గూగుల్ బార్డ్ ఏఐ అంటే కేవలం సెర్చ్ మాత్రమే కాదని, అంతకు మించి అని గూగుల్ స్పష్టం చేసింది. చాట్ జీపీటీకి పోటీగా బార్డ్‌ను గత నెలలో గూగుల్ ఆవిష్కరించింది. బార్డ్ ప్రకటన తర్వాత గూగుల్‌లోని ఉద్యోగులు కంపెనీతో పాటు సీఈవో సుందర్ పిచాయ్‌ను ఎగతాళి చేశారు.
సీఎన్‌బీసీ నుంచి వెలువడిన ఆడియో ప్రకారం.. ఇటీవల కంపెనీలో ఆల్ హాండ్స్ మీటింగ్ జరగింది. ఈ సందర్భంగా బార్డ్‌కు సంబంధించిన సమస్యలపై కంపెనీ అంతర్గత ఫోరమ్ డోరీ నుంచి వచ్చిన ప్రశ్నలకు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు సమాధానాలు ఇచ్చారు.
చదవండి: ఈ-మెయిల్ యాప్‌ను బ్లాక్ చేసిన యాపిల్.. కారణం ఇదే..
బార్డ్ ప్రోడక్ట్ లీడ్ జాక్ క్రావ్జిక్ మాట్లాడుతూ ఈ బార్డ్ ఏఐ కేవలం సెర్చ్ కోసం మాత్రమే కాదని స్పష్టం చేశారు. ఇది సెర్చ్‌కు ఏఐని జోడించిన ఒక ప్రయోగం అన్నారు. దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఇది మనకు ఓ సహచరుడిగా ఉంటూ మన సృజనాత్మకతను, ఉత్సాహాన్ని పెంపొందిస్తుందని వివరించారు. అయితే దీన్ని కేవలం సెర్చ్ లాగా ఉపయోగించకుండా యూజర్లను ఆపలేమని కూడా ఆయన స్పష్టం చేశారు.
చదవండి: మైక్రోసాఫ్ట్ కిచిడీ రెడీ! బిల్ గేట్స్‌కు స్మృతి ఇరానీ వంట పాఠాలు
కేవలం సెర్చ్ కోసమే దీన్ని ఉపయోగించాలనుకునే వారికి గూగుల్ ఇప్పటికీ సేవలందిస్తోందన్నారు. ఇలా బార్డ్‌ను సెర్చ్ కోసం వినియోగించేవారి కోసం ‘సెర్చ్ ఇట్’ అనే కొత్త ఫంక్షన్‌ని కూడా ఇందులో అంతర్గతంగా రూపొందించినట్లు చెప్పారు. బార్డ్ అనేది సాధారణ సెర్చ్ కంటే చాలా విభిన్నమైనదని సెర్చ్ ఇంజినీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఎలిజబెత్ రీడ్ పేర్కొన్నారు.
చదవండి: బంగారు నగలపై కేంద్రం కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి!
Comments
Please login to add a commentAdd a comment