ప్రముఖ టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్.. గూగుల్ హెల్ప్ వర్కర్ల కాంట్రాక్ట్‌ను అర్ధాంతరంగా ముగించి నిర్ధాక్షణ్యంగా వారిని విధుల నుంచి తొలగించింది. ఇంతకీ వాళ్లు చేసిన పాపం ఏంటంటే యూనియన్ ఏర్పాటుకు ప్రయత్నించడమే. ఈ మేరకు ఆరోపిస్తూ యూఎస్ లేబర్ బోర్డ్‌కి బాధిత ఉద్యోగులు ఫిర్యాదు చేశారు.
యూనియన్ ఏర్పాటుకు ప్రయత్నించిన ఉద్యోగులపై కక్ష తీర్చుకునేందుకు గూగూల్ మాతృసంస్థ ఆల్ఫాబిట్ తీసుకున్న నిర్ణయం ఫెడెరల్ కార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ పేర్కొంది.
బాధిత ఉద్యోగుల్లో 70 శాతం మందికిపైగా తాము ఉద్యోగాలు కోల్పోతున్నామని జులైలో చెప్పినట్లు నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్ ఫైలింగ్‌ను ఉటంకిస్తూ ‘బ్లూమ్‌బెర్గ్’ నివేదించింది. ఆస్టిన్, టెక్సాస్, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాతోపాటు యూఎస్‌లోని ఇతర ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల తొలగింపు గురించి "టౌన్ హాల్" ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆల్ఫాబెట్ తెలియజేసింది. అలాగే ఉద్యోగులకూ ఈమెయిల్స్ పంపించింది.
Lay off: ‘మేం పీకేశాం.. వారికి ఎవరైనా జాబ్ ఇవ్వండి ప్లీజ్’
బాధిత ఉద్యోగుల్లో 118 మంది రైటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, కంటెంట్ రూపొందించే లాంచ్ కోఆర్డినేటర్‌లు ఉన్నారు. వీరింతా గూగూల్ సెర్చ్ రిజల్ట్స్, ఏఐ చాట్‌బాట్ నాణ్యతను మెరుగుపరచడంలో కీలకంగా పనిచేశారు. యాక్సెంచర్ ద్వారా వీరిని నియమించుకున్నప్పటికీ, చట్టబద్ధంగా గూగుల్ సంస్థే తమకు తమ యజమాని అని ఉద్యోగులు పేర్కొంటున్నారు. యాక్సెంచర్‌తోపాటు గూగుల్‌ను తమకు ఉమ్మడి యజమానిగా గుర్తించాలని లేబర్ బోర్డ్‌ను కోరుతున్నారు.
2018లో ఆల్ఫాబెట్ కాంట్రాక్టు వర్కర్లలో చాలా మంది దాని గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో భాగమయ్యారని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. అదేవిధంగా కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్న ఆల్ఫాబెట్ కాంట్రాక్ట్ వర్కర్లు యూనియన్ చేయడానికి 2023 ఏప్రిల్‌లో ఆమోదం లభించింది. ఆ కార్మికుల ఉమ్మడి యజమాని ఆల్ఫాబెట్ అని నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్ రీజనల్ డైరెక్టర్ జులై నెలలో ఇచ్చిన తీర్పును సభ్యులందరూ సమర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment