Alphabet Inc
-
టెన్షన్ పడుతూ లవ్‌ప్రపోజ్ చేసిన సుందర్‌పిచాయ్
భారత సంతతికి చెందిన వ్యక్తులు ప్రపంచంలోని అనేక కంపెనీలు, టెక్ దిగ్జజాలకు అధిపతులుగా తమ ప్రతిభ చాటుతున్నారు. అందులో ప్రపంచ నం.1 సెర్చ్ఇంజిన్ కంపెనీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు ప్రత్యేకస్థానం ఉంది. తమిళనాడులోని మధురైలో పుట్టి టాప్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా సీఈఓగా ఎంపికవ్వడం మామూలు విషయంకాదు. ఈరోజు సుందర్ పిచాయ్(52) పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.సుందర్ పిచాయ్ అసలు పేరు పిచాయ్ సుందరరాజన్ కాగా.. అమెరికాకు వెళ్లిన తర్వాత అసలు పేరును కుదించి తోటి ఉద్యోగులు సుందర్పిచాయ్గా పిలవడం ప్రారంభించారు. ఆయన 1972, జూన్ 10న తమిళనాడులోని మధురైలో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లి లక్ష్మి, స్టెనోగ్రాఫర్..తండ్రి రేగునాథ పిచాయ్ బ్రిటిష్ హయాంలో జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీ(జీఈసీ)లో ఇంజినీర్‌గా పనిచేసేవారు. సుందర్ స్థానికంగా ఉన్న వనవాణి మెట్రిక్యులేషన్ పాఠశాలలో పదో తరగతి దాకా చదివారు. చెన్నైలోని జవహర్ విద్యాలయలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో మెటలార్జికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశారు. అనంతరం అధ్యాపకులు అక్కడే పీహెచ్డీ చేయాలని సలహా ఇచ్చారు. కానీ, 1993లో అమెరికా వెళ్లి సుందర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్స్‌లో ఎంఎస్, వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.చదువుపూర్తయ్యాక అప్లైడ్మెటీరియల్స్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో పనిచేశారు. మెకిన్సే అండ్ కంపెనీలో మేనేజ్మెంట్ కన్సల్టింగ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో గూగుల్ సంస్థలో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగం ఉపాధ్యక్షుడిగా చేరారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించిన బృందానికి సారథ్యం వహించారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ టూల్బార్ రూపకల్పనలోనూ కీలక పాత్ర పోషించారు. గూగుల్ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ మ్యాప్స్ వంటి ఇతర అప్లికేషన్ల అభివృద్ధిని పర్యవేక్షించారు.మార్చి 13, 2013న పిచాయ్ తాను పర్యవేక్షించిన గూగుల్ ఉత్పత్తుల జాబితాను ఆండ్రాయిడ్‌కు జోడించారు. ఆగస్టు 10, 2015లో పిచాయ్ గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. గూగుల్ ఆయన సారథ్యంలో ఇటీవల ‘జెమినీ’ అనే జనరేటివ్ ఏఐను ఆవిష్కరించింది. ఆయన టెక్ప్రపంచానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్‌తో గౌరవించింది. 2019 డిసెంబర్లో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సుందర్ 2022 సంవత్సరానికిగానూ 226 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.1850కోట్లకు పైమాటే) పారితోషికం అందుకున్నారు.ఇదీ చదవండి: రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్‌జాబ్స్..!టెన్షన్ పడిన సీఈఓ..సుందర్‌ది ప్రేమ వివాహం. ఐఐటీ ఖరగ్‌పుర్‌లో బీటెక్ చూస్తున్నపుడు అంజలితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని చెప్పారు. తన భార్య గురించి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘మేం ఖరగ్‌పుర్ ఐఐటీలో తొలిసారి కలిశాం. చాలా బిడియస్తుడినైన నన్ను ఆమే మార్చింది. తనకు ప్రపోజ్ చేసేటప్పుడు నా టెన్షన్ ఇప్పటికీ గుర్తే. నా మనసులో మాట అంజలికి చెప్పడం కన్నా, గూగుల్‌లో ఈ స్థానాన్ని సంపాదించడమే తేలిక అనిపిస్తోందిప్పుడు. నా ప్రేమను అంగీకరించడం తన గొప్పతనం. అప్పటికి నేను ఆర్థికంగా స్థిరపడకపోయినా, నన్ను నమ్మింది. నా జీవితంలో ప్రతి కీలక సందర్భంలోనూ తనదే ముఖ్య పాత్ర. ఎన్నో ముఖ్య విషయాల్లో సందిగ్ధంలో ఉన్నప్పుడు అంజలే నా సలహాదారు. తక్షణ పరిష్కారాన్ని సూచిస్తుంది. మైక్రోసాఫ్ట్, యాహూ, ట్విటర్ వంటి సంస్థల నుంచి అవకాశాలెన్నో వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోలేకపోయా. అప్పుడు గూగుల్ నుంచి వెళ్లొద్దన్న తన సూచనను పాటించడమే నన్నీ స్థాయిలో నిలబెట్టింది’ అన్నారు. సుందర్ దంపతులకు కావ్య పిచాయ్, కిరణ్ పిచాయ్ ఇద్దరు పిల్లలు. -
దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..
ప్రపంచంలోని టాప్ టెక్ దిగ్గజ కంపెనీల మధ్య ఒప్పందం జరిగినట్లు కోర్టు పత్రాల ద్వారా బట్టబయలైంది. యాపిల్ సఫారి బ్రౌజర్లో గూగుల్ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా ఉండటానికి 2022లో 20 బిలియన్ డాలర్లు(రూ.1.66లక్షల కోట్లు) చెల్లించినట్లు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఇంక్. తెలిపింది. గూగుల్‌కు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన యాంటీట్రస్ట్ దావాలో ఈ విషయం వెలుగుచూసింది.ఆన్లైన్ ప్రకటనల ఆదాయం కోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్ చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని యూఎస్ కోర్టులో గతంలో యాంటీట్రస్ట్ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ కేసులో రెండు టెక్ దిగ్గజాల మధ్య ఒప్పందం జరిగినట్లు ఇటీవల తేలింది. విచారణ జరుపుతున్న న్యాయ శాఖ ఏడాది చివర్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.ఇటీవల జరిగిన విచారణలో రెండు కంపెనీల మధ్య ఒప్పందం జరిగిందని ధ్రువీకరించాయి. ఇందుకోసం జరిగిన చెల్లింపుల మొత్తాన్ని బహిర్గతం చేయకుండా చూడాలని భావించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. కోర్టు విచారణలో నంబర్లు వెల్లడించకుండా ఈ ఒప్పందానికి గూగుల్ ‘బిలియన్లు’ చెల్లించినట్లు యాపిల్ చెప్పింది. యాపిల్ డిఫాల్ట్ బ్రౌజర్‌గా ఉన్నందుకు సెర్చ్ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో 36 శాతం గూగుల్ యాపిల్‌కు చెల్లిస్తున్నట్లు తెలిసింది.కోర్టు పత్రాల వల్ల యాపిల్‌కు వస్తున్న ఆదాయమార్గాల గురించి కూడా స్పష్టత వచ్చినట్లయింది. 2020లో యాపిల్ నిర్వహణ ఆదాయంలో దాదాపు 17.5 శాతం గూగుల్ నుంచి సమకూరిందేనని అంచనా. గూగుల్ డిఫాల్ట్ ఒప్పందాల్లో యాపిల్ డీల్ అత్యంత ముఖ్యమైంది. యూఎస్‌లో అధికంగా ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ సెర్చ్ ఇంజిన్ సఫారి బ్రౌజర్ కావడంతో గూగుల్‌కు ఈ ఒప్పందం ప్రధానంగా మారింది. 2002లో సఫారీ బ్రౌజర్లో గూగుల్‌ను ఉచితంగా ఉపయోగించేందుకు యాపిల్ మొదట అంగీకరించింది. కానీ సెర్చ్ ప్రకటనల ఆదాయం పెరుగుతున్న కొద్దీ దాన్ని ఇరు కంపెనీలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. మే 2021 నాటికి సఫారి బ్రౌజర్లో డిఫాల్ట్ సెర్చ్ఇంజిన్ కోసం యాపిల్‌కు నెలకు 1 బిలియన్ డాలర్లు(రూ.8300 కోట్లు) కంటే ఎక్కువే చెల్లించిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.ఇదీ చదవండి: బేబీ పౌడర్‌తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లుసెర్చ్ ఇంజిన్‌లో గూగుల్‌తో పోటీపడుతున్న బింగ్‌ను యాపిల్ డిఫాల్ట్‌బ్రౌజర్‌గా ఉండేలా చూడాలని మైక్రోసాఫ్ట్ సంస్థ చాలానే ప్రయత్నించింది. కోర్టులో దాఖలైన పత్రాల ప్రకారం..సఫారీలో బింగ్‌ను డిఫాల్ట్‌గా ఉంచడానికి కంపెనీ తన ప్రకటనల ఆదాయంలో 90 శాతం యాపిల్‌కు ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధ పడింది. -
Google: ఒకేరోజు 9.5శాతం కుంగిన ఆల్ఫాబెట్ఇంక్!
గూగుల్-ఆల్ఫాబెట్ఇంక్ క్లౌడ్ బిజినెస్‌లో మూడో త్రైమాసిక ఆదాయంలో 22.5% వృద్ధిని నమోదు చేసింది. గూగుల్ క్లౌడ్ త్రైమాసికంలో నికర లాభాన్ని పోస్ట్ చేసింది. అయినప్పటికీ ఆల్ఫాబెట్ఇంక్ ఫలితాల్లో వాల్ స్ట్రీట్ అంచనాలను మించలేకపోయింది. దాంతో బుధవారం మార్కెట్ ముగింపు సమయానికి కంపెనీ స్టాక్ 9.5శాతం తగ్గి 125.6 అమెరికన్ డాలర్ల వద్ద స్థిరపడింది. ఫలితాలు విడుదల సందర్భంగా ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్‌పిచాయ్ మాట్లాడుతూ ప్రతిఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మరింత ఉపయోగకరంగా మార్చడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నామని చెప్పారు. అందరికి ప్రముఖ ఏఐ మోడల్లను చేరువ చేస్తామన్నారు. ఏఐ రంగంలో అద్భుతమైన పురోగతి ఉందని చెప్పారు. కృత్రిమమేధలో పెట్టుబడి పెట్టడానికి వీలైనంత ఎక్కువ అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గూగుల్ క్లౌడ్ ఆదాయ వృద్ధి గడిచిన త్రైమాసికంతో పోలిస్తే 28% నుంచి 22.5%కి మందగించింది. యూనిట్ మూడో త్రైమాసిక ఆదాయం రూ.69వేలకోట్లుకు పెరిగింది. ఈ యూనిట్ నిర్వహణ పరంగా గతేడాది రూ.3660 కోట్ల నష్టంతో పోలిస్తే, రూ.2213కోట్ల ఆదాయాన్ని పోస్ట్ చేసింది. అయితే వాల్ స్ట్రీట్ క్లౌడ్ కంప్యూటింగ్ నిర్వహణ..రూ.3600 కోట్లు, ఆదాయం..రూ.71వేల కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. కొందరు కస్టమర్లు కాస్ట్‌కటింగ్ పేరిట్ క్లౌడ్ సేవలు వినియోగించుకోలేదని దాంతో యూనిట్ అమ్మకాలు దెబ్బతిన్నాయని సీఎఫ్ఓ రూత్ పోరట్ తెలిపారు. గూగుల్‌క్లౌడ్ ప్లాట్‌ఫారమ్ సేవలు, సహకార సాధనాలు, కస్టమర్ల కోసం ఇతర ఎంటర్ప్రైజ్ సేవలు అందిస్తూ ఆదాయం సంపాదిస్తుంది. -
కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన గూగుల్.. వాళ్లు చేసిన పాపం ఏంటంటే..
ప్రముఖ టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్.. గూగుల్ హెల్ప్ వర్కర్ల కాంట్రాక్ట్‌ను అర్ధాంతరంగా ముగించి నిర్ధాక్షణ్యంగా వారిని విధుల నుంచి తొలగించింది. ఇంతకీ వాళ్లు చేసిన పాపం ఏంటంటే యూనియన్ ఏర్పాటుకు ప్రయత్నించడమే. ఈ మేరకు ఆరోపిస్తూ యూఎస్ లేబర్ బోర్డ్‌కి బాధిత ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. యూనియన్ ఏర్పాటుకు ప్రయత్నించిన ఉద్యోగులపై కక్ష తీర్చుకునేందుకు గూగూల్ మాతృసంస్థ ఆల్ఫాబిట్ తీసుకున్న నిర్ణయం ఫెడెరల్ కార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ పేర్కొంది. బాధిత ఉద్యోగుల్లో 70 శాతం మందికిపైగా తాము ఉద్యోగాలు కోల్పోతున్నామని జులైలో చెప్పినట్లు నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్ ఫైలింగ్‌ను ఉటంకిస్తూ ‘బ్లూమ్‌బెర్గ్’ నివేదించింది. ఆస్టిన్, టెక్సాస్, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాతోపాటు యూఎస్‌లోని ఇతర ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల తొలగింపు గురించి "టౌన్ హాల్" ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆల్ఫాబెట్ తెలియజేసింది. అలాగే ఉద్యోగులకూ ఈమెయిల్స్ పంపించింది. Lay off: ‘మేం పీకేశాం.. వారికి ఎవరైనా జాబ్ ఇవ్వండి ప్లీజ్’ బాధిత ఉద్యోగుల్లో 118 మంది రైటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, కంటెంట్ రూపొందించే లాంచ్ కోఆర్డినేటర్లు ఉన్నారు. వీరింతా గూగూల్ సెర్చ్ రిజల్ట్స్, ఏఐ చాట్‌బాట్ నాణ్యతను మెరుగుపరచడంలో కీలకంగా పనిచేశారు. యాక్సెంచర్ ద్వారా వీరిని నియమించుకున్నప్పటికీ, చట్టబద్ధంగా గూగుల్ సంస్థే తమకు తమ యజమాని అని ఉద్యోగులు పేర్కొంటున్నారు. యాక్సెంచర్తోపాటు గూగుల్‌ను తమకు ఉమ్మడి యజమానిగా గుర్తించాలని లేబర్ బోర్డ్‌ను కోరుతున్నారు. 2018లో ఆల్ఫాబెట్ కాంట్రాక్టు వర్కర్లలో చాలా మంది దాని గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో భాగమయ్యారని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. అదేవిధంగా కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్న ఆల్ఫాబెట్ కాంట్రాక్ట్ వర్కర్లు యూనియన్ చేయడానికి 2023 ఏప్రిల్‌లో ఆమోదం లభించింది. ఆ కార్మికుల ఉమ్మడి యజమాని ఆల్ఫాబెట్ అని నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్ రీజనల్ డైరెక్టర్ జులై నెలలో ఇచ్చిన తీర్పును సభ్యులందరూ సమర్థించారు. -
రెండో సారి ఉద్యోగుల్ని తొలగించిన ఆల్ఫాబెట్.. ఈసారి ఎంతమందంటే?
ఆర్ధిక మాంద్యం భయాలతో దిగ్గజ కంపెనీలు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగుల్ని తొలగిస్తూ ఖర్చల్ని తగ్గించుకుంటున్నాయి. తాజాగా ఆల్ఫాబెట్ Waymo (వేమో) ఉద్యోగుల్ని ఇంటికి పంపించింది. ప్రపంచ దేశాల్లో టెక్ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపులు ముమ్మరం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. ‘వేమో’ పేరుతో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ప్రాజెక్ట్‌పై పనిచేస్తుంది. అయితే కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఆల్ఫాబెట్.. వేమోలో 8 శాతం వర్క్ ఫోర్స్‌ను తగ్గించేందుకు సిద్ధమైంది. 2వ విడత ఉద్యోగుల లేఆఫ్స్‌తో ఆ సంస్థలో 137 మంది ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడనుంది. కమర్షియల్ అంశాలపై దృష్టిసారించిన ఆల్ఫాబెట్ ఈ ఏడాది ఇప్పటి వరకు వేమోకు చెందిన 209 మంది ఉద్యోగులపై వేటు వేసింది. గూగుల్‌లో లే ఆఫ్స్ కాగా ఆల్ఫాబెట్ ఇప్పటికే గూగుల్ ఉద్యోగులకు భారీ ఎత్తున పింక్‌స్లిప్‌లు జారీ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో 12వేల మందిని ఫైర్ చేయగా.. వారిలో భారత్‌కు చెందిన 400మంది ఉద్యోగులు ఉన్నారు. -
Google: ఉద్యోగులకే కాదు.. రోబోలకూ లేఆఫ్!
వ్యయ నియంత్రణ పేరుతో వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న టెక్ దిగ్గజం గూగుల్.. లేఆఫ్‌లు కేవలం ఉద్యోగులకే కాదు.. రోబోలకు కూడా వర్తింపజేసింది. కేఫిటేరియాలలో పనిచేస్తున్న రోబోలకు ఉద్వాసన పలికింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ రోబోల అభివృద్ధి, శిక్షణ కోసం ఎవ్రీడే రోబోట్స్ పేరిట ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిలిపివేసిందని ‘వైర్డ్’ కథనం పేర్కొంది. ఆ ప్రాజెక్ట్‌లో భాగంగా గూగుల్ కార్యాలయాల్లోని కేఫిటేరియాలో టేబుళ్లు శుభ్రం చేయడంతో పాటు వివిధ పనులు చేయడానికి రోబోలను వినియోగించేవారు. ఎవ్రీడే రోబోట్స్ ప్రాజెక్‌లో 200 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా చక్రాలపై నడిచే వన్ ఆర్మ్డ్ రోబోలను 100కు పైగా అభివృద్ధి చేస్తున్నారు. వీటని కేఫిటేరియాలో టేబుళ్లు శుభ్రం చేయడం, చెత్తను సేకరించి వేరు చేయడం, తలుపు తెరవడం వంటి పనులు చేసేందుకు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. కరోనా సమయంలో వీటితో కాన్ఫరెన్స్ రూములు కూడా శుభ్రం చేయించినట్లు ‘వైర్డ్’ కథనంలో వివరించింది. (ఇదీ చదవండి: ఇక రావు అనుకున్న రూ.90 లక్షలు.. అద్భుతం చేసిన చాట్‌జీపీటీ!) రోబోలతో చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక్కోదాని నిర్వహణకు లక్షలాది రూపాయలు ఖర్చవుతుందని రోబోటిక్స్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యయ నియంత్రణ పరిస్థితుల్లో అంత ఖర్చును భరించడానికి ఆల్ఫాబెట్ సిద్ధంగా లేదు. అందుకే ఎవ్రీడే రోబోట్స్ ప్రాజెక్ట్ లాభదాయకం కాదన్న భావనతో దాన్ని నిలిపేసింది. ఆ ప్రాజెక్ట్‌లో పనిచేసే సిబ్బందిని ఇతర రీసెర్చ్ ప్రాజెక్ట్‌లలోకి బదిలీ చేసింది. -
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తొందరపాటు.. ఏకిపారేస్తున్న సొంత ఉద్యోగులు!
మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు పోటీగా ఏఐ చాట్ జీపీటీని అభివృద్ది చేస్తున్న విషయం తెలిసిందే. టెక్నాలజీ రంగంలో మకుటం లేని మహరాజు విరాజిల్లుతున్న గూగుల్‌కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ జీమెయిల్ సృష్టికర్త పాల్ బుచిత్తో పాటు పలువురు ఐటీ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ విపత్తు నుంచి బయట పడేందుకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ‘బార్డ్’ అనే పేరుతో గూగుల్ తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడీ ప్రకటనపై గూగుల్ ఉద్యోగులు సుందర్ పిచాయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల తొలగింపులు, హడావిడిగా బార్డ్ అందుబాటులోకి తెస్తామని ప్రకటన చేయడం, బార్డ్ టెస్టింగ్ చేసే సమయంలో ఓ ప్రశ్నకు సమాధానంగా తప్పుడు జవాబులు ఇవ్వడాన్ని విమర్శలు చేస్తున్నారు. రష్ట్(తొందరగా), బాచ్డ్( నిర్లక్ష్యంగా), కామిక్లీ షార్ట్-సైటెడ్ (హాస్యా స్పదం) అంటూ ఇంటర్నల్ ఫోరమ్ మీమ్జెన్లో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులు నేరుగా సుందర్ పిచాయ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. బార్డ్, లేఆఫ్స్‌ను మయోపిక్‌గా(అస్పష్టంగా) అభిర్ణిస్తున్నారు. పిచాయ్ తొందరపాటు నిర్ణయాల వల్ల ఉద్యోగులకు, సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చర్చించుకుంటున్నారు. Wait! What 😲 ?????? Google Bard AI failed during the testing phase 🤔 . Google lost $100B of a market cap today as its rival for ChatGPT AI (BARD) platform gave an incorrect answer in a live demo.#googlebard pic.twitter.com/ayjUWJvTzZ — Aamir Malik (@aamirmmalikg) February 9, 2023 ముఖ్యంగా బార్డ్ ప్రమోషనల్ వీడియోలో తప్పలు దొర్లడాన్ని హైలెట్ చేస్తున్నారు. ప్రమోషనల్ వీడియోలో ‘9 ఏళ్ల పిల్లలకు చెప్పేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలీస్కోప్ (జేఎంఎస్టీ) కొత్తగా గుర్తించినవి ఏంటి?’ అనే ప్రశ్నకు బార్డ్ వివిధ సమాధానాలిచ్చింది. ఇందులో ఇందులో ‘భూమికి వెలుపల సోలార్ సిస్టమ్ ఫోటో తీసిన మొదటి శాటిలైట్ జేడబ్ల్యూఎస్‌టీ’ అనే ఆన్సర్ ఉంది. కానీ, నిజానికి యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీకి చెందిన వెరీ లార్జ్ టెలీస్కోప్ (వీఎల్టీ) 2004 లో మొదటిసారి ఈ ఫోటో తీసింది. దీన్ని నాసా నిర్ధారించింది కూడా. ఈ ప్రమోషనల్ వీడియోలో తలెత్తిన తప్పులతో గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ షేర్లు 9 శాతం క్రాష్ అయ్యాయి. ఒక్క రోజులోనే 100 బిలియన్ డాలర్లు (రూ.8.20 లక్షల కోట్లు) పడిపోయిందంటూ గుర్తు చేస్తూ సుందర్ పిచాయ్ తీసుకున్న నిర్ణయాల్ని ప్రశ్నిస్తున్నారు. -
ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్
Google Announces Staff Bonus to Global Employees: ఆల్ఫాబెట్ కంపెనీకి చెందిన గూగుల్ ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. కిందటి వారమే ‘ఆఫీస్ రిటర్న్’ పాలసీని కొంతకాలం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి ఊరట ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు అదనపు స్టాఫ్ బోనస్ ప్రకటించింది. కరోనా టైంలో సంస్థ కోసం పని చేస్తున్న తమ ఉద్యోగులందరికీ అండగా నిలిచేందుకు ముందుకొచ్చినట్లు బుధవారం గూగుల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఆఫీసులలో పని చేసే ఉద్యోగులతో పాటు ఎక్స్టెండ్ వర్క్‌ఫోర్స్, ఇంటర్న్స్‌కి కూడా వన్ టైం క్యాష్ బోనస్‌గా 1,600 డాలర్లు(మన కరెన్సీలో లక్షా 20 వేల దాకా) అందించనున్నట్లు పేర్కొంది. వర్క్‌ఫ్రమ్ హోం అలవెన్స్, వెల్బీయింగ్(సంక్షేమ) బోనస్‌తో పాటు ఈ అదనపు బోనస్ అందించనున్నారు. ఇక ఇందుకోసం ఎంత బడ్జెట్ కేటాయించారనే విషయాన్ని గూగుల్ ప్రతినిధి వెల్లడించలేదు. ఈ ఏడాది మార్చిలో గూగుల్ చేపట్టిన అంతర్గత సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కిందటి ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఉద్యోగులకు అందుతున్న బెనిఫిట్స్ బాగోలేవని ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు . దీంతో కంపెనీ హుటాహుటిన వెల్బీయింగ్ బోనస్ కింద 500 డాలర్లు(మన కరెన్సీలో 37వేల రూపాయలకు పైనే) అందించింది. ఇక జనవరి 10, 2022 నుంచి ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాలని ఆదేశించిన గూగుల్.. ఒమిక్రాన్ వేరియెంట్ నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేయడంతో పాటు వ్యాక్సినేషన్ తప్పనిసరి ఆదేశాలను సైతం నిలుపుదల చేసింది. చదవండి: గూగుల్‌లో ఇది చూశారా? దాని వాల్యూ ఎంతో తెలుసా? -
వర్క్‌ఫ్రమ్ హోం.. గూగుల్ గుడ్‌న్యూస్
Google Postpone Work From Home End In 2022 January: కరోనా వైరస్ వేరియెంట్ల విజృంభణతో పట్టింపు లేకుండా.. ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలన్న బడా కంపెనీల నిర్ణయానికి బ్రేకులు పడ్డాయి. ఈ విషయంలో ముందుగా నిర్ణయాలు ప్రకటించే ఆల్పాబెట్ కంపెనీ ‘గూగుల్’.. ఇప్పుడూ ముందడుగు వేసింది. గూగుల్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. జనవరి, 2022 నుంచి ఉద్యోగులు ఆఫీసులకు తప్పనిసరిగా రావాలన్న ఆదేశాల్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది గూగుల్. ఈమేరకు గురువారం ఎంప్లాయిస్‌కు ఎగ్జిక్యూటివ్‌ల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియెంట్ భయాందోళనలు, ఉద్యోగులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి ఆదేశాలపై నిరసన సెగలు తగిలిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిజానికి జనవరి నుంచి వర్క్‌ఫ్రమ్ హోం పాలసీకి ముగింపు పలకాలని, వారంలో కనీసం మూడు రోజుల చొప్పున ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలని (వ్యాక్సినేషన్ పూర్తైన వాళ్లను) గూగుల్ ప్రణాళిక వేసుకుంది. ఈ మేరకు ఉద్యోగులతో తేల్చి చెప్పింది కూడా. డెల్టా వేరియెంట్ భయాందోళనలు సైతం పట్టించుకోకుండా ముందుకెళ్లాలని అనుకుంది. అయితే ఈలోపే త్వరగతిన వ్యాపించే ఒమిక్రాన్ వేరియెంట్ ఆందోళన మొదలైంది. ఈ తరుణంలో ఆఫీస్ రిటర్న్ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ, ముందు అనుకున్న తేదీ (జనవరి 10, 2022) నాటికి నెలకొనే పరిస్థితులను సమీక్షించాకే మరో నిర్ణయం తీసుకుంటామని గూగుల్ ఎగ్జిక్యూటివ్స్, ఉద్యోగులతో పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే గూగుల్‌కు మొత్తం 60 దేశాల్లో 85 దాకా ఆఫీసులు ఉన్నాయి. జనవరి నుంచి ఉద్యోగుల నుంచి ఎలాగైనా ఉద్యోగులను రప్పించాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగులు గత కొన్నివారాలుగా ఆఫీసులకు ‘క్యూ’ కడుతున్నారంటూ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే ఈ ప్రకటన వెలువడిన కొన్నిగంటలకే వందల మంది ఉద్యోగులు.. వ్యాక్సినేషన్ తప్పనిసరి పాలసీపై నిరసన వ్యక్తం చేయడం, వర్క్‌ఫ్రమ్ హోం పాలసీలో మరికొన్నాళ్లు కొనసాగుతామని డిమాండ్ చేయడంతో గూగుల్ ఇరకాటంలో పడినట్లయ్యింది. చదవండి: ఒమిక్రాన్- హైదరాబాద్‌లో ఐటీ కంపెనీల పరిస్థితి ఏంటంటే.. -
Facebook: పేరు మారిస్తే ఫేస్బుక్ ఇమేజ్ దెబ్బతినదా?
Facebook Change Name: వరుస వివాదాలు, విమర్శల నడుమే పేరు మార్చుకోబోతున్నట్లు ఉప్పందించింది ఫేస్బుక్. ఇంటర్నెట్లో సంచనాలకు నెలవైన ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్.. ఉన్నట్లుండి పేరు మార్చుకోవడం గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అంతపెద్ద కంపెనీ సడన్‌గా పేరు మార్చుకుంటే చిక్కులు ఎదురుకావా? వ్యాపారానికి, గ్లోబల్ మార్కెట్‌కి ఇబ్బందులు ఏర్పడవా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పేరు మార్చుకోవడం ద్వారా ఫేస్‌బుక్‌కు టెక్నికల్‌గానే కాదు.. లీగల్‌గానూ ఎలాంటి సమస్యలు ఎదురు కావని చెప్తున్నారు నిపుణులు. ►టెక్ దిగ్గజాలు ఆల్ఫాబెట్ (గూగుల్), స్నాప్‌ఛాట్(స్నాప్ ఐఎన్‌సీ), యాపిల్ కంప్యూటర్(యాపిల్)గా పేర్లు మార్చేసినవే. ఇప్పుడు ఫేస్బుక్ ఐఎన్‌సీ(కంపెనీ) మార్చేసినా ఎలాంటి ప్రభావం ఉండబోదు. ►సోషల్ మీడియా దిగ్గజంగా పేరున్న ఫేస్‌బుక్‌ను ప్రపంచం మొత్తంలో 30 శాతం మంది ఉపయోగిస్తున్నారనేది అంచనా. ► ఫేస్బుక్ కంపెనీ నుంచి ఫేస్బుక్ యాప్, ఫేస్బుక్ మెసేంజర్‌తో పాటు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఓక్యూలస్.. ఇవేగాక మరికొన్ని మిస్టీరియస్ ప్రాజెక్టులు ఫేస్బుక్ కింద పని చేస్తున్నాయి. ఇక మెటావర్స్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపడుతున్న నేపథ్యంలోనే పేరును మార్చేయాలని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ నిర్ణయించుకున్నాడని కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. ►ఫేస్బుక్ కంటే ముందు.. చాలా ఏళ్లుగా కంపెనీలెన్నో తమ పేర్లు మార్చేసుకున్నాయి. వాటికి కారణాలూ ఉన్నాయి. ►సిగరెట్ కంపెనీ ఫిలిప్ మోరిస్ తనపై పడ్డ బ్యాడ్ మార్క్‌ను చెరిపేసుకునేందుకు 2003లో ఆల్ట్రియా గ్రూప్‌గా మార్చుకుంది. ►పెప్సికో రెస్టారెంట్ విభాగంలో టాకో బెల్, పిజ్జా హట్, కేఎఫ్సీలాంటివి ఉన్నాయి. అయితే రెస్టారెంట్ రంగంలో చక్రం తిప్పాలనే ఉద్దేశంతో వీటన్నింటికి కలిపి ‘యమ్!’ కిందకు తీసుకొచ్చింది పెప్సీకో. ►ప్రజల్లో మంచి మార్కుల కోసం.. వీటి నుంచి తప్పించుకునేందుకు కూడా కంపెనీలు పేరు మార్చుకున్న దాఖలాలు ఉన్నాయి. కెన్టూకీ ఫ్రైడ్ చికెన్‌ను ‘ఫ్రైడ్’ పదం మంచిదికాదనే ఉద్దేశంతో.. షార్ట్ కట్లో కేఎఫ్సీగా, సుగర్పాప్స్లో షుగర్ ఉందని ‘కార్న్ పాప్స్’గా, ది చైనీస్ గూస్బెర్రీ కాస్త ది కివీగా మారిపోయాయి. ►న్యాయపరమైన చిక్కులతోనూ కంపెనీలు పేర్లు మార్చుకున్నాయి. ఆండర్సన్ కన్సల్టింగ్.. యాసెంచర్గా పేరు మార్చుకుంది. ►తాజాదనం కోసం.. ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ తన పేరును ఫెడ్ఎక్స్గా మార్చేసుకుంది. పేరు మార్చడమంటే ఆఫీసుల్లో రౌండ్ టేబుల్ మీద అంతా కూర్చుని పేర్లు రాసుకుని.. బెస్ట్ పేరుకు ఓటేయడం కాదంటారు లారెన్ సుట్టన్. కంపెనీల పేర్లు మార్చే ప్రక్రియకు దీర్ఘకాలికంగా నడిచిన రోజులు ఉన్నాయని, పేర్లు మార్చడం కోసం కంపెనీలకు ఖర్చు కూడా తడిసి మోపెడు అవుతుందని చెప్తున్నారు. క్యాచ్వర్డ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడైన లారెన్.. ఆసానా, ఫిట్‌బిట్, ఇంటెల్, అప్‌వర్క్ పేర్లను ప్రతిపాదించారు కూడా. ‘‘కంపెనీలకు సరిపోయే పేరు పెట్టడం పెద్ద సమస్య. కొత్త పేరు కంపెనీ లక్క్క్ష్యాన్ని ప్రతిబింబించేదిలా ఉండాలి. ఇక ఫేస్బుక్ లాంటి కంపెనీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తోంది. కాబట్టి, ట్రేడ్ మార్క్స్ పరంగా న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా చూసుకోవాలి. అలాగే ఆ పేరు వెబ్ డొమైన్స్‌లో అందుబాటులో ఉండాలి అని చెప్తున్నారు లారెన్ సుట్టన్. ఫేస్బుక్ ఎందుకు మార్చాలనుకుంటోంది అనే దానిపై విశ్లేషకుల సమీక్ష మొదలైంది. కేవలం సోషల్ నెట్వర్క్ ప్లాట్‌ఫామ్‌గా మొదలై.. పేరెంట్ కంపెనీగా వాట్సాప్,ఇన్స్టాగ్రామ్ లాంటి మోస్ట్ యూజర్ యాప్స్‌ను తన కింద నడిపిస్తోంది ఫేస్బుక్. అయితే ఈమధ్యకాలంలో వివాదాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్‌ను డీల్ చేయడంలో యూజర్ భద్రత కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇస్తుందనే ఆరోపణ.. కంపెనీ(ఫేస్బుక్) పేరు ఘోరంగా బద్నాం అయ్యింది. ఈ తరుణంలోనే పేరు మార్చేయడం ద్వారా కొంతలో కొంత డ్యామేజ్ కంట్రోల్ చేయాలని ఫేస్బుక్ కంపెనీ భావిస్తుండొచ్చని ఆంటోనీ షోర్ చెప్తున్నారు. అడోడ్ లైట్రూం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్, యాసెంచర్లకు పేర్లు పెట్టింది ఈ టెక్ మేధావే. ‘‘గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్. ఈ విషయం చాలా కొద్దిమందికే తెలుసు. యూజర్లకు, సాధారణ ప్రజలకు పేరెంట్ కంపెనీ గురించి పెద్దగా పని లేదు. ఆ అవసరం కేవలం ఇన్వెస్టర్లకు, ఫైనాన్షియల్ ఆడియొన్స్‌కు ఉంటే సరిపోతుంది. అలాంటప్పుడు ఫేస్బుక్ పేరు మార్పు పెద్ద సమస్య కాదని ఆంటోనీ షోర్ అంటున్నారు. చదవండి: పేరు మార్చుకోనున్న ఫేస్బుక్? కారణాలు ఏంటంటే.. చదవండి: Facebook: ఫేస్బుక్ పేరు మార్పు..! కొత్త పేరు ఇదేనా...! -
రిలయన్స్ జియోవైపు గూగుల్ చూపు!
ఇటీవల పలు విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకట్టుకుంటున్న జియో ప్లాట్‌ఫామ్స్ తాజాగా టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ను సైతం ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు డిజిటల్, టెలికం విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో 4 బిలియన్ డాలర్లు(రూ. 30,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో గూగుల్ ఉన్నట్లు మార్కెట్లో వినిపిస్తోంది. చర్చలు కొనసాగుతున్నాయని.. ఈ డీల్ కొద్ది వారాలలో వెల్లడికావచ్చని మార్కెట్ వర్గాలు ఊహిస్తున్నాయి. రానున్న 5-7 ఏళ్ల కాలంలో దేశీయంగా 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే ప్రణాళిల్లో ఉన్నట్లు సోమవారం గూగుల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా డిజిటల్ టెక్నాలజీస్‌లో మరింత విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో జియోలో పెట్టుబడులపై అంచనాలు పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ అంశంపై అటు ఆర్ఐఎల్, ఇటు గూగుల్ స్పందించకపోవడం గమనార్హం! ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 1 శాతం బలహీనపడి రూ. 1915 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1942 వద్ద గరిష్టాన్నీ, రూ. 1887 వద్ద కనిష్టాన్నీ తాకింది. క్వాల్‌కామ్‌తో.. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ ఆర్ఐఎల్కు అనుబంధ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో తాజాగా చిప్ దిగ్గజం క్వాల్కామ్ రూ. 730 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. తద్వారా జియోలో 0.15 శాతం వాటాను సొంతం చేసుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 25.24 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఆర్ఐఎల్ రూ. 1.18 లక్షల కోట్లకుపైగా సమీకరించింది. జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌సహా చిప్ దిగ్గజాలు ఇంటెల్, క్వాల్కామ్.. పీఈ సంస్థలు కేకేఆర్, సిల్వర్ లేక్ తదితరాలు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ పెట్టుబడులకు జతగా రైట్స్ ఇష్యూ ద్వారా ఆర్ఐఎల్ రూ. 53,124 కోట్లను సమకూర్చుకుంది. ఈ బాటలో గతేడాది ఇంధన రిటైల్ నెట్‌వర్క్‌లో 49 శాతం వాటా అమ్మకం ద్వారా బీపీ నుంచి రూ. 7,000 కోట్లు సమీకరించింది. వెరసి నికరంగా రుణరహిత కంపెనీగా ఆవిర్భవించినట్లు గత నెలలో ఆర్ఐఎల్ తెలియజేసింది. మార్చికల్లా ఆర్ఐఎల్ రుణ భారం రూ. 1.6 లక్షల కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. -
ఫాంగ్ స్టాక్స్ పుష్- నాస్డాక్ రికార్డ్
ఒకే రోజు ఏకంగా 60,000 మందికి కరోనా సోకడంతో రోగుల సంఖ్య 30 లక్షలకు చేరినప్పటికీ బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలోనే సాగాయి. ప్రధానంగా టెక్ దిగ్గజాలు అండగా నిలవడంతో నాస్డాక్ 149 పాయింట్లు(1.5 శాతం) ఎగసి 10,492 వద్ద ముగిసింది. వెరసి మరోసారి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది.ఈ బాటలో ఎస్అండ్పీ 25 పాయింట్లు(0.8 శాతం) బలపడి 3170 వద్ద నిలవగా.. డోజోన్స్ 177 పాయింట్లు(0.7 శాతం) బలపడి 26,067 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌కు ప్రధానంగా టెక్ దిగ్గజాలు యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అల్ఫాబెట్ దన్నునిచ్చాయి. ఈకామర్స్‌లో వాల్‌మార్ట్ పోటీకి తెరతీసినప్పటికీ అమెజాన్ మరోసారి సరికొత్త గరిష్టాన్ని తాకగా.. ఎస్అండ్పీ మార్చి కనిష్టం నుంచి 40 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! షేర్ల తీరిలా ఐఫోన్ల దిగ్గజం యాపిల్ 0.5 శాతం పుంజుకుని 383 డాలర్ల వద్ద రికార్డ్ గరిష్టాన్ని అందుకుంది. అమెజాన్ 0.5 శాతం బలపడి 3095 డాలర్లను తాకింది. ఇక మైక్రోసాఫ్ట్ 0.3 శాతం లాభంతో 213 డాలర్ల వద్ద, అల్ఫాబెట్ 1500 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. ఇతర కౌంటర్లలో అల్జెమీర్స్(మతిమరుపు వ్యాధి)కి ప్రయోగాత్మక చికిత్సను అందించేందుకు దరఖాస్తు చేసిన వార్తలతో ఫార్మా కంపెనీ బయోజెన్ ఇంక్ 4.4 శాతం జంప్‌చేసింది. నేషనల్ జనరల్ హోల్డింగ్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించడంతో బీమా సంస్థ ఆల్స్టేట్ కార్ప్ 5 శాతం పతనమైంది. నేషనల్ జనరల్ మాత్రం 66 శాతం దూసుకెళ్లింది. క్రూయిజర్, ఎయిర్‌లైన్స్ కౌంటర్లు నీరసిస్తున్నప్పటికీ ఫాంగ్ స్టాక్స్ అండగా నిలవడంతో మార్కెట్లు బలపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. -
యూఎస్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారా?
గత కొద్ది నెలలుగా అమెరికా స్టాక్ ఇండెక్సులు సరికొత్త రికార్డులను సాధిస్తున్నాయి. ప్రధానంగా ఎస్అండ్పీ, నాస్డాక్ జోరు చూపుతున్నాయి. నాస్డాక్ అయితే ఈ ఏడాది(2020)లో ఇప్పటివరకూ 20 సార్లకుపైగా చరిత్రాత్మక గరిష్టాలను తాకింది. కోవిడ్-19 సవాళ్లలోనూ అమెరికన్ మార్కెట్లు బుల్ ట్రెండ్‌లో కదులుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు ఇన్వెస్టర్ల ఫేవరెట్ స్టాక్స్ FAANG కారణమని తెలియజేశారు. FAANG అంటే ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, అల్ఫాబెట్(గూగుల్(G) మాతృ సంస్థ). ఈ కంపెనీల తొలి అక్షరాలతో కలిపి ఫాంగ్ స్టాక్స్‌గా పిలిచే సంగతి తెలిసిందే. ఇక ఇటీవల వీటికి M అంటే టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జత కలిసింది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్, వీడియో యాప్ జూమ్ సైతం ఈ జాబితాలో చేరడంతో మార్కెట్లు రికార్డుల దౌడు తీస్తున్నట్లు వివరించారు. వెరసి ఇటీవల దేశీ ఇన్వెస్టర్లు FAAMNG స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఆసక్తి చూపుతున్నట్లు మార్నింగ్‌స్టార్ ఇండియా తెలియజేసింది. రూ. 6000 కోట్లు యూఎస్ స్టాక్ మార్కెట్లలో దేశీ ఇన్వెస్టర్లు రూ. 6,000 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసినట్లు మార్నింగ్‌స్టార్ ఇండియా వెల్లడించింది. అయితే ఈ పెట్టుబడుల్లో FAAMNG స్టాక్స్‌దే హవా అని తెలియజేసింది. దేశీ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో మార్కెట్లకు జోష్‌నిస్తున్న ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్కుతోడు మైక్రోసాఫ్ట్, టెస్లా ఇంక్, జూమ్ చోటు చేసుకుంటున్నట్లు పేర్కొంది. కొంతకాలంగా టెక్నాలజీ రంగానికి పెట్టుబడులు భారీగా మళ్లుతున్నాయని, అయితే దేశీయంగా ఇందుకు అవకాశాలు తక్కువేనని వెస్టెడ్ ఫైనాన్స్ సీఈవో విరామ్ షా వివరించారు. ఇటీవల యూఎస్‌లో ఇన్వెస్ట్‌చేసే వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలియజేశారు. ఇందుకు ఫేస్బుక్, స్టార్‌బక్స్ వంటి గ్లోబల్ బ్రాండ్లు వారికి సుపరిచితంకావడం కారణమని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే విద్య, ప్రయాణాలు తదితర అంశాలకు పలువురు భారతీయులు యూఎస్‌పై భారీగా సొమ్ము వెచ్చిస్తున్నట్లు అలంకిత్ లిమిటెడ్ ఎండీ అంకిత్ అగర్వాల్ వివరించారు. గత 10 నెలల్లోనే 10,000 మంది కస్టమర్లు ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించినట్లు తెలియజేశారు. వీటి విలువ 3 కోట్ల డాలర్లు(రూ. 225 కోట్లు)గా వెల్లడించారు. పెట్టుబడులిలా.. అమెరికన్ స్టాక్ మార్కెట్లలో దేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపట్టాలంటే రెండు మార్గాలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. వీటిలో ఒకటి అతిసులువైన మ్యూచువల్ ఫండ్స్ రూట్. విదేశాలలో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను ఎంచుకోవడం. మరొకటి స్వేచ్చా రెమిటెన్స్ పథకం(ఎల్ఆర్ఎస్) ద్వారా ఇన్వెస్ట్ చేయడం. అయితే పెట్టుబడులకు మ్యూచువల్ ఫండ్ లేదా ఈటీఎఫ్ ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు. -
గూగుల్ అరుదైన ఘనత..
న్యూయార్క్ : ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ మార్కెట్ విలువ లక్ష కోట్ల డాలర్లకు ఎగిసి ఈ ఘనత సాధించిన నాలుగవ అమెరికన్ టెక్నాలజీ కంపెనీగా నిలిచింది. అల్ఫాబెట్ షేర్లు గురువారం 0.76 శాతం పెరగడంతో ట్రేడ్ ముగిసే సమయానికి కంపెనీ విలువ లక్ష కోట్ల డాలర్లకు చేరింది. ఇక 2018లో యాపిల్ తొలిసారిగా లక్ష కోట్ల డాలర్ల క్లబ్లో చేరగా ఇప్పుడు దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.38 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. మరోవైపు మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 1.26 లక్షల కోట్ల డాలర్లు కాగా, మరో టెక్ దిగ్గజం అమెజాన్ సెప్టెంబర్ 2018లో లక్ష కోట్ల డాలర్లకు చేరింది. కాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు ఇటీవల అల్ఫాబెట్ సీఈఓ బాధ్యతలను సైతం కట్టబెట్టిన సంగతి తెలిసిందే. పిచాయ్ ప్రమోషన్‌తో గూగుల్ సహ వ్యవస్ధాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్లు కంపెనీ రోజువారీ వ్యవహారాల నుంచి వైదొలిగారు. చదవండి : భారత్‌లో గూగుల్ నియామకాలు -
సుందర్ పిచాయ్ వార్షిక వేతనం ఎంతో తెలుసా
అల్ఫాబెట్ కొత్త సీఈవో సుందర్ పిచాయ్ మరో అద్భుతమైన ఘనతను దక్కించుకున్నారు. అత్యంత శక్తిమంతమైన సాంకేతిక దిగ్గజాల్లో ఒకరుగా నిలిచిన పిచాయ్ ఇపుడు అతిపెద్ద స్టాక్ అవార్డును పొందనున్నారు. రాబోయే మూడేళ్ళలో పనితీరు-ఆధారిత స్టాక్ అవార్డు రూపంలో 240 మిలియన్ డాలర్లు (సుమారు రూ.17వందల కోట్ల) అందుకుంటారు. అలాగే 2020 నుండి పిచాయ్ అందుకోనున్న (టేక్ హోం) వార్షిక వేతనం 20 లక్షల డాలర్లు. ఈ మేరకు అల్ఫాబెట్ శుక్రవారం అందించిన రెగ్యులేటరీ ఫైలింగులో తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న కార్పొరేట్ సీఈవోలలో సుందర్ పిచాయ్ ఒకరు. గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్ అందుకున్న వార్షిక వేతనం 1300 కోట్ల రూపాయలు. 2015లో గూగుల్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, పిచాయ్ వార్షిక వేతనం 652,500 డాలర్లు. మరుసటి సంవత్సరం అతని ఆదాయాలు ఆకాశాన్నంటింది. ముఖ్యంగా 199 మిలియన్ల డాలర్ల భారీ స్టాక్ అవార్డును గూగుల్ సంస్థ అందించింది. కాగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు అద్భుత అవకాశం దక్కిన విషయం తెలిసిందే. గూగుల్ మాతృసంస్థ , ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్లు సంస్థను స్థాపించిన 21 ఏళ్ల తరువాత రిటైర్మెంట్ తీసుకుంటున్న కారణంగా అల్ఫాబెట్‌కు సీఈవోగా పిచాయ్ ఎంపికయ్యారు. దీంతో సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పోరేట్‌గా దిగ్గజంగా అవతరించారు. ఈక్విలార్ ప్రకారం అమెరికాలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన మిడియాన్ సీఈఓ మూలవేతనం 1.2 మిలియన్ల డాలర్లు. -
అరుదైన మైలురాయికి చేరువలో మైక్రోసాఫ్ట్
సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఓ అరుదైన మైలురాయికి చేరువవుతోంది. ఈ సంస్థ త్వరలోనే మార్కెట్ విలువ పరంగా ఒక ట్రిలియన్ డాలర్ల(సుమారు రూ.65 లక్షల కోట్లు) కంపెనీగా అవతరించబోతున్నట్టు ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ షేర్లు కూడా సోమవారం ఏడు శాతానికి పైగా పెరిగాయని టెక్నాలజీ వెబ్సైట్ గీక్‌వైర్ రిపోర్టు చేసింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 722 బిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 47లక్షల కోట్లు)గా ఉంది. ఏడాది కాలంలోనే ఈ విలువ ట్రిలియన్ డాలర్లకు పెరిగే అవకాశాలున్నాయని మోర్గాన్ స్టాన్లీ భావిస్తోంది. అయితే ఆపిల్, ఆల్ఫాబెట్, అమెజాన్ కంపెనీల్లో ఒకటి తొలి ట్రిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించబోతుందని పలువురు టెక్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోర్గాన్ స్టాన్లీ అంచనాలు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఆపిల్ మార్కెట్ విలువ 876 బిలియన్ డాలర్లు కాగ, అమెజాన్ 753 బిలియన్ డాలర్లుగా, ఆల్ఫాబెట్ 731 బిలియన్ డాలర్లుగా ఉంది. క్లౌడ్ టెక్నాలజీ, మెరుగైన కస్టమర్ బేస్, మార్జిన్స్, అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ వంటివి మైక్రోసాఫ్ట్ మార్కెట్ పెరగడానికి దోహదపడతాయని మోర్గాన్ స్టాన్లీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
గూగుల్ ఉద్యోగులకు మాడ్యులర్ ఇళ్లు
న్యూయార్క్: ఐటీ కంపెనీలకు నిలయమైన అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఇళ్ల కొరత తీవ్రంగా ఉండి, ఇంటి ధరలు ఆకాశాన్ని అందుకోవడంతో గూగుల్ కంపెనీ తమ ఉద్యోగుల సౌకర్యార్థం ఏకంగా 300 మాడ్యులర్ ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు గూగుల్ మాతృసంస్థ అయిన అల్ఫాబెట్ ఇన్కార్పొరేషన్ ఈ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన ‘ఫ్యాక్టరీ ఓఎస్’తో మూడు కోట్ల డాలర్ల ఒప్పందం చేసుకుంది. నిర్దిష్ట వాతావరణంగల ఫ్యాక్టరీలో ఈ మూడు వందల మాడ్యులర్ ఇళ్లను నిర్మించి ఫ్యాక్టరీ ఓఎస్ కంపెనీ గూగుల్ చెప్పిన చోటుకు వాటిని తరలిస్తుంది. మియామి, డెట్రాయిడ్, న్యూయార్క్ రాష్ట్రాల్లో కూడా ఇళ్ల కొనగోళ్లు అతి భారంగా మారడంతో స్థానిక ప్రజలంతా ఇప్పుడు మాడ్యులర్ ఇళ్లనే ఆశ్రయిస్తున్నారు. తాము నిర్మించిన ఇళ్లలో అద్దెకు ఉండడం వల్ల నెలకు ఎవరైనా తమ అద్దెలో 700 డాలర్లు పొదుపు చేయవచ్చని ‘ఫ్యాక్టరీ ఓఎస్’ వ్యవస్థాపక సీఈవో రిక్ హోలీడే చెబుతున్నారు. అలమెడా, శాంతాక్లారా, శాన్‌మాటియో సహా సిలికాన్ వ్యాలీలో 2012లో ఇళ్ల ధరలు 535,614 డాలర్లు ఉండగా, అది 2016 నాటికి 888,444 డాలర్లకు చేరుకుందని ఆన్లైన్ రియల్ ఎస్టేట్ సంస్థ ‘ట్రూలియా’ తెలిపింది. ఇళ్ల రియల ఎస్టేట్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో టెక్ దిగ్గజ కంపెనీలన్నీ తమ ఉద్యోగుల కోసం మాడ్యులర్ ఇళ్లనే ఆశ్రయిస్తున్నాయి. ఫేస్బుక్ ఇన్కార్పొరేషన్ మెన్లోపార్క్లో తమ ఉద్యోగుల కోసం 1500 ఇళ్లను నిర్మించాలనుకుంటోంది. ఇక్ ఆపిల్ కంపెనీ కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో 28 లక్షల చదరపు అడుగుల్లో కొత్తగా నిర్మించిన సర్కులర్ భవనంలోకి తమ వేలాది మంది ఉద్యోగులను తరలించాలని నిర్ణయించింది.