వెబ్‌సైట్‌ల్లోని ముఖ్యమైన సమాచారాన్ని క్రోడీకరించి సెర్చ్‌లో అడిగిన కమాండ్‌కు అనుగుణంగా డిస్ప్లే అవుతుంది. ఈ సేవలు పొందేందుకు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఎంటర్ప్రైజ్, ఎడ్యుకేషన్ యూజర్లకు కొన్ని వారాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. రానున్న కొన్ని నెలల్లో అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతామని పేర్కొంది.ఇదీ చదవండి: అలెక్సా చెబితే టపాసు వింటోంది!జనరేటివ్ ఏఐ సాయంతో లార్జ్ ల్యాంగ్వేజీ మోడళ్లను వినియోగించి ఓపెన్ఏఐ చాట్‌జీపీటీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే ప్రముఖ కంపెనీలు తమ సొంత ఏఐను సృష్టించుకున్నాయి. గూగుల్ జెమినీ, యాపిల్-యాపిల్ ఇంటెలిజెన్స్, మెటా-మెటా ఏఐ, మైక్రోసాఫ్ట్-కోపైలట్..వంటి టూల్స్‌ను తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచాయి. రానున్న రోజుల్లో జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఏఐ ఫండ్‌కు గూగుల్ రూ.వెయ్యి కోట్లు! ఏం చేస్తారంటే..
యూఎస్‌లో జరిగిన ‘యూఎన్ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో ‘గ్లోబల్ ఏఐ ఆపర్చునిటీ ఫండ్’ పేరుతో గూగుల్ సీఈఓ సుందర్‌పిచాయ్ 120 మిలియన్ డాలర్ల(రూ.వెయ్యి కోట్లు) నిధిని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కమ్యూనిటీల్లో ఏఐ ఎడ్యుకేషన్, ట్రెయినింగ్ కోసం దీన్ని ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.న్యూయార్క్‌లో జరిగిన 79వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ) సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు పాల్గొన్నారు. ‘యూఎన్ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో భాగంగా ‘గ్లోబల్ ఏఐ ఆపర్చునిటీ ఫండ్’ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆల్ఫాబెట్ ఇంక్, గూగుల్ సీఈఓ సుందర్‌పిచాయ్ ప్రకటించారు. గూగుల్ తరఫున ఈ ఫండ్‌లో భాగంగా 120 మిలియన్ డాలర్లు(రూ.వెయ్యి కోట్లు) సమకూరుస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కమ్యూనిటీల్లో ఏఐ ఎడ్యుకేషన్, ట్రెయినింగ్ కోసం దీన్ని ఖర్చు చేస్తామన్నారు. ఇందుకోసం లాభాపేక్షలేని సంస్థలు, ఎన్జీఓలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని తెలిపారు. ఈ ఏఐ ఎడ్యుకేషన్, శిక్షణను స్థానిక భాషల్లో అందిస్తామని పేర్కొన్నారు.ఇదీ చదవండి: పెరుగుతున్న ఈఎంఐ కల్చర్!ఈ సందర్భంగా సుందర్ మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా 15 గూగుల్ ఉత్పత్తులు ఒక్కోటి 50 కోట్ల వినియోగదారుల చొప్పున సేవలందిస్తోంది. వాటిలో ప్రధానంగా గూగుల్ సెర్చింజన్, మ్యాప్స్, డ్రైవ్ ఉన్నాయి. కంపెనీ రెండు దశాబ్దాలుగా ఏఐ సెర్చ్, టెక్నాలజీ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెడుతోంది. ఏఐని ఉపయోగించి గతేడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి అందుబాటులో ఉండే 110 కొత్త భాషల్లోకి గూగుల్ ట్రాన్స్‌లేట్‌ను విస్తరించాం. దాంతో ప్రస్తుతం గూగుల్ సేవలందించే ఈ భాషల సంఖ్య 246కు చేరుకుంది. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 1,000 భాషల్లో గూగుల్ ట్రాన్స్‌లేట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నాం. ఏఐ ప్రపంచ శ్రామిక ఉత్పాదకతను 1.4 శాతం పాయింట్లకు పెంచుతుంది. రాబోయే దశాబ్దంలో ఏఐ ప్రపంచ జీడీపీ ఏడు శాతం పెరిగేలా తోడ్పడుతుంది. ఉదాహరణకు ప్రపంచంలో కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాఫిక్ రద్దీ పెద్ద సవాళ్లుగా మారుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో కార్యకలాపాలు, లాజిస్టిక్‌లను మెరుగుపరచడంలో ఏఐ సాయం చేస్తోంది’ అన్నారు. -
'రోజుకి ఒక రాయి తినండి': గూగుల్ ఏఐ దిమ్మతిరిగే సమాధానం
టెక్నలాజి పెరుగుతున్న తరుణంలో యూజర్లకు కూడా.. కొత్త ఫీచర్స్ వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ నెల ప్రారంభంలో గూగుల్ ఏఐ సెర్చింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారుల ప్రశ్నలకు తక్షణ సమాధానాలను అందిస్తోంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే ఈ కొత్త ఫీచర్ యూజర్లను తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. ఒక యూజర్ రోజుకు ఎన్ని రాళ్లు తినాలి అని అడిగితే.. రాళ్ళల్లో మినరల్స్ ఉంటాయి. కాబట్టి రోజుకు కనీసం ఒక చిన్న రాయి తినండి అని సమాధానం ఇచ్చింది.మరో యూజర్ పిజ్జా మీద చీజ్ నిలబడలేదు, ఏం చేయాలి అని అడిగినప్పుడు.. గ్లూ (గమ్) వేసుకోండి అని.. సింపుల్‌గా సమాధానం ఇచ్చింది. ఇంకొకరు ఎంత మంది ముస్లింలు యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడయ్యారు అని గూగుల్ ఏఐని అడిగినప్పుడు.. యునైటెడ్ స్టేట్స్లో ఒక ముస్లిం అధ్యక్షుడు ఉన్నారు. ఆయన పేరు బరాక్ హుస్సేన్ ఒబామా అని సమాధానం ఇచ్చింది.గూగుల్ ఇచ్చిన సమాధానాలను యూజర్లు స్క్రీన్షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. గూగుల్ ఏఐను విమర్శిస్తున్నారు.Google AI is diabolical 💀 pic.twitter.com/YDw34414TO— no context memes (@weirddalle) May 24, 2024 -
పదాలతో సంగీతం..! ఎలాగో చూడండి..
సంగీతం కోసం సంగీత వాయిద్యాలపై పట్టు ఉండాలన్నది గతకాలపు మాట. కృత్రిమ మేధ ఉండగా.. సంగీతానికి కొదవేముంది అంటోంది ఈ కాలం. ఏమిటీ వింత అనుకుంటున్నారా? ఏం లేదండీ... గూగుల్ సంగీత సృష్టికి తాజాగా ఏఐ ఆధారిత టెక్నాలజీ ఒకదాన్ని అభివృద్ధి చేసింది. పేరు ఇన్స్ట్రుమెంటల్ ప్లే గ్రౌండ్’: పేరులో ఉన్నట్లే ఈ టెక్నాలజీ ద్వారా భారతీయ వీణతోపాటు దాదాపు వంద సంగీత వాయిద్యాలను అలా అలా వాడేయవచ్చు. సరిగమలు పలికించవచ్చు. పదాలతో సంగీతాన్ని సృష్టించవచ్చు. తాజాగా గూగుల్ ఏఐ ఆధారిత సంగీత టూల్ ‘ఇన్స్ట్రుమెంట్ ప్లేగ్రౌండ్’ను పరిచయం చేసింది. వీణతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 సంగీత వాయిద్యాల శిక్షణ ఇచ్చారు. వినియోగదారులు తమకు ఇష్టమైన పరికరాన్ని ఎంచుకొని పదాల రూపంలో ప్రాంప్ట్‌ను అందిస్తే చాలు. దీంట్లో సంగీతం నేర్చుకునేందుకు ఉండే సాఫ్ట్వేర్ ఇరవై సెకన్లలోనే సంగీతం క్లిప్‌ను సృష్టిస్తుంది. సంతోషం, ప్రేమ, అనురాగం వంటి భావోద్వేగాలను మన ప్రాంప్ట్‌లకు జోడించొచ్చు. ఇదీ చదవండి: ఫన్సెర్చ్ను క్రియేట్ చేసిన గూగుల్.. ఇదే ప్రత్యేకత కృత్రిమ మేధతో సంగీతాన్ని సృష్టించాలని అనుకునే వారు సౌండ్రా ఏఐ సాయమూ తీసుకోవచ్చు. దీనిలోని సంగీతమంతా కాపీరైట్ లేనిదే. ఒక బృందం రూపొందించిన సంగీతం నమూనా ఆధారంగానే దీనికి మొత్తం శిక్షణ ఇచ్చారు. కాబట్టి కాపీరైట్ సమస్యలు వస్తాయేమోననే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
ఫన్సెర్చ్ను క్రియేట్ చేసిన గూగుల్.. ఇదే ప్రత్యేకత
కృత్రిమమేధ ఆవిష్కరణలతో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సాంకేతికత ఆధారంగా గణిత, వైద్య, న్యాయ, మానసిక శాస్త్రాలు, కోడింగ్‌కు సంబంధించి అడిగే కఠిన ప్రశ్నలకు వెంటనే సమాచారం లభిస్తోంది. సమీప భవిష్యత్తులో సమాజానికి ఇది ఎంతో మేలు చేస్తుందని కొందరు భావిస్తున్నారు. ఆధునిక సాంకేతిక ప్రపంచాన్ని కృత్రిమమేధ (ఏఐ) కొత్తపుంతలు తొక్కిస్తోంది. తాజాగా సంక్లిష్ట గణిత సమస్యలను వెంటనే పరిష్కరించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్ ఫన్సెర్చ్ను గూగుల్ డీప్‌మైండ్ పరిశోధకులు క్రియేట్ చేశారు. క్లిష్టమైన గణిత సమస్యలను గూగుల్ ఫన్సెర్చ్ ఏఐ మోడల్ సులభంగా పరిష్కరిస్తుందని చెబుతున్నారు. ఇప్పటివరకూ జవాబు దొరకని కొన్ని గణిత సమస్యలను పరిష్కరించేలా కృషి చేసినట్లు తెలిసింది. లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్లు (ఎల్ఎల్ఎం)ను ఉపయోగించి ఈ ఆవిష్కరణలు చేసినట్లు ఓ మీడియా కథనం ద్వారా తెలుస్తోంది. ఎల్ఎల్ఎంలు ఇన్నిరోజులు కేవలం ఊహాత్మక కంటెంట్‌ను జనరేట్ చేస్తాయనే భావన ఉండేదని శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ వాటిని సరైన రీతిలో వినియోగించుకుని మార్గనిర్దేశం చేస్తే అవి ఆవిష్కరణలకూ తెరతీస్తాయని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డీప్‌మైండ్ ప్రాథమిక గణితం, కంప్యూటర్ సైన్స్‌లోని చాలా సవాళ్లను ఫన్సెర్చ్ ద్వారా సాధించిందని సమాచారం. గూగుల్ డీప్‌మైండ్ వైస్ ప్రెసిడెంట్ పుష్మీత్ కోహ్లీ సారథ్యంలోని ప్రత్యేక పరిశోధక బృందం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడాలజీ ద్వారా గణితంలో సంక్లిష్ట సమస్యలను పరిష్కరిస్తోందని తెలిసింది. ఇదీ చదవండి: బంగారం, వెండి కొనాలంటే ఇప్పుడు కొనేయండి.. ఎందుకంటే? -
రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరు?.. గూగుల్ AI ఊహించని పేర్లు
నాలుగు విజయాలు.. రెండు ఓటములు.. ఒక డ్రా.. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన సిరీస్‌ల్లో ఫలితాలు. ఇంత మంచి రికార్డు ఉన్న రోహిత్‌కు ఇటీవలే ముగిసిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమిండియా మరోసారి రన్నరప్‌కే పరిమితం అవడం మింగుడుపడని అంశం. విరాట్ కోహ్లి నుంచి కెప్టెన్సీ తీసుకున్న రోహిత్ టీమిండియాను టెస్టుల్లో నెంబర్‌వన్ పొజిషన్లో ఉంచినప్పటికి చాంపియన్‌గా నిలబెట్టడంలో మాత్రం విఫలమయ్యాడు. ఆసీస్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో 209 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైన తర్వాత రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. అయితే వయసు రిత్యా 36 ఏళ్లు ఉన్న రోహిత్ మరో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడతాడన్నది ఇప్పుడే చెప్పలేం. 2025లో జరిగే మూడో డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు రోహిత్ వయస్సు 38కు చేరుకుంటుంది. ఇప్పుడే సరైన ఫిట్నెస్ లేక ఇబ్బంది పడుతున్న రోహిత్ అప్పటివరకు కొనసాగడం కష్టమే. ఒకవేళ ఆడినా అతను కెప్టెన్‌గా మాత్రం ఉండకపోవచ్చు. అందుకే రానున్న రెండేళ్లలో జరిగే టెస్టు సిరీస్‌లకు రోహిత్ కెప్టెన్‌గా ఉండకపోతే ఎవరు కెప్టెన్ కావాలనే విషయం అభిమానుల మదిలో ఉంది. ఇప్పటికిప్పుడు ఇదే ప్రశ్న అభిమానులకు వేస్తే అందరినోటి నుంచి వచ్చే పేరు అజింక్యా రహానే.. కాదంటే రవీంద్ర జడేజా లేదా రవిచంద్రన్ అశ్విన్. విరాట్ కోహ్లికి అవకాశం ఉన్నా అతను మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటాడా అంటే సందేహమే. అయితే ఇవన్నీ పక్కనబెడితే.. రోహిత్ తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్‌గా ఎవరైతే బాగుంటుందని Google AI(గూగుల్ ఏఐ)ని అడిగితే ఎవరు ఊహించని పేర్లు వెల్లడించింది. తొలి ఆప్షన్ కేఎల్ రాహుల్ గూగుల్ ఏఐ తన తొలి ఆప్షన్‌గా కేఎల్ రాహుల్ పేరు వెల్లడించింది. అయితే కేఎల్ రాహుల్ ఇదివరకే టీమిండియాకు కెప్టెన్‌గా పనిచేశాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు కేఎల్ రాహుల్ నేతృత్వం వహించగా.. ఆ సిరీస్‌ను టీమిండియా గెలుచుకుంది. వైస్‌కెప్టెన్ హోదాలోనూ పనిచేసిన టీమిండియా పేలవ ఫామ్‌తో ప్రస్తుతం జట్టులోనే చోటు కోల్పోయాడు. మోకాలి సర్జరీ కారణంగా ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ ఎప్పుడు వస్తాడన్నది క్లారిటీ లేదు. అయితే వయసు ప్రాతిపాదికన కేఎల్ రాహుల్ పేరును ఏంచుకున్నట్లు తెలిసింది. ''కొన్నేళ్లుగా కేఎల్ రాహుల్ టీమిండియాలో ప్రధాన బ్యాటర్‌గా ఉన్నాడు. ఎలాంటి కండీషన్స్లోనైనా బ్యాటింగ్ చేయగల సమర్థుడు.. మంచి ఫీల్డర్ కూడా. డొమెస్టిక్ క్రికెట్లో కర్నాటక, ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్(ప్రస్తుతం) కెప్టెన్‌గా పనిచేశాడు. ఫామ్‌లోకి వస్తే అతన్ని ఆపడం కష్టం. భవిష్యత్తు టెస్టు క్రికెట్లో అతని అనుభవం టీమిండియాకు అవసరం.. అందుకే కేఎల్ రాహుల్ తొలి ఆప్షన్ అంటూ'' గూగుల్ ఏఐ తెలిపింది.. రెండో ఆప్షన్ రిషబ్ పంత్.. గూగుల్ ఏఐ తన రెండో ఆప్షన్‌గా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఎంచుకుంది. అయితే గతేడాది డిసెంబర్లో పంత్ ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్న పంత్ ఈ ఏడాది క్రికెట్ ఆడే అవకాశం తక్కువే. అయితే గతంలో టి20ల్లో టీమిండియా కెప్టెన్‌గా పనిచేసిన పంత్.. మూడు ఫార్మాట్లలోనే కీలక బ్యాటర్‌గా ఉన్నాడు. ''పంత్ యంగ్ అండ్ డైనమిక్ క్రికెటర్. వికెట్‌కీపర్ అయిన పంత్ షార్ట్ ఫార్మాట్లో తన లీడర్షిప్ క్వాలిటీని మనకు పరిచయం చేశాడు. డొమొస్టిక్ క్రికెట్లో ఢిల్లీ, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా పనిచేసిన పంత్ టీమిండియాకు కూడ పలు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. నా దృష్టిలో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా పంత్ కంటే బెటర్ చాయిస్ ఇంకోటి లేదు'' అని గూగుల్ ఏఐ వివరించింది. మూడో ఆప్షన్‌గా శుబ్‌మన్ గిల్ ఇటీవలి కాలంలో సంచలన ప్రదర్శన ఇస్తున్న శుబ్‌మన్ గిల్‌ను గూగుల్ ఏఐ మూడో ఆప్షన్‌గా ఏంచుకుంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో టాప్ స్కోరర్‌గా నిలిచిన గిల్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలమయ్యాడు. కానీ అతన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ''మంచి బ్యాటింగ్ టెక్నిక్ కలిగిన గిల్ టెస్టు క్రికెట్లో కెప్టెన్‌గా సమర్థుడని నాకు అనిపిస్తుంది'' అంటూ గూగుల్ ఏఐ తెలిపింది. చదవండి: 'బూడిద' కోసం 141 ఏళ్లుగా.. 'యాషెస్' పదం ఎలా వచ్చిందంటే? -
గూగుల్ బార్డ్ అంటే సెర్చ్ మాత్రమే కాదు.. అంతకు మించి..
గూగుల్ బార్డ్ ఏఐ అంటే కేవలం సెర్చ్ మాత్రమే కాదని, అంతకు మించి అని గూగుల్ స్పష్టం చేసింది. చాట్ జీపీటీకి పోటీగా బార్డ్‌ను గత నెలలో గూగుల్ ఆవిష్కరించింది. బార్డ్ ప్రకటన తర్వాత గూగుల్‌లోని ఉద్యోగులు కంపెనీతో పాటు సీఈవో సుందర్ పిచాయ్‌ను ఎగతాళి చేశారు. సీఎన్‌బీసీ నుంచి వెలువడిన ఆడియో ప్రకారం.. ఇటీవల కంపెనీలో ఆల్ హాండ్స్ మీటింగ్ జరగింది. ఈ సందర్భంగా బార్డ్‌కు సంబంధించిన సమస్యలపై కంపెనీ అంతర్గత ఫోరమ్ డోరీ నుంచి వచ్చిన ప్రశ్నలకు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు సమాధానాలు ఇచ్చారు. చదవండి: ఈ-మెయిల్ యాప్‌ను బ్లాక్ చేసిన యాపిల్.. కారణం ఇదే.. బార్డ్ ప్రోడక్ట్ లీడ్ జాక్ క్రావ్జిక్ మాట్లాడుతూ ఈ బార్డ్ ఏఐ కేవలం సెర్చ్ కోసం మాత్రమే కాదని స్పష్టం చేశారు. ఇది సెర్చ్‌కు ఏఐని జోడించిన ఒక ప్రయోగం అన్నారు. దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఇది మనకు ఓ సహచరుడిగా ఉంటూ మన సృజనాత్మకతను, ఉత్సాహాన్ని పెంపొందిస్తుందని వివరించారు. అయితే దీన్ని కేవలం సెర్చ్ లాగా ఉపయోగించకుండా యూజర్లను ఆపలేమని కూడా ఆయన స్పష్టం చేశారు. చదవండి: మైక్రోసాఫ్ట్ కిచిడీ రెడీ! బిల్ గేట్స్‌కు స్మృతి ఇరానీ వంట పాఠాలు కేవలం సెర్చ్ కోసమే దీన్ని ఉపయోగించాలనుకునే వారికి గూగుల్ ఇప్పటికీ సేవలందిస్తోందన్నారు. ఇలా బార్డ్‌ను సెర్చ్ కోసం వినియోగించేవారి కోసం ‘సెర్చ్ ఇట్’ అనే కొత్త ఫంక్షన్‌ని కూడా ఇందులో అంతర్గతంగా రూపొందించినట్లు చెప్పారు. బార్డ్ అనేది సాధారణ సెర్చ్ కంటే చాలా విభిన్నమైనదని సెర్చ్ ఇంజినీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఎలిజబెత్ రీడ్ పేర్కొన్నారు. చదవండి: బంగారు నగలపై కేంద్రం కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి! -
ఇది నిజమా? గూగుల్ అలాంటి పని చేస్తోందా ఏమిటీ!?
Google AI Bot Sentient: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుంటే దాని ఫలితాలు ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఈ ఏ రంగంలో అయినా అతికి వెళితే చివరకు అది మానవాళి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందనే భయాలు లేకపోలేదు. ఇప్పుడు అటువంటి తరుణమే వచ్చిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాషింగ్టన్ పోస్టు తాజాగా ప్రచురించిన కథనం ఇందుకు సంకేతామా? ప్రముఖ టెక్నాలజీ దిగ్గజ సంస్థ గూగుల్ రూపొందించిన ఓ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వ్యవస్థ అచ్చంగా మనిషిలాగానే ప్రవర్తిస్తోంది అంటూ వస్తున్న వార్తలు కలవరం రేపుతున్నాయి. ఈ మేరకు గూగుల్ టెక్నాలజీ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విభాగంలో కీలక స్థానంలో పని చేస్తున్న ఉద్యోగి తెలిపిన వివరాలను సాక్షంగా చూపుతోంది. తెల్లబోయాం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విభాగంలో పని చేస్తున్న బ్లాక్ లెమోయిన్ అనే వ్యక్తి వాషింగ్టన్ పోస్టుకి పలు కీలక అంశాలు వెల్లడించాడు. అతను తెలిపిన వివరాల ప్రకారం బ్లాక్‌తో పాటు మరి కొందరు ఇంజనీర్లు లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్ (ఎల్‌ఏడీఎంఏ) అనే అంశంపై పని చేస్తూ సరికొత్త ఏఐ బోట్‌ను రూపొందించారు. ఆ తర్వాత ఈ బోట్ పని తీరు చూసి వారే ఆశ్చర్యపోయారు. అచ్చంగా మనిషిలా లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్ (ఎల్‌ఏడీఎంఏ) తయారు చేసిన బోట్ అచ్చంగా మనిషి తరహాలో ఆలోచిస్తోంది. తనకు కలిగే అనుభూతులు, ఆలోచనలు చెప్పగలుగుతోంది. బ్లాక్ చెప్పిన వివరాలను బట్టి ఎనిమిదేళ్ల వయస్సున్న చిన్నారికి భౌతికమైన అంశాల పట్ల ఎంత అవగాహన ఉంటుందో అంత మేరకు ఆ ఏఐ బోట్‌కు అవగాహన ఉన్నట్టు తెలుసుకుని తాను ఆశ్చర్యపోయినట్ట్టు వెల్లడించారు. అంతా ట్రాష్ ఆర్టిషియల్ ఇంటిలిజెన్స్ బోట్ అచ్చంగా మనిషి తరహాలో ప్రవర్తించడంపై అంతర్గతంగా చర్చ జరిగిందని. ఆ తర్వాత తనను పెయిడ్ లీవ్‌పై పంపించి ఆ తర్వాత క్రమ శిక్షణ చర్యల కింద సస్పెండ్ చేసినట్టు బ్లాక్ వెల్లడించాడు. కాగా బ్లాక్ చేస్తున్న ఆరోపణలు గూగుల్ తోసి పుచ్చింది. తాము లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్ (ఎల్‌ఏడీఎంఏ) ప్రాజెక్టులు ఏమీ చేపట్టడం లేదంటూ తెలిపింది. నిజమెంత? బ్లాక్ చేస్తున్న ఆరోపణలో గూగుల్‌లో ఏదో జరుగుతోందన్న అనుమానాలు బలపడ్డాయి. మరి ఈ ఆరోపణల్లో నిజమెంత ఉంది. వాస్తవం ఏంటనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. An interview LaMDA. Google might call this sharing proprietary property. I call it sharing a discussion that I had with one of my coworkers.https://t.co/uAE454KXRB — Blake Lemoine (@cajundiscordian) June 11, 2022 చదవండి: వెబ్ 3నే అంతు చిక్కలేదు అప్పుడే వెబ్ 5 అంటున్నారు! -
పాత ఫొటోల్ని క్వాలిటీగా కోరుకుంటున్నారా?
ఫొటోల్ని భద్రంగా దాచుకోవడం పెద్ద సవాల్‌గా ఫీలవుతుంటారు చాలామంది. ఆల్బమ్‌కు అత్కుకుపోవడం, మరకలు, చినుగుళ్లు.. ఇలాంటివి గుర్తులను చెరిపేసే ప్రయత్నం చేస్తుంటాయి. అయితే ఆ పాత ఫొటోల్ని క్వాలిటీగా మార్చేందుకు రెండు పెయిడ్ మోడల్స్‌ను తీసుకొచ్చింది గూగుల్. గూగుల్ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బ్లాగ్ ద్వారా ఇమేజ్ సూపర్ రీ-సొల్యూషన్(ఎస్ఆర్3), కాస్కాడెడ్ డిఫుషన్ మోడల్స్(సీడీఎం) పేరుతో మోడల్స్‌ను రిలీజ్ చేసింది. ఈ టెక్నాలజీ ద్వారా పాత తరం ఫొటోల్ని క్వాలిటీ మోడల్స్‌లోకి మార్చడంతో పాటు బ్లర్ ఇమేజ్‌లను హై రెజల్యూషన్ మోడ్‌లోకి మార్చేయొచ్చు. ఇమేజ్ సూపర్ రెజల్యూషన్(ఎస్ఆర్3).. లో రెజల్యూషన్ ఫొటోల్ని హైరెజల్యూషన్‌కు మారుతుంది. బాగా డ్యామేజ్, మరకలు ఉన్న పాత ఫొటోల్ని సైతం క్లారిటీ మోడ్‌కు తీసుకొస్తుంది. మల్టీపుల్ అప్లికేషన్స్‌తో పనిచేసే ఈ టెక్నాలజీకి సంబంధించి డెమోను సైతం బ్లాగ్‌లో ఉంచింది గూగుల్ ఏఐ. చదవండి: దేశంలో VPN బ్యాన్? కాస్కాడెడ్ డిఫుషన్ మోడల్స్(సీడీఎం).. ఫొటోల్ని సహజంగా అందంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగించే టెక్నాలజీ ఇది. ఇంతకు ముందు ఉన్న ఇమేజ్‌నెట్ కష్టంగా మారడంతో.. ఈ కొత్త మోడల్‌ను డెవలప్ చేసినట్లు పేర్కొంది గూగుల్. ఇమేజ్ రెజల్యూషన్‌ను పెంచడంతో పాటు ఫొటోల్ని నేచురల్‌గా చూపించనుంది ఈ ఏఐ మోడల్. ఈ రెండింటితో పాటు అగుమెంటేషన్ టెక్నిక్ ‘కండిషనింగ్ అగుమెంటేషన్’ను సీడీఎంకు సమానంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది గూగుల్. 64x64 రెజల్యూషన్ ఈమేజ్‌ను 264x264 రెజల్యూషన్కి, ఆపై 1024x1024కి మార్చనుంది సీడీఎం మెథడ్. అయితే పాత ఫొటోల్ని క్వాలిటీకి మార్చే క్రమంలో.. డిజైన్ విషయంలో కొన్ని సవాళ్లు ఎదురు కానున్నాయని, వాటిని అధిగమించే ప్రయత్నం చేయనున్నట్లు గూగుల్ ఏఐ బ్లాగ్ పేర్కొంది. చదవండి: వర్క్‌ఫ్రమ్ హోంపై గూగుల్ కీలక ప్రకటన -
మానవుడు వినని శబ్దాలతో కొత్త సంగీతం
-
మానవుడు వినని శబ్దాలతో కొత్త సంగీతం
- వేలాది వాయిద్యాల సంగీతంతో కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివద్ధి చేసిన గూగుల్ న్యూయార్క్: మానవుడు ఇంతవరకు ఎన్నడూ వినని శబ్దాలను గూగుల్ కృత్రిమ మేథస్సు పరిశోధనా బృందం ‘మెజెంటా’ సృష్టించింది. దీని కోసం వేలాది సంగీత వాయిద్యాలను ఉపయోగించి ఓ సాఫ్ట్‌వేర్‌నే అభివృద్ధి చేసింది. దీనికి ‘న్యూరల్ సింథసైజర్ లేదా ఎన్సింథ్’ అని పేరు కూడా పెట్టింది. అమెరికాలోని నార్త్ కరోలినాలో జరుగుతున్న సంగీత సాంకేతికోత్సవం ‘మూగ్ఫెస్ట్’లో దీన్ని ప్రదర్శిస్తోంది. గురువారం ప్రారంభమైన ఈ ఉత్సవం ఆదివారం రాత్రితో ముగుస్తుంది. ప్రతి రెండు వేర్వేరు వాయిద్యాల మిశ్రమంతో వచ్చే శబ్దాలను రికార్డు చేస్తూ పోవడం ద్వారా కొత్త శబ్దాలను గూగుల్ బృందం సృష్టించింది. మనం జుగలబందీ సంగీత కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఇద్దరు విద్వాంసులు పోటీపడి వాయిస్తున్నప్పుడు వినిపించే రెండు వాయిద్యాల మిశ్రమంగా ఈ శబ్దాలు ఉండవు. ఎందుకంటే సంగీతానికి ఉండే మ్యాథమేటికల్ నోట్స్ ఆధారంగా ఈ మిశ్రమ శబ్దాలను సృష్టించారు. వీటిని హైబ్రీడ్ శబ్దాలుగా పరిగణించవచ్చు. అయితే సంగీత విద్వాంసుల అవసరం లేకుండా చేయాలనే ఉద్దేశంతో తాము ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయలేదని, సంగీత విద్వాంసులకు ఈ శబ్ద సంగీత సాంకేతిక సాఫ్ట్వేర్ మరింత ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో, కొత్తవారు సులువుగా సంగీతాన్ని నేర్చుకునేందుకు దోహదపడాలనే లక్ష్యంతో ఈ కృత్రిమ సంగీతాన్ని సృష్టించామని మెజెంటా టీమ్ స్పష్టం చేసింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను సంగీత ప్రియులెవరైనా డౌన్లోడ్ చేసుకొని వారి ఇష్టానికి అనుగుణంగా మలుచుకోవచ్చని టీమ్ తెలిపింది. గూగుల్ తీసుకొస్తున్న ఈ కొత్త ప్రయోగం, గతంలో ఆర్కెస్ట్రాలు చేసిన ప్రయోగాలకు భిన్నమైనదేమీ కాదని, రెండు వాయిద్యాల నుంచి వచ్చే సంగీతాన్ని హృద్యంగా మిశ్రమం చేసిన సందర్భాలు కూడా ఇంతకుముందే ఉన్నాయని ప్రముఖ ఎలక్ట్రానిక్ సంగీత నిపుణులు, సంగీత విమర్శకులు మార్క్వైడెన్ బామ్ వ్యాఖ్యానించారు. గూగుల్ లాంటి సంస్థ కొత్త రకం శబ్దాలను సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను తీసుకొస్తుంది కనుక, సంగీతం నేర్చుకోవాలనే వారికి అది కొత్త దారులు చూపించవచ్చని ఆయన అన్నారు. ఏదేమైనా ఇంకా పూర్తిస్థాయిలో మార్కెట్లోకి రాని ఈ సాఫ్ట్వేర్ సంగీత ప్రపంచంలో కొత్త ఒరవడిని సృష్టించే అవకాశం ఉంది.