Google Now Lays off Robots That Clean Cafeteria - Sakshi
Sakshi News home page

Google: ఉద్యోగులకే కాదు.. రోబోలకూ లేఆఫ్‌!

Published Sun, Feb 26 2023 2:27 PM | Last Updated on Sun, Feb 26 2023 2:57 PM

Google Now Lays Off Robots That Clean Cafeteria - Sakshi

వ్యయ నియంత్రణ పేరుతో వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న టెక్‌ దిగ్గజం గూగుల్‌.. లేఆఫ్‌లు కేవలం ఉద్యోగులకే కాదు.. రోబోలకు కూడా వర్తింపజేసింది. కేఫిటేరియాలలో పనిచేస్తున్న రోబోలకు ఉద్వాసన పలికింది. గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ రోబోల అభివృద్ధి, శిక్షణ కోసం ఎవ్రీడే రోబోట్స్‌ పేరిట ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిలిపివేసిందని ‘వైర్‌డ్‌’ కథనం పేర్కొంది. ఆ ప్రాజెక్ట్‌లో భాగంగా గూగుల్‌ కార్యాలయాల్లోని కేఫిటేరియాలో టేబుళ్లు శుభ్రం చేయడంతో పాటు వివిధ పనులు చేయడానికి రోబోలను వినియోగించేవారు.

ఎవ్రీడే రోబోట్స్‌ ప్రాజెక​్‌లో 200 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా చక్రాలపై నడిచే వన్‌ ఆర్మ్‌డ్‌ రోబోలను 100కు పైగా అభివృద్ధి చేస్తున్నారు. వీటని కేఫిటేరియాలో టేబుళ్లు శుభ్రం చేయడం, చెత్తను సేకరించి వేరు చేయడం, తలుపు తెరవడం వంటి పనులు చేసేందుకు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. కరోనా సమయంలో వీటితో కాన్ఫరెన్స్‌ రూములు కూడా శుభ్రం చేయించినట్లు ‘వైర్‌డ్‌’ కథనంలో వివరించింది.

(ఇదీ చదవండి: ఇక రావు అనుకున్న రూ.90 లక్షలు.. అద్భుతం చేసిన చాట్‌జీపీటీ!)

రోబోలతో చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక్కోదాని నిర్వహణకు లక్షలాది రూపాయలు ఖర్చవుతుందని రోబోటిక్స్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యయ నియంత్రణ పరిస్థితుల్లో అంత ఖర్చును భరించడానికి ఆల్ఫాబెట్‌ సిద్ధంగా లేదు. అందుకే ఎవ్రీడే రోబోట్స్‌ ప్రాజెక్ట్‌ లాభదాయకం కాదన్న భావనతో దాన్ని నిలిపేసింది. ఆ ప్రాజెక్ట్‌లో పనిచేసే సిబ్బందిని ఇతర రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌లలోకి బదిలీ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement