Google: ఒకేరోజు 9.5శాతం కుంగిన ఆల్ఫాబెట్‌ఇంక్‌! | Alphabet Inc Slumped 9% In One Day | Sakshi
Sakshi News home page

Google: ఒకేరోజు 9.5శాతం కుంగిన ఆల్ఫాబెట్‌ఇంక్‌!

Published Thu, Oct 26 2023 10:48 AM | Last Updated on Thu, Oct 26 2023 11:36 AM

Alphabet Inc Slumped 9 Percent On One Day - Sakshi

గూగుల్-ఆల్ఫాబెట్ఇంక్ క్లౌడ్ బిజినెస్‌లో మూడో త్రైమాసిక ఆదాయంలో 22.5% వృద్ధిని నమోదు చేసింది. గూగుల్ క్లౌడ్ త్రైమాసికంలో నికర లాభాన్ని పోస్ట్ చేసింది. అయినప్పటికీ ఆల్ఫాబెట్‌ఇంక్‌ ఫలితాల్లో వాల్ స్ట్రీట్ అంచనాలను మించలేకపోయింది. దాంతో బుధవారం మార్కెట్‌ ముగింపు సమయానికి కంపెనీ స్టాక్‌ 9.5శాతం తగ్గి 125.6 అమెరికన్‌ డాలర్ల వద్ద స్థిరపడింది.

ఫలితాలు విడుదల సందర్భంగా ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌పిచాయ్‌ మాట్లాడుతూ ప్రతిఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మరింత ఉపయోగకరంగా మార్చడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నామని చెప్పారు. అందరికి ప్రముఖ ఏఐ మోడల్‌లను చేరువ చేస్తామన్నారు. ఏఐ రంగంలో అద్భుతమైన పురోగతి ఉందని చెప్పారు. కృత్రిమమేధలో పెట్టుబడి పెట్టడానికి వీలైనంత ఎక్కువ అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 

గూగుల్‌ క్లౌడ్ ఆదాయ వృద్ధి గడిచిన త్రైమాసికంతో పోలిస్తే 28% నుంచి 22.5%కి మందగించింది. యూనిట్ మూడో త్రైమాసిక ఆదాయం రూ.69వేలకోట్లుకు పెరిగింది. ఈ యూనిట్‌ నిర్వహణ పరంగా గతేడాది రూ.3660 కోట్ల నష్టంతో పోలిస్తే, రూ.2213కోట్ల ఆదాయాన్ని పోస్ట్ చేసింది. అయితే వాల్ స్ట్రీట్ క్లౌడ్ కంప్యూటింగ్ నిర్వహణ..రూ.3600 కోట్లు, ఆదాయం..రూ.71వేల కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. కొందరు కస్టమర్లు కాస్ట్‌కటింగ్‌ పేరిట్‌ క్లౌడ్‌ సేవలు వినియోగించుకోలేదని దాంతో యూనిట్‌ అ‍మ్మకాలు దెబ్బతిన్నాయని సీఎఫ్‌ఓ రూత్ పోరట్ తెలిపారు. 

గూగుల్‌క్లౌడ్‌ ప్లాట్‌ఫారమ్ సేవలు, సహకార సాధనాలు, కస్టమర్‌ల కోసం ఇతర ఎంటర్‌ప్రైజ్ సేవలు అందిస్తూ ఆదాయం సంపాదిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement